For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్నారైతో ఆరియానా గ్లోరీ పెళ్లి: మేటర్ లీక్ చేసి షాకిచ్చింది.. అందుకే బయటపెట్టానంటూ కామెంట్

  |

  యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే తెలుగు వారికి సుపరిచితురాలు అయిపోయింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. తనదైన శైలి హావభావాలకు తోడు దూకుడు స్వభావంతో ఆకట్టుకున్న ఆమె.. పెద్ద పెద్ద సినీ ప్రముఖులను సైతం ఇంటర్వ్యూలు చేసింది. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి ప్రవేశించింది. అందులో చక్కని ఆటతీరుతో మెప్పించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి కొన్ని సీక్రెట్స్ లీక్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  రాంగోపాల్ వర్మ వల్లే ఫేమస్ అయింది

  రాంగోపాల్ వర్మ వల్లే ఫేమస్ అయింది

  ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తోన్న సమయంలో ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంలో ‘ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ఆమె ప్రశ్నించగా.. ‘నువ్వే' అంటూ ఆయన బదులిచ్చాడు. అంతేకాదు, ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఆరియానా విపరీతంగా పాపులర్ అయిపోయింది.

  ఆటతీరు.. వ్యవహారశైలితో హాట్ టాపిక్

  ఆటతీరు.. వ్యవహారశైలితో హాట్ టాపిక్

  సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోవడం ద్వారా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. వచ్చీ రావడమే హౌస్‌మేట్స్‌తో గొడవకు దిగిన ఆమె.. ఒక్కసారిగా హైలైట్ అయింది. అంతేకాదు, టాస్కుల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధ పడింది. ఈ కారణంగానే పలు గొడవల్లోనూ తలదూర్చడంతో హాట్ టాపిక్ అయిపోయింది.

  ఆ ట్రాకుతో మరింత పాపుటారిటీ సొంతం

  ఆ ట్రాకుతో మరింత పాపుటారిటీ సొంతం

  బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించనప్పటి నుంచే అద్భుతమైన ఆటతీరుతో పాటు ముక్కుసూటిగా ఉంటూ ఆరియానా గ్లోరీ ఎంతగానో ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ వచ్చినప్పటి నుంచి అతడితో క్లోజ్‌గా ఉంటూ ఫేమస్ అయింది. అంతేకాదు ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపించడంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

  అంచనాలు లేకుండా వచ్చి టాప్-5లోకి

  అంచనాలు లేకుండా వచ్చి టాప్-5లోకి

  వాస్తవానికి ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు ఎవరికీ ఆమెపై అంచనాలు లేవు. వ్యవహార శైలి చూసిన వారంతా మూడు నాలుగు వారాల్లో బయటకు వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, వారం వారం తనను తాను మంచిగా మలచుకుంటూ ఆకట్టుకుందామె. ఈ కారణంగానే టాప్-5లోకి చేరుకుంది. కానీ, ఫినాలేలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

  ఎన్నారైతో ఆరియానా పెళ్లి.. లీక్ చేసింది

  ఎన్నారైతో ఆరియానా పెళ్లి.. లీక్ చేసింది

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో తన పెళ్లి గురించి, కాబోయే వరుడి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నేను ఏడాదిన్నరలో పెళ్లి చేసుకుంటా. ఓ ఎన్నారై సంబంధం వచ్చింది. అది ఇంకా చర్చల దశలోనే ఉంది' అని చెప్పింది.

  అందుకే బయటపెట్టానంటూ కామెంట్

  అందుకే బయటపెట్టానంటూ కామెంట్

  దీనిని కొనసాగిస్తూ.. ‘అమెరికాలో ఉండే మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ నన్ను చేసుకుంటా అన్నాడు. అది అందరికీ తెలుసు. నా కెరీర్ కోసం దాన్ని హోల్డ్‌లో పెట్టాను. ఒకవేళ ఇదే ఓకే అవ్వొచ్చు. అందుకే ఇప్పుడు బయటపెడుతున్నా' అని వివరించింది ఆరియానా. అలాగే, తనకు ముగ్గురు పిల్లలు పుట్టాలనుకుంటున్నట్లు, అందులో కవలలు కూడా ఉండాలని ఆమె తన కోరికను వెల్లడించింది.

  English summary
  Ariyana Gloryis a well-known South Indian TV anchor and actor. She started her career as an anchor at ‘Studio One’ in Hyderabad in 2015, and later, she started working at Sun TV Network Limited, Hyderabad as a TV anchor in 2016.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X