Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సింగర్లుగా అవతారమెత్తిన యాంకర్లు.. ఇది మామూలు రచ్చ కాదు
యాంకర్ సుమ, రవి కలిసి ఓ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతీవారం గెస్ట్‌లుగా సెలెబ్రిటీలను పట్టుకురావడం, కంటెస్టెంట్లలో చిత్ర విచిత్ర విన్యాసాలను చేయించడం పరిపాటిగా వస్తోంది. అయితే ఈ షోను బిగ్ బాస్ విన్నర్‌లను గెస్ట్‌లుగా తీసుకొచ్చి సుమ గ్రాండ్‌గా ప్రారంభించింది. మొత్తానికి సుమ ఈ షోను పైకి లేపేందుకు చాలానే కష్టపడుతోంది. అందులో భాగంగా సుమ కొత్త అవతారమెత్తింది.

స్పెషల్ గెస్ట్‌లు..
సుమ, రవి కలిసి హోస్ట్ చేస్తోన్న ఈ షోలో ఇప్పటి వరకు రాహుల్, కౌశల్, అలీ, బ్రహ్మాజీలు పాల్గొన్నారు. గత వారం షోలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, త్రీ మంకీస్ గెస్ట్‌లుగా వచ్చారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌లు వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఇక తదుపరి వారంలో యాంకర్లు కొత్త అవతారమెత్తారు.

సింగర్లుగా మారిన యాంకర్లు..
వచ్చే వారానికి సంబంధించిన బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్లుగా ఉన్న రవి, సుమలు సింగర్లుగా మారిపోయారు. ఇద్దరూ కలిసి మైకు ఎత్తుకుని తమ గాత్రాలకు పదును పెట్టి పాటలు ఆలపించారు.

సువ్వి సువ్వి..
సువ్వి సువ్వి సీతాలమ్మ అనే పాటను సుమ, రవి కలిసి ఆలపించారు. అయితే ఈ పాట పాడటం వెనక, అలా సింగర్లుగా మారడం వెనకాల పెద్ద ప్లానే ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ వారం వచ్చే గెస్ట్‌లు సింగర్ల క్యాటగిరీకి చెందిన వారై ఉంటారని తెలుస్తోంది.
Recommended Video

గతంలోనూ అలా..
అయితే సుమ గొంతు సవరించడం ఇదేమీ మొదటి సారి కాదు. విన్నర్ సినిమా కోసం అనసూయ ఓ ఐటం సాంగ్ చేసింది. సూయ సూయ అనసూయ.. అనే పాటలో అనసూయ స్టెప్పులు వేయగా.. ఆ పాటను సుమ పాడింది. ఆ పాట కూడా బాగానే క్లిక్ అయింది. అలా సుమ అప్పుడే సింగర్‌గా మారిపోయింది. మళ్లీ తాజాగా ఇలా తన గొంతును సవరించింది.