For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  1,000 ఎపిసోడ్లు పూర్తైనా నాటవుట్ సీరియల్

  By Srikanya
  |

  Chinnari Pellikuthuru
  ''టీచరుగారూ! మీరు చెప్పినట్లు నేను జగ్యాపై కేసుపెడితే నాకేమొస్తుంది? అతనికి బాధ కలిగిస్తే నా బాధ తగ్గుతుందా? అతన్ని కష్టపెడితే నాకేం ఒరుగుతుంది? అతనిపై 'ప్రతీకారం' తీర్చుకుంటే నా సమస్య గట్టెక్కుతుందా? ఐదేళ్లక్రితం నాకున్న సంతోషం తిరిగొస్తుందా? నాకున్న శక్తి కేసులకోసం వృథాచేస్తే మునుముందు నా జీవితం ఎలా గడుస్తుంది?'' ఈ డైలాగు ఎక్కడో విన్నట్లు గుర్తుకు వస్తోంది. అవును ఇది మన జీ టీవీలో వచ్చే చిన్నారి పెళ్లి కూతురులోదే.

  ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులతో మన తెలుగు ప్రేక్షకులను కట్టిపాడేస్తున్న సీరియల్ ఇది. జీ తెలుగు చానల్స్‌లో ఇప్పుడు మంచి పాపులారిటీ ఉన్న సీరియల్స్ చిన్నారి పెళ్లికూతురు ( హిందీలో బాలికా వధు). ఈ సీరియల్ బాలికా వధు పేరట కలర్స్ టీవీ లో వస్తోంది. మొన్న సోమవారంతో ఈ సీరియల్ మొదలయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. అంతేగాక ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ విజయవంతగా పూర్తి చేసుకుని దూసుకుపోతోంది. త్వరలోనే దీని నిమిత్తం వన్ అవర్ స్పెషల్ పోగ్రాంని ప్లాన్ కూడా చేస్తున్నారు.

  బాల్య వివాహాల దుస్థితిపై ధ్వజమెత్తిన ఈ 'బాలికా వధు' ధారావాహిక వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మున్ముందుకు దూసుకెళ్తోందంటే కారణం ప్రేక్షకులు ఆ సీరియల్ లోని కంటెంట్ కి కనెక్టు కావటమే అంటున్నారు. ఈ సీరియల్‌ని ప్రారంభించినప్పుడు ఏదో ఓ ఐదువందల ఎపిసోడ్లుకు మాత్రమే ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా ప్రేక్షకాదరణ లభించటం,దానికి తోడు యాడ్స్ కుంభవృష్టి కురవటంతో దీన్ని పొడిగించాల్సి వచ్చింది. దాంతో మొదట ఎత్తుకున్న పాయింట్ కి మరిన్ని అంశాలను చేర్చి కథని మరింత పకడ్బందీగా రూపొందిస్తూ వచ్చారు.

  ఈ సీరియల్‌లో నటించిన సురేఖా సిక్రీని గానీ.. లక్ష్మీ సర్గారాని గానీ ,మరి ఎవరైనా కానీ వాళ్లల్లో వాళ్లకి గొడవలున్నా షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగటానికే చూసేవారని చెప్పుతున్నారు. సెట్స్ బయట ఎన్ని తిట్టుకున్నా,ఎన్ని గొడవలు జరిగినా, దర్శకుడు చెప్పిన విధంగా సీన్‌లో లీనమై నటించటం వల్ల ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని చెబుతున్నారు నిర్వాహకులు.

  'బాలికా వధు'లో ప్రత్యూష బెనర్జీ, నేహా మర్దా, వ్యాస్, సిక్రీ, స్మితా బన్సాల్, అనూప్ సోనీ వీళ్ళంతా బాగా ప్రేక్షకులుకు దగ్గరయ్యారు. కొంతమంది వచ్చారు. కొంతమంది నటీనటులు తప్పుకున్నా ఆ లోటు ని కనపడనీయకుండా ఈ సీరియల్ ప్రయాణం సాగింది. త్వరలోనే వెయ్యి ఎపిసోడ్ల ఘన విజయాన్ని ఉత్సవంలా జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  English summary
  'Balika Vadhu', the popular show on Colors TV, is set to reach a milestone on Monday and has managed to withstand the test of time for over four years. The serial will complete 1,000 episodes on Monday and has a one-hour special plan for its fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X