»   » ‘బిగ్ బాస్’ ఇంట్లో జ్యోతిష్కుడు.... ఎవరు విన్నరో ఇలా చెప్పేశాడు!

‘బిగ్ బాస్’ ఇంట్లో జ్యోతిష్కుడు.... ఎవరు విన్నరో ఇలా చెప్పేశాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Season 1, Episode 67 :Boring Astrologer Episodeవిన్నరో ఎవరో తెలిసిపోయింది|

'బిగ్ బాస్' చివరి వారం ప్రేక్షకులు ఏదో జరుగుతుంది, ఇంకా ఆసక్తిగా సాగుతుంది అని అంతా ఊహించారు. అయితే అలాంటిదేమీ లేకుండా సాదా సీదాగా షో జరుగుతుండటంపై ప్రేక్షకుల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

బుధవారం రాత్రి ప్రసారం అయిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామాలు ఏమీ చోటు చేసుకోలేదు. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి ఓ జ్యోతిష్కున్ని పంపారు. అతడు ఇంటి సభ్యులకు ఒక్కొక్కరిని విడిగా కూర్చోబెట్టి జాతక బలం ప్రకారం గెలిచే అవకాశం ఉందా? లేదా? అనే విషయాలు వివరించే ప్రయత్నం చేశారు.

ఆదర్శ్...

ఆదర్శ్...

జోతిష్కుడు: మీరు పర్సనల్ గా ఏమనుకుంటున్నారు.

ఆదర్శ్: అందరికీ గెలిచే ఛాన్స్ ఉంది, రిజల్ట్ గురించి ఆలోచించడం లేదు.
జ్యోతిష్కుడు: 12వ తేదీ తర్వాత నుండి మీ గ్రహస్థితి బావుంది. అంతకు ముందు మీరు హోప్స్ అన్నీ వదిలేసుకుని ఎలిమినేట్ అవుతానని అనుకున్నారు.
ఆదర్శక: అపుడు నేను మెంటల్లీ డిస్ట్రబ్ అయి ఇక్కడి నుండి వెళితే కాస్త ప్రశాంతంగా ఉంటుందని అనుకున్న మాట నిజమే.
జ్యోతిష్కుడు: మీరు హోప్స్ వదులుకోవాల్సిన అవసరం లేదు, ఈ రెండు మూడు రోజులు లెవెల్ బెస్ట్ గా ఆడండి, మీకు గెలిచే అవకాశం ఉంది.

అర్చన

అర్చన

జ్యోతిష్కుడు: మీ బిగ్‌బాస్ ప్రయాణం ఎలా జరిగింది.

అర్చన: గుడ్ జర్నీ, చాలా సింపుల్ గా బిగినైంది, 4వ వారం నుండి నామినేషన్లు మొదలై 5 సార్లు వరుసగా నామినేట్ అయి సేవ్ అయ్యాను.
జ్యోతిష్కుడు: మీకు ఇప్పటి నుండే రియలిస్టిక్ లైఫ్ మొదలైంది. గురుడు శుక్రుడు లోకి వచ్చాడు. మీకు గెలిచే హోప్స్ ఉన్నాయి. మీ జాతకం చాలా బావుంది. ఈ మూడు రోజులు బాగా ఆడండి. వన్ ఇయర్ లోపల మ్యారేజ్ ఛాన్స్ ఉంది.

నవదీప్

నవదీప్

జ్యోతిష్కుడు: మీరందరూ అదృష్ట వంతులు కాబట్టే ఇక్కడి వరకు వచ్చారు.

నవదీప్: ఫైనల్ వరకు వెళతాననే నమ్మకం ముందు నుండీ ఉంది.
జ్యోతిష్కుడు: ఈ మూడు నాలుగు రోజులు బాగా ఆడండి, మీకు గెలిచే అవకాశం ఉంది. మీకు మంచి భవిష్యత్ ఉంది.

హరితేజ

హరితేజ

జ్యోతిష్కుడు: సాధించాలనే మొండి తనం, సాధించే వరకు పట్టువదలరు. మీ జాతకం అలా ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు.

శివ బాలాజీ

శివ బాలాజీ

జ్యోతిష్కుడు: మీరు నమ్మకమైన వ్యక్తి, ఏదైనా మొహం మీదే అనేస్తారు, అందరికంటే చాలా నిజాయితీగా ఉంటారు.

శివ బాలాజీ: ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పండి
జ్యోతిష్కుడు: అందరి జాతకం బలంగా ఉంది. అయితే గ్రహాలు ఎప్పుడు మారుతాయో తెలియదు. బెస్టాఫ్ లక్.

English summary
Bigg Boss Season 1, Episode 67 details. Captain Archana becomes the center of attraction as Bigg Boss assigns a task to the male contestants. Later, an astrologer predicts the future of the contestants.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu