For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోలో మరో రచ్చ.. ముద్దు పెట్టు.. అక్కడ ముట్టుకుంటా అంటూ!

  |

  ఓ విలాశవంతమైన ఇల్లు.. చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు.. కంటెస్టెంట్లుగా కొంత మంది సెలెబ్రిటీలు.. నిర్వహకులు ఇచ్చే టాస్కులలో తమ వంతు శ్రమను చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకోడానికి వాళ్లు చేసే ప్రయత్నాలు.. ఇదే బిగ్ బాస్ షో నేపథ్యం. గతంలో ఎన్నడూ చూడని ఇలాంటి షోకు ప్రేక్షకుల మద్దతు భారీ స్థాయిలో లభిస్తోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో దానిని ప్రసారం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ మేల్ కంటెస్టెంట్‌పై కొందరు ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  ఆదరణ లేదు.. రేటింగ్ రావట్లేదు

  ఆదరణ లేదు.. రేటింగ్ రావట్లేదు

  తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా బిగ్ బాస్ షో తెలుగులో చాలా సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులో సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. అలాగే, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, ఈ సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కక.. రేటింగ్ పెద్దగా రావట్లేదు.

  హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

  ఆ ట్రాక్‌లే హైలైట్.. వాళ్లే ఫేమస్

  ఆ ట్రాక్‌లే హైలైట్.. వాళ్లే ఫేమస్

  బిగ్ బాస్ షో భారీ సక్సెస్‌ను అందుకుందంటే అందులో చూపించే కంటెంటే కారణం అని చెప్పాలి. అందులోనూ ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య కనిపించే లవ్ ట్రాకులు మరింత ఎలివేట్ అవుతుంటాయి. వీటికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు.

  ఆరో సీజన్‌లో ఈ జంటలే ఫోకస్

  ఆరో సీజన్‌లో ఈ జంటలే ఫోకస్

  ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో కూడా కొందరు జంటగా ఫోకస్ అవుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. వారిలో మెరీనా అబ్రహం, రోహిత్ మాత్రం రియల్ కపుల్‌గా వచ్చారు. మిగిలిన వాళ్లలో ఆర్జే సూర్య, ఆరోహి రావు ఒక జంటగా.. అర్జున్ కల్యాణ్ - శ్రీ సత్య మరో జంటగా మారారు.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  అర్జున్ సీరియస్‌గా... సత్య లైట్

  అర్జున్ సీరియస్‌గా... సత్య లైట్

  ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లలో సీరియల్ నటి శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అతడిని లైట్ తీసుకుంటూనే ఉందని చెప్పొచ్చు.

  హోటల్ టాస్కులో ఆమెతోనే

  హోటల్ టాస్కులో ఆమెతోనే

  నాలుగో వారంలో కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బీబీ హోటల్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో అర్జున్ కల్యాణ్ గెస్టుగా.. శ్రీ సత్య హోటల్ స్టాఫ్‌గా వ్యవహరించారు. ఈ టాస్క్ జరుగున్నంత సేపూ అతడు ఆమె పక్కనే ఉన్నాడు. ఎక్కువగా సత్యకే పనులు చెప్పడం.. ఆమెకు టిప్‌లు ఇవ్వడం వంటివి చేశాడు. ముఖ్యంగా ఈ టాస్కులో ఆమె అర్జున్‌కు అన్నం కూడా తినిపించింది.

  Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

  అర్జున్‌పై ఆ లేడీస్ విమర్శలు

  అర్జున్‌పై ఆ లేడీస్ విమర్శలు

  'బీబీ హోటల్' టాస్కులో అర్జున్ కల్యాణ్ నుంచి శ్రీ సత్యకు తప్ప మిగిలిన వాళ్లకు పెద్దగా టిప్స్ రాలేదు. దీంతో లేడీస్ టీమ్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ అతడిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శ్రీ సత్యతో అర్జున్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. అదే సమయంలో కొన్ని ఆసక్తికరమై విషయాలను బయటపెట్టి షోలో కలకలం రేపారు.

  ముద్దు పెట్టు.. టచ్ చేస్తానంటూ

  ముద్దు పెట్టు.. టచ్ చేస్తానంటూ

  అర్జున్ - శ్రీ సత్య వ్యవహారంపై ఆరోహి, కీర్తి, మెరీనా అండ్ రోహిత్ మీటింగ్ పెట్టారు. ఆ సమయంలో వీళ్లు 'అర్జున్.. శ్రీ సత్యతోనే ఎక్కువగా ఉన్నాడు. ఆమెను ముద్దు పెట్టమని, అన్నం తినిపించమని, టచ్ చేయమని సతాయించాడు. టిప్స్ వస్తున్నాయని సత్య కూడా కొన్నింటికి ఒప్పుకుంది' అంటూ అర్జున్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఈ అంశం తెగ హైలైట్ అవుతోంది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Arohi rao and Keerthi Bhat Allegations on Arjun Kalyan in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X