Just In
- 22 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 27 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 52 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ఆరియానా: అతడిని కలవబోతున్నానని చెప్పి షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ
ఆరియానా గ్లోరీ.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తోందీ బోల్డ్ బ్యూటీ. ఏమాత్రం అంచనాలు లేకుండా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అసాధారాణ ఆటతీరుతో ఫైనల్స్‌కు చేరుకుంది. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు, ఎన్నో సీక్రెట్లు లీక్ చేసి షాకుల మీద షాకులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడిని కలిసి అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని తాజాగా ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం!

సంచలన దర్శకుడి వల్ల భారీ పాపులరిటీ
యాంకర్‌గా పని చేస్తోన్న సమయంలో యూట్యూబ్ ఛానెల్ కోసం ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంలో ‘ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ఆమె ప్రశ్నించగా.. ‘నువ్వే' అంటూ ఆయన బదులిచ్చాడు. అంతేకాదు, నిన్ను బికీనీలో చూడాలనుంది అని ఆయన చేసిన కామెంట్స్‌తో పాపులర్ అయిపోయింది.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. బోల్డుగా ఉంటానని
సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది ఆరియానా గ్లోరీ. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి.. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి ప్రవేశించింది. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తనను తాను బోల్డ్ లేడీ అని చెప్పుకుంది. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ షోలో వ్యవహరించి హైలైట్ అయింది.

అతడితో లవ్ ట్రాక్.. అసలైన ఆటతో టాక్
బిగ్ బాస్ హౌస్‌లో నిజాయితీగా ఉంటూ.. ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ గొడవలకు దిగుతుండేది ఆరియానా గ్లోరీ. అదే సమయంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. టాస్కుల కోసం ఎంతకైనా తెగిస్తూ సత్తా చాటింది. మరోవైపు, జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో.. అతడి లవ్ ట్రాకు నడుపుతున్నట్లు ప్రచారం జరిగింది.

పోరాడి ఓడిన ఆరియానా... క్రేజ్ పెరిగింది
ఆరియానా గ్లోరీ హౌస్‌లోకి ఎంటర్ అయిన సమయంలో చేసిన హడావిడితో.. ఈమె మధ్యలోనే బయటకు వెళ్లిపోతుందన్న కామెంట్లు వినిపించాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఆమె టాప్-5లోకి చేరుకుంది. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో రెండో కంటెస్టెంట్‌గా ఎలిమినేటై నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల అమ్మడికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న బోల్డ్ బ్యూటీ
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించడంతో పాటు త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని ప్రకటించింది.

అతడిని కలవబోతున్నానని షాకిచ్చింది
ఈ లైవ్ చాట్‌లో ఓ నెటిజన్ ‘సోహెల్ అన్న గురించి చెప్పండి' అని ఆరియానాను ప్రశ్నించాడు. దానికి సమాధానం చెబుతూ.. ‘వాడు నా క్లోజ్ ఫ్రెండ్. అందరూ అనుకుంటున్నట్లు మా మధ్య గొడవలు లేవు. అంతేకాదు.. త్వరలోనే మేమిద్దరం కలిసి ఒకటి చేయబోతున్నాం. భారీ సర్‌ప్రైజ్ ఇస్తున్నాం' అని చెప్పుకొచ్చింది. దీంతో దానిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.