For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మొదటిసారి తన చెల్లిని పరిచయం చేసిన సుమ.. షాక్ అవ్వకండి అంటూ..

  |

  తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న టాప్ మోస్ట్ యాంకర్ సుమ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై సుమ దాదాపు అన్ని రకాల షోలలో వ్యాఖ్యాతగా కనిపించింది. సుమ ఎలాంటి షో చేసినా కూడా చాలా తక్కువ కాలంలోనే ఆ ప్రోగ్రామ్ జనాల్లోకి వెళుతుంది. పెద్దగా కాంట్రవర్సీలోకి వెళ్లకుండా ఆరోగ్యకరమైన కామెడీతో నిత్యం నవ్విస్తూనే ఉంటారు. ఇక ఇటీవల సుమ సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ గా అందులో వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. మొదటిసారి ఆమె తన సోదరిని పరిచయం చేస్తూ ప్రేక్షకులకు కొంత సర్ ప్రైజ్ కు గురిచేసింది.

  అప్పటి నుంచి కెరీర్ యూ టర్న్

  అప్పటి నుంచి కెరీర్ యూ టర్న్

  పుట్టి పెరిగింది మలయాళం లోనే అయినప్పటికీ సుమకు తెలుగుతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మొదట సీరియల్స్ లో నటి గా కనిపించిన సుమ హీరోయిన్ గా కూడా వెండితెరపై అడుగులు వేసే ప్రయత్నం చేసింది. కానీ అటువైపు ఆమెకు ఎక్కువగా అవకాశాలు లేకపోవడంతో యాంకర్ గానే అనుకోకుండా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. యాంకర్ గా ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేసిందో ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.

  సుమ ఉంటే.. అదొక ధైర్యం

  సుమ ఉంటే.. అదొక ధైర్యం

  ఇక తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న అనంతరం యాంకర్ సుమ తెలుగువాళ్లకు మరింత దగ్గరైంది. వరుసగా రియాల్టీ షోలతో, సరదా గేమ్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు వచ్చారు. సినిమా ఈవెంట్స్ లో కూడా హోస్ట్ గా కనిపిస్తూ మంచి గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాల ఈవెంట్స్ లలో ఎక్కువగా సుమ యాంకర్ గా కనిపిస్తూ ఉంటుంది. సుమ ఈవెంట్స్ లో ఉంటే దాదాపు సక్సెస్ అయినట్లే అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఇక ఈవెంట్ చేసే చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఒక విధంగా సుమ ఉంటే ధైర్యంగా ఉంటారు.

   సుమ చెల్లి..

  సుమ చెల్లి..

  యాంకర్ సుమ ఇలాంటి షో చేసినా కూడా ఈజీగా జనంలోకి ఎక్కేస్తుంది. రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ స్థాపించే వివిధ రకాల వీడియోలతో ప్రేక్షకులకు సరికొత్త ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సోదరుని పరిచయం చేశారు. ఇన్నేళ్ల కెరీర్ లో పెద్దగా తన కుటుంబ సభ్యులని పరిచయం చేయని సుమ మొదటిసారి ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా చెల్లిని కెమెరా ముందుకు తీసుకువచ్చారు.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
   సొంత చెల్లి కాదు.. అంతకంటే ఎక్కువ

  సొంత చెల్లి కాదు.. అంతకంటే ఎక్కువ

  మొదట సుమ వీడియోలో తన సోదరి అని చెప్పగానే అందరూ నమ్మేశారు. కానీ కొంత సేపటి అనంతరం ఆమె తన సొంత చెల్లి కాదని.. కానీ అంతకంటే ఎక్కువ అంటూ వివరణ ఇచ్చింది. మావయ్య కూతురు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఆప్యాయంగా పెరిగాము అని.. అందుకే తనకు సోదరితో సమానమని వివరణ ఇచ్చింది. ఓనమ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ట్రెడిషనల్ గా సిద్ధమైన సుమ తన సోదరితో కలిసి ప్రత్యేకమైన వంటలను సిద్ధం చేసుకొని కలిసి భోజనం చేశారు. కా వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ యూట్యూబ్ ఛానల్ ని రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ చేయించడం జరిగింది.

  English summary
  Anchor suma introduced her sister in youtube content,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X