Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- 10 hrs ago
నా దినచర్య అదే.. పొద్దు పొద్దున్నే ఆ పని.. భర్తతో కాజల్ రచ్చ!!
- 11 hrs ago
నా గురించి ఆలోచిస్తున్నావా?.. నాగచైతన్య పోస్ట్‌పై సమంత ఫన్నీ కామెంట్స్
- 12 hrs ago
VD 10.. ప్రీ లుక్‌తో విజయ్ దేవరకొండ రచ్చ.. రేపే అసలు కథ!
Don't Miss!
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆయన విషయంలో ఆరియానా యూటర్న్: ఏకంగా ముద్దులు పెడుతూ ప్రపోజ్ చేసేసింది
ఆరియానా గ్లోరీ.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. దీనికి కారణం ఈ అమ్మాయి బిగ్ బాస్ షోలో పాల్గొనడమే. అంతేకాదు, అసాధారణమైన ఆటతీరుతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సైతం సొంతం చేసుకుంది. చూడ్డానికి చిన్న పిల్లలా కనిపించే ఈమె.. ఆటలో దిగిందంటే చాలు.. ఎంతటి వారినైనా ఓడించేస్తుంది అన్నట్లు ఆడుతోంది. ఈ కారణంగానే 13 వారం వరకూ హౌస్‌లో కొనసాగుతోంది. ఇదిలాఉండగా, ఆరియానా ఓ విషయంలో యూటర్న్ తీసుకుంది. మొన్న బాగా తిట్టేసిన ఆమె.. తర్వాతి రోజే ముద్దులు పెట్టి మరీ ప్రపోజ్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

యాంకర్‌గా ఎంట్రీ.. రాంగోపాల్ వర్మ వల్ల క్రేజ్
యూట్యూబ్ ఛానెల్ ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసి బాగా పాపులర్ అయింది. ఇక, ఆ మధ్య సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో జరిగిన ఇంటర్వ్యూ వల్ల మరింత క్రేజ్ సంపాదించుకుంది. దీనికి కారణం ఆ చిట్ చాట్ సమయంలో ఆరియానాపై ఆయన హాట్ కామెంట్లు చేయడమే.

బిగ్ బాస్‌లోకి స్పెషల్‌గా అతడితో సీక్రెట్‌గా రాక
సోషల్ మీడియా ద్వారా విశేషమైన గుర్తింపును దక్కించుకోవడంతో ఆరియానాకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందుకు అనుగుణంగానే ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఆమె షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అందరు కంటెస్టెంట్లలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించింది.

ఆ కంటెస్టెంట్‌తో ట్రాక్ నడుపుతూ పాపులరిటీ
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ.. జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. సోఫా మీద అతడు ‘యూ ఆర్ కూల్' అని రాసినప్పటి నుంచి వీళ్ల జంట బాగా హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే అతడు తరచూ ఆమెను ఏడిపిస్తుండడం, పడేయడానికి ట్రై చేయడం, అమ్మ అమ్మ అంటూ సంబోధిస్తుండడం వంటి వాటితో వీళ్ల మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ఆ సమయం వస్తే ఆడపులిలా మారిపోతుంది
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా ఎంతో చిల్ మోడ్‌లో కనిపిస్తుంది. చాలా వరకు అవినాష్‌తోనే కలిసి ఉంటుంది. అదే.. టాస్క్ మొదలైతే మాత్రం ఒంటరిగా గేమ్ ఆడుతోంది. అంతేకాదు, ప్రతి దానిలో తన ప్రయత్నం కనిపించాలన్న పట్టుదలతో కనిపిస్తుంది. ఒక్కోసారి ఆడపులిలా మారిపోయి మరీ పోరాటం చేస్తుంది. ఈ కారణంగానే ఆమె ఎన్నోసార్లు సేవ్ అవుతూ వచ్చింది.

అన్యాయం జరగడంతో ఆయననే విమర్శించింది
ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో అఖిల్, సోహెల్ అందరినీ తోసేసి పాలు నింపుకున్నారు. దీంతో ఆరియానా ఓడిపోయింది. అప్పుడు బాధతో బిగ్ బాస్ తీరును విమర్శించిందామె.

ఏకంగా ముద్దులు పెడుతూ ప్రపోజ్ చేసేసింది
‘రేస్ టు ఫినాలే' చివరి రౌండ్‌లో భాగంగా అఖిల్, సోహెల్ ఉయ్యాలపై కూర్చూని ఉండాలి. ఎవరు చివరి వరకూ ఉంటే వాళ్లు గెలుస్తారు. ఈ టాస్క్ జరుగుతున్న విధానం చూసిన ఆరియానా.. ‘సారీ బిగ్ బాస్ నిన్న మిమ్మల్ని అనవసరంగా తిట్టుకున్నాను. నిజానికి మీరంటే నాకు చాలా ఇష్టం. మీరెవరికీ అన్యాయం చేయరు' అంటూ కెమెరా వైపు చూస్తూ ముద్దులిచ్చింది.