For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Avinash engagement:తీన్మార్ శ్రీముఖి.. తన పెళ్లిపై ఓపెన్ అయిన అరియానా!

  |

  ఎట్టకేలకు జబర్దస్త్ ముక్కు అవినాష్ గా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ అవినాష్ పెళ్లి సంగతి చెప్పేశాడు. దీంతో చాలా కాలంగా అవినాష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేసినట్లయింది. గత ఏడాది బిగ్ బాస్ లో పాల్గొన్న అవినాష్ హౌస్ లో అరియానాతో కాస్త ప్రేమగా మెలగడం తో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం నేపథ్యంలో తన కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఈ విషయంలో ఇప్పుడు అరియానా అలాగే శ్రీ ముఖి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

  అలా బిగ్ బాస్ కి

  అలా బిగ్ బాస్ కి

  ముక్కు అవినాష్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవినాష్ అనేక స్కిట్స్ లో ప్రేక్షకులను నవ్విస్తూ తన కంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్ వచ్చిన క్రేజ్ తో కొన్ని సినిమాలలో కూడా ముక్కు అవినాష్ నటించి నాలుగు రాళ్లు వెనుక వేసుకో గలిగాడు. జబర్దస్త్ లో మంచి పొజిషన్లో ఉండగా ఆయనకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే వెళ్లాలా వద్దా అని ఆలోచనలో పడి చివరికి వెళ్లాలని నిర్ణయం తీసుకుని స్నేహితుల సహాయంతో బిగ్ బాస్ కి వెళ్ళాడు.

  అవినాష్ అరియానా మధ్య

  అవినాష్ అరియానా మధ్య

  అది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అవినాష్ అరియానా మధ్య కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం ఎన్నోసార్లు వీళ్లిద్దరు చెప్పుకున్నా సరే ఎప్పటికప్పుడు పెళ్లి వార్తలు మాత్రం వీరిద్దరి గురించి హల్చల్ చేస్తూనే ఉండేవి. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్‌ ఇంటా బయట పెళ్లి పెళ్లి అని గోల చేసిన ముక్కు అవినాష్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు ప్రకటించారు అనూజ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఆ ఫొటోలను షేర్ చేస్తూ త్వరలో మా పెళ్లి అంటూ సడెన్ సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

  అవినాష్ ప్రకటన

  అవినాష్ ప్రకటన

  ఈ సందర్భంగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేయడంతో పాటు సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు... చాలా మంది చాలా సార్లు నా పెళ్లి పై ప్రశ్నలు వేశారు. అతి త్వరలో నా అనూజతో ఒకటి కాబోతున్నా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా ఇట్లు మీ ముక్కు అవినాష్ సారీ సారీ మీ అనుజా అవినాష్' అంటూ పోస్ట్ పెట్టాడు అవినాష్. ఈ పోస్ట్ పెట్టడంతో అవినాష్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా జోర్డార్ సుజాత, శ్రీముఖి లాంటి వారు స్పందించారు. శ్రీముఖి అయితే తీన్మార్ షురూ అంటూ కామెంట్ చేసింది.

   నోరు విప్పిన అరియానా

  నోరు విప్పిన అరియానా

  అయితే ముందు నుంచి అరియానాతో పెళ్ళి అనే ప్రచారం జరుగుతూ ఉండగా స్పందించింది. అవినాష్ పెళ్లి ఫిక్స్ కావడంతో సంతోషం వ్యక్తం చేసిన అరియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా మధ్య ఏదో ఉందని చాలా రూమర్లు వచ్చాయి కానీ అలాంటిది ఏమీ లేదని ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టు అయింది అని పేర్కొంది.

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
  తరువాతనే పెళ్లి

  తరువాతనే పెళ్లి

  అవినాష్‌కి పెళ్లి ఫిక్స్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉందన్న ఆమె తను ఎప్పుడూ పెళ్లి పెళ్లి అంటూ ఉంటాడని అది ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తే తాను టీవీ షోలతో పాటు కొన్ని సినిమాలు కూడా చేస్తున్నానని పేర్కొన్న ఆమె మరో రెండు వారాల్లో తన కొత్త సినిమా వివరాలు అనౌన్స్ చేస్తామని చెప్పింది అరియానా. ఇక తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని బాగా డబ్బు సంపాదించిన తరువాతనే పెళ్లని అంది.

  English summary
  finally Jabardasth Mukku avinash announced his engagement. here is the reaction of ariyana glory
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X