Just In
- 2 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 3 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 4 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 5 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మనుషులేనా?: ఏనుగుపైకి మండుతున్న టైరు విసిరి ప్రాణం తీశారువీడియో
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్‌లో రియల్ ఫైట్: కిందపడి కొట్టుకున్న కంటెస్టెంట్లు.. అవినాష్ అతి వల్లే గొడవ!
బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీనికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రసారం అయిన ప్రతిసారీ తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్ అవుతోంది. ఇది విజయవంతం అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో హౌస్‌లో జరిగే కొన్ని గొడవలు, కోట్లాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత సీజన్‌లో రియల్ ఫైట్ జరిగింది. జబర్ధస్త్ అవినాష్ చేసిన ఓ పని వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే.....

బిగ్ బాస్ షోకు ప్లస్ అయిన గొడవలు
బిగ్ బాస్ షో తెలుగులో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే బుల్లితెరపై టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ షోకు ఇంతటి పేరు రావడం వెనుక నిర్వహకులు చేసే ప్లాన్లు ముఖ్యమైనవి. ఫిజికల్ టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టేలా వ్యూహాలు చేయడంతో దీనికి మంచి రేటింగ్ వస్తోంది. మరీ ముఖ్యంగా నామినేషన్ టాస్క్ రచ్చ రచ్చగా సాగడంతో దీన్ని ఎక్కువ మంది చూస్తారు.

ఫిజికల్ వరకూ వెళ్లడంతో విమర్శలు
బిగ్ బాస్ షోలో మగవారు, ఆడవాళ్లు కంటెస్టెంట్లుగా ఉంటారు. అయితే, అందరూ కలిసి ఆడేలా కాకుండా బలమైన వారు మాత్రమే గెలిచేలా ఫిజికల్ టాస్కులు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు క్రియేట్ చేసే టాస్కుల పట్ల ప్రేక్షకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతేకాదు, గతంలో కొన్ని టాస్కుల విషయంలో బిగ్ బాస్ షోపై విమర్శలు కూడా చెలరేగాయి.

గ్రూపులు కట్టడం.. గొడవలు పెట్టడం
రియాలిటీ షో అంటే కంటెస్టెంట్లు ఇంట్లో ఎలా ఉంటారో.. అందులోనూ అలాగే ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, బిగ్ బాస్ యూనిట్ మాత్రం షో ఆరంభంలోనే ఒకే మనస్తత్వం కలిగిన కంటెస్టెంట్లను గ్రూపులుగా ఏర్పాటు చేస్తోంది. ఇవే షో మొత్తం కంటిన్యూ అవడం వల్ల టాస్కుల సమయంలో, నామినేషన్ ప్రక్రియలో గొడవలు జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

జలజ ఎంట్రీతో ఒక్కసారిగా మారింది
గ్రాండ్ ఫినాలేకు దగ్గర పడుతోంది బిగ్ బాస్ నాలుగో సీజన్. ఈ నేపథ్యంలో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు దెయ్యాన్ని తీసుకొచ్చారు షో నిర్వహకులు. జలజ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చిన దెయ్యం.. కంటెస్టెంట్లు అందరికీ చుక్కలు చూపించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే మొదట భయపెట్టిన ఆమె.. ఆ తర్వాత ఒక్కొక్కరికీ టాస్కులు ఇచ్చి ఇరుకున పెడుతోంది.

షోలో కిందపడి కొట్టుకున్న కంటెస్టెంట్లు
జలజ ఎంట్రీతో షోలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇందులో భాగంగానే దెయ్యం ఇచ్చిన టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్‌లో రియల్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్క్ కోసం పోటీ పడుతున్న సమయంలో ఇది జరిగిందట. అంతేకాదు, ఆ సమయంలో ఆరియానా ఓ వస్తువును బయటకు విసిరేసినట్లు సమాచారం.

అవినాష్ అతి వల్లే మొదలైన గొడవ
వాస్తవానికి అవినాష్ ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో దెయ్యంగా మారతాడని తెలుస్తోంది. ఆ తర్వాత అతడు చేసే పనులతో హౌస్‌లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తాయని సమాచారం. ఈ క్రమంలోనే మిగిలిన వారితో అతడు గొడవకు దిగడంతో తోపులాట జరిగిందని తెలిసింది. ఆ సమయంలో అఖిల్ సార్థక్ - అవినాష్ మధ్య వాగ్వాదం కూడా జరిగిందనే టాక్ వినిపిస్తోంది.