దుస్తులు మార్చుకొంటుంటే.. దొంగచాటుగా అలా నీచమైన పని.. సీరియల్ నటికి చేదు అనుభవం

సినిమా ఇండస్ట్రీలో మహిళ ఆర్టిస్టులు రాణించాలంటే.. అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. కాసింత అప్రమత్తత కూడా ఉండాలి. ఎక్కడి నుంచి ఎవరు? మనపై కన్నేస్తున్నారు? అని ఓ సీరియల్ హీరోయిన్ హెచ్చరిస్తోంది. ప్రధానంగా దుస్తువులు మార్చుకునే సమయంలో అప్రమత్తం కాకపోతే ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీసి వైరల్ చేయవచ్చు, బ్లాక్‌మెయిల్‌ కూడా జరగవచ్చు అంటూ హెచ్చరిస్తుంది. అలాగే.. తాను ఓ షూటింగ్ సమయంలో డ్రెస్ మార్చుకుంటుంటే.. ఓ వ్యక్తి కిటీకిలోంచి అలా.. చేశాడంటూ ఆ నటి తన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇంతకీ ఆ నటి ఎవరు? అసలేం జరిగింది?

ఆ నటి ఎవరో కాదు.. అష్మిత కర్ణాని (Ashmita Karnani)... ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర-వెండితెర రెండింటినీ తన నటనతో అలరించింది. బాబీ, వర్షం, మధుమాసం, మురారి, ఓం నమో వెంకటేశాయ, కాటమరాయుడు, అతిథి వంటి పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అలాగే చంద్రముఖి, ముద్దుబిడ్డ, ఆకాశగంగ, శ్రావణ సమీరాలు, మనసు మమత, అగ్నిసాక్షి, మధుమాసం వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.

Ashmita Karnani Shares Shocking Experience Warns Actresses to Stay Alert on Sets

కానీ, కొంతకాలం క్రితమే నటనకు బ్రేక్‌ ఇచ్చి, డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌ వైపు మళ్లింది అష్మిత. ప్రస్తుతం యూట్యూబ్‌ ద్వారా లైఫ్‌ స్టైల్‌, పర్సనల్‌ అనుభవాలు, మోటివేషనల్‌ కంటెంట్‌తో ప్రేక్షకులను చేరుకుంటోంది. తాజాగా ఆమె తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో తాను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది. గతంలో తన కెరీర్‌లో ఎదురైన కఠిన పరిస్థితులు, కొన్ని వ్యక్తుల ప్రవర్తన, అలాగే ఇండస్ట్రీలోని వాస్తవాలను నిజాయితీగా పంచుకుంది.

ఇటీవల అష్మిత కర్ణాని (Ashmita Karnani)తన యూట్యూబ్ ఛానెల్‌లో తనకు తూర్పు పడమర షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. 'నేను షూటింగ్ సమయంలో దుస్తువులు మార్చుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక రూమ్‌కి వెళ్ళాను. ఎక్కడి వెళ్లినా.. ఏ రూమ్ లోకి వెళ్లినా కెమెరా పెట్టారా? కర్టెన్స్, డోర్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో అన్నింటిని ముందుగానే పరిశీలించడం నా అలవాటు. అలాగే.. ఆ రూమ్‌ లో కూడా అని విషయాలను పరిశీలించిన తర్వాత మాత్రమే డ్రెస్ మార్చుకోవాలని భావించాను' అని చెప్పింది. ' ఈ క్రమంలో ఆ రూమ్‌లోని ఓ కిటికీ ఓపెన్‌గా ఉండటం గమనించాను. ఆ కిటికీని క్లోజ్ చేయడానికి వీలు లేకుండా ఓ పెద్ద కేబుల్ వేశారు. ఈ కేబుల్ వల్ల విండో క్లోజ్ కావడం లేదు. ఈ విషయాన్ని వెంటనే లైట్ మెన్స్‌ను చెప్పాను'అని తెలిపారు.

ఆ లైట్ మెన్ "నేను చూసుకుంటాను, ఇక్కడికి ఎవరూ రారు "అని ఆ వ్యక్తి అక్కడి నుండి నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడని తెలిపారు. 'అప్పటి నుండి అన్ని కర్టెన్స్, విండోలు, డోర్స్ మూసివేశాను. వెంటనే కార్టూన్స్ కూడా వేసాను. అప్రమత్తంగా డ్రెస్ మార్చుకోవడం ప్రారంభించాను. అయితే ఆ కర్టెన్ ఎలాంటి గాలి లేకుండా కదలడం చూసి షాక్ అయ్యాను. వెంటనే నాకు అనుమానం వచ్చింది ఎవరో విండో బ్యాక్ సైడ్ ఉండి కటింగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు అర్థమైంది'అని చెప్పారు. దీంతో 'నేను సైలెంట్ గా వెళ్లి విండో పక్కన కాసేపు నిలుచున్నా.. కాసేపటికి ఓ వ్యక్తి విండో బ్యాక్ సైడ్ కి వచ్చి కర్టెన్ తీయడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యనని తెలిపారు.

'నేను ఇంతకీ కనిపించకపోయే సరికి మెల్లగా చేతిపెట్టి కట్టెను ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. దీంతో నేను అప్రమత్తమై అతని చెయ్యని గట్టిగా పట్టుకున్నా.. కానీ అతడు బలవంతంగా లాగడంతో విడిచి పెట్టాల్సి వచ్చింది'అని బాధపడింది. అలా భయపడుతూనే బాత్రూంలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నాననీ, ఆ తర్వాత బయటికి వెళ్లి పెద్ద సీన్ క్రియేట్ చేశానని తెలిపింది. ఎవరు ఇలాంటి దొంగ చాటున చూడ్డానికి ప్రయత్నించారని గట్టిగా అరిచినా ఫలితం లేకుండా పోయిందని అష్మిత కర్ణాని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటనను బట్టి ఆడపిల్లలు బట్టలు మార్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలనీ, మనం అప్రమత్తంగా లేకపోతే.. వీడియోలు, ఫోటోలు తీస్తారు. బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. అందుకే జాగ్రత్త ప్రతి చోట జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోచ్చారు అష్మిత కర్ణాని. అలాగే సినిమా ఫీల్డ్ లో రూమర్స్ రావడం కామన్. ఇతర కో ఆర్టిస్టులతో రిలేషన్ లో ఉన్నారంటూ కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటి పట్ల కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని అప్ కమ్మింగ్ నటీమణులను హెచ్చరించారు అష్మిత కర్ణాని. ఆమె అనుభవాల నుండి ప్రేరణ తీసుకుని, యువత ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్న సందేశాన్ని ఇస్తున్నారు.

More from Filmibeat

Read more about: ashmita tollywood casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X