For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mr & Mrs Reality Show జడ్జిగా అనిల్ రావిపూడి.. నా ఆస్తిని మొత్తం రాసిస్తా అంటూ శ్రీముఖికి కౌంటర్

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సరికొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటి వరకు మెగాఫోన్ చేతపట్టుకొని కెమెరా వెనుక నుంచి బాక్సాఫీస్‌ను శాసిస్తున్న అనిల్ రావిపూడి మిస్టర్ అండ్ మిసెస్ అనే రియాలిటీ షోలో జడ్జీగా అవతారం ఎత్తారు. ఈ రియాలిటీ షోను జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా పలు షోలకు దర్శకత్వం వహిస్తున్న అనిల్ కడియాల, నిర్మాత ప్రవీణా కడియాల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో వైరల్ అయింది. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

  అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈటీవీలో

  అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈటీవీలో

  బుల్లితెర మీద పాడుతా తీయగా, స్వరాభిషేకం, ఆలీతో ఆరేళ్లుగా ఆలీతో సరదాగా షోను, వావ్ లాంటి రియాలిటీ షోలను నిర్మిస్తున్న ప్రవీణా, అనిల్ కడియాల మిస్టర్ అండ్ మిసెస్ షోను డిజైన్ చేశారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీలో అక్టోబర్ 11వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతీ మంగళవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ షోకు టాప్ హీరోయిన్ స్నేహ, బిగ్‌బాస్ విన్నర్, నటుడు, నిర్మాత శివబాలాజీ, అనిల్ రావిపూడి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

  10 మంది జంటలతో హంగామా

  10 మంది జంటలతో హంగామా

  మిస్టర్ అండ్ మిసెస్ రియాలిటీ షోలో తెలుగు వినోద పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు మొత్తం 10 మంది జంటలుగా పాల్గొంటున్నారు. వారిలో జబర్దస్త్ రాకేశ్‌, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ సుజాత, రవికిరణ్‌-సుష్మా, పవన్‌-అంజలి, సందీప్‌-జ్యోతి, హ్రితేష్‌-ప్రియా, శ్రీవాణి-విక్రమ్‌, మధు-ప్రియాంక, ప్రీతమ్‌-మానస, సిద్దు-విష్ణుప్రియ, విశ్వ-శ్రద్ధ పాల్గొంటున్నారు. పాపులర్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

  అనిల్ రావిపూడి, స్నేహ, శివ బాలాజీ జడ్జీలుగా

  అనిల్ రావిపూడి, స్నేహ, శివ బాలాజీ జడ్జీలుగా

  మిస్టర్ అండ్ మిసెస్ షో ప్రారంభం సందర్భంగా అనిల్ కడియాల, ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి, స్నేహ, శివబాలాజీ స్పెషల్ జడ్జీలుగా పాల్గొనడం ఈ షోకు స్పెషల్ ఎట్రాక్షన్. పది సెలబ్రిటీ జంటలకు రకరకాల టాస్క్‌లు ఉంటాయి. ఫైనల్‌లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ ఉంటుంది అని తెలిపారు.

   శ్రీముఖిపై అనిల్ రావిపూడి సెటైర్లు

  శ్రీముఖిపై అనిల్ రావిపూడి సెటైర్లు

  మిస్టర్ అండ్ మిసెస్ తొలి ఎపిసోడ్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి గ్రాండ్‌గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. వేదికపైన హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా.. లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా? అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వేదిక మీదకు రాగానే.. శ్రీముఖిపై సెటైర్లు వేశారు. లవ్ లెటర్ రాస్తే. అవతలి వాళ్లు కచ్చితంగా ఒప్పుకొంటారు అని శ్రీముఖి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నీలాంటి అమ్మాయి అయితే.. నా ఆస్తి అంతా ఇస్తానంటే.. ఒప్పుకొంటారు అని అనిల్ రావిపూడి కౌంటర్ ఇచ్చారు.

  ఆడవాళ్లకు ఫ్రస్టేషన్ ఆసనం..

  ఆడవాళ్లకు ఫ్రస్టేషన్ ఆసనం..

  అయితే అబ్బాయిలకు ఎలాంటి లవ్ లెటర్ రాస్తే.. ఒప్పుకొంటారు అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అబ్బాయిలకు అలాంటివి అవసరం లేదు. కేవలం మనసిస్తే చాలూ.. అని అన్నాడు. ఇక దానితోపాటు అబ్బాయిలకు ఫ్రస్టేషన్, కన్నీళ్లు, బాధలు, ఓదార్పు యాత్రలు అడిషనల్‌గా వస్తాయి కదా అని శ్రీముఖికి మరో కౌంటర్ ఇచ్చారు.

  అయితే శ్రీముఖి వేసిన మరో ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ.. ఫ్రస్టేషన్ నుంచి బయటపడటానికి మగవాళ్లకు ఒక ఆసనం ఇచ్చారు అనే కంప్లయింట్ నాపై ఉంది. కానీ ఈ ఎపిసోడ్ అయ్యేవరకు ఆడవాళ్లకు కూడా ఓ ఆసనం ఇచ్చే వెళ్తాను అని అన్నారు.

  English summary
  Top Director Anil Ravipudi is special judge for Gnapika Entertainments Private Limited's Mr & Mrs Reality Show which is produced by Anil Kadiyala and Praveena Kadiyala. Top Anchor Sreemukhi is going to host the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X