For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  8 ఏళ్లు నడిచిన పాపులర్ టీవి సీరియల్ కు శుభం కార్డు

  By Srikanya
  |

  హైదరాబాద్‌ : హిందీలో 2,000ల ఎపిసోడ్లకు పైగా ప్రసారమై అరుదైన ఘనత సాధించిన సీరియల్‌ 'బాలికావధు' (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు). లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో సైతం చోటు సంపాదించిన ఈ సీరియల్ ఆగిపోతోంది. 2008లో ప్రారంభమైన ఈ సీరియల్ జూలై 31 న వచ్చే ఎపిసోడ్ తో మంగళం పాడుతోంది. ఆ రోజే చివరి ఎపిసోడ్.

  ఎనిమిది సంవత్సరాలు పాటు అత్యధిక టీర్పీలతో దూసుకుపోతున్న ఈ సీరియల్ ముగింపుకు రావటం చాలా మంది మహిళలను బాధపెడుతోంది. అయితే ఇన్ని సంవత్సరాలు పాటు సీరియల్ నడపటమే గొప్ప విషయం అంటున్నారు.

  2008లో ప్రారంభమైన ఈ హిందీ సీరియల్‌ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎక్కడా చిన్న విరామం లేకుండా కొనసాగడం విశేషం. హిందీలో ఎక్కువ రోజులు కొనసాగిన ఎపిసోడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

  సీరియల్‌ నిర్మాతలు మాట్లాడుతూ ''మా సీరియల్‌ సామాజిక సమస్యలను స్పృశించింది. ఇన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అదే కారణం. బాల్యవివాహాలు, విడో మ్యారేజ్‌లు, మహిళలపై జరుగుతున్న హింసతో పాటు అతివల చైతన్యం కోసం విద్య ఎంత అవసరమో చాటి చెప్పిందీ సీరియల్‌'' అని పేర్కొన్నారు.

  సీరియల్ మెయిన్ ధీమ్ ఏమిటీ అంటే...సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న వివక్షల్లో బాల్యవివాహం ఒకటి. ఆ బాల్యవివాహం కారణంగా ఆనంది అనే బాలిక జగదీశ్‌ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంటుంది. తరువాత తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల పరిణామాలు ఏవిధంగా ఉన్నాయన్నదే ఈ సీరియల్‌ ఇతివృత్తం.

  'Balika Vadhu' ends on July 31

  ఈ కథలో బాల్యంలో ఆనందిగా అవికాగోర్‌(తెలుగులో ఉయ్యాల జంపాల హీరోయిన్‌), యువ్వనంలో ఆనందిగా ప్రత్యూష బెనర్జీ నటించారు. ప్రస్తుతం ఆనంది కూతురు నందిని (మహ్హి విజ్‌), అమిత్‌(అవినాష్‌ సచ్‌దేవ్‌), క్రిష్‌(రస్లాన్‌ ముంతాజ్‌)ల ప్రేమ వ్యవహారం చుట్టూ కథ తిరుగుతోంది.

  స్ఫూర్తిని కలిగించే పాత్రలతో సాగిపోతున్న మా సీరియల్‌ లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాందించడం, పేక్షకుల ఆదరణ మరువలేనిదని ప్రోగ్రామింగ్‌ హెడ్‌ ఆఫ్‌ ఛానల్‌ కలర్స్‌ మనీశ్‌ శర్మ అన్నారు. తమ సీరియల్‌కు ఈ గుర్తింపు రావడం ఓ గౌరవంగా భావిస్తున్నామని స్పేర్‌ ఓర్గిన్స్‌ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ వాద్వా పేర్కొన్నారు.

  ఉత్తర భారతంలోని చాలా కుటుంబాల్లో ఒకరిగి కలిసిపోయిన బాలికావధు, ఇప్పుడు తెలుగు లోగిల్లలోనూ చిన్నారి చిట్టి సభ్యురాలు అయ్యింది. చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు లో డబ్ అయిన బాలికావదు అత్యంత ఆధరణతో టాప్ ప్లేస్ లో ఉంది. ఎదిగీ ఎదగనీ వయస్సులో వివాహం జరిగితే, ఆ పిల్లల జీవితమే పాడవుతుందని, బాల్యవివాహాలను ప్రొత్సాహించొద్దని మంచి ఉద్దేశంతో వచ్చిన చిన్నారి పెళ్లికూతురు సందేశాత్మక సీరియల్ గా సక్సెస్ గా దూసుకెళ్తోంది.

  'బాలికా వధు'లో ప్రత్యూష బెనర్జీ, నేహా మర్దా, వ్యాస్, సిక్రీ, స్మితా బన్సాల్, అనూప్ సోనీ వీళ్ళంతా బాగా ప్రేక్షకులుకు దగ్గరయ్యారు. కొంతమంది వచ్చారు. కొంతమంది నటీనటులు తప్పుకున్నా ఆ లోటు ని కనపడనీయకుండా ఈ సీరియల్ ప్రయాణం సాగింది.

  English summary
  'Balika Vadhu' was launched in 2008. So far, 8 Years has passed and the Makers decided to end it due to low TRPs. Shooting of last episode might happen on July 22nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X