For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హౌజ్ లో రాజకీయం పెరుగుతోంది.. బాలాదిత్య అన్న కౌశిక్ షాకింగ్ కామెంట్స్

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక తాజా ఎపిసోడ్ లో ఐదో వారం కెప్టెన్ గా సింగర్ రేవంత్ ఎన్నికయ్యాడు. ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లను నాలుగో వారం కెప్టెన్ అయిన కీర్తి భట్ ప్రకటించగా ఫైనల్ లోకి ఆర్జే సూర్య, బాలాదిత్య, రేవంత్ ముగ్గురు వెళ్లారు. వీరిలో అధికమంది రేవంత్ కు పూలదండలు వేసి కెప్టెన్ గా నియమించారు. ప్రస్తుతం 8 మంది నామినేషన్లలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతోంది. ఇందులో భాగంగా హాజరైన బుల్లితెర నటుడు కౌశిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  ప్రేక్షకుల మన్ననలు అందుకుని..

  ప్రేక్షకుల మన్ననలు అందుకుని..

  కొత్త కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని మరీ ప్రసారం అవుతోన్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ సాగిపోతోందీ షో. అందుకే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది.

  ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లు..

  ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లు..

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లు బాలాదిత్య, సుదీప (పింకీ), కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహిలు వెళ్లిపోయారు.

  ఇంటి కెప్టెన్ గా సింగర్ రేవంత్..

  ఇంటి కెప్టెన్ గా సింగర్ రేవంత్..

  ఇప్పుడు ఈ ఐదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. కాగా తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 ఐదో వారం ఇంటి కెప్టెన్ గా సింగర్ రేవంత్ ఎన్నికయ్యాడు. అధికంగా ఇంటి సభ్యులు అతనికి పూలదండలు వేసి కెప్టెన్ గా గెలిపించారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే.

  పాపులర్ సెలబ్రిటీలను సైతం..

  పాపులర్ సెలబ్రిటీలను సైతం..

  ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. వీరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతోపాటు పాపులర్ సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి ఆసక్తికర సమాధానాలు రాబడుతున్నారు. అలా ఇప్పటివరకు జబర్దస్త్ కమెడియన్, సినిమా రివ్యూవర్ మహిధర్, రాకింగ్ రాకేష్ హాజరుగా కాగా తాజాగా బాలాదిత్య సోదరుడు, బుల్లితెర నటుడు కౌశిక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

  ఫస్ట్ వీక్ బాగుంది..

  ఫస్ట్ వీక్ బాగుంది..

  బ్రదర్ గా బాలాదిత్య గారి గేమ్ ఎలా ఉంది అని అడిగిన అరియానా గ్లోరి ప్రశ్నకు.. ''ఫస్ట్ వీక్ బాగుంది. తర్వాత వారం వారం వాడి గేమ్ తగ్గిపోతూ ఉంది. రాజకీయం పెరిగిపోతూ వచ్చింది'' అని తెలిపాడు కౌశిక్. దీనికి హౌజ్ లో ప్రవచనాలు చెబుతున్నారని పేరు ఉంది అన్న అరియానాతో ఇక్కడ కూర్చోని మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పాడు. అలాగే ఈ వారం ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ప్రశ్నకు మెరీనా గారు అని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు కౌశిక్.

  ఆడియెన్స్ నవ్వుకోడానికి మాత్రమే..

  స్ట్రాటజీస్ తో గేమ్ ఆడదాం, స్ట్రాటజీస్ తో ముందుకు వెళదాం అనుకునే గేమర్ ఎవరైనా కనిపించారా మీకు అని అడగ్గా.. గీతూ గారు, ఆదిరెడ్డి గారు, సూర్య అని తెలిపాడు. ఇనయా సుల్తానా గేమ్ ఎలా అనిపిస్తుంది అన్నదానికి.. బిగ్ బాస్ అనేదాన్ని ఆవిడ కాచి వడబోసి ఆరేసి మడతపెట్టి వచ్చేసింది బిగ్ బాస్ హౌజ్ లోకి అని చెప్పాడు. ఇక అర్జున్ కల్యాణ్, శ్రీసత్య ట్రాక్ గురించి అడగ్గానే అది ఆడియెన్స్ నవ్వుకోడానికి మాత్రమే జరుగుతున్న ట్రాక్ తప్పా అక్కడ అంతకు మించి ఏం లేదని నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు ఈ బుల్లితెర నటుడు కౌశిక్.

  English summary
  Serial Actor And Bigg Boss Telugu 6 Season Contestants Baladitya Brother Kaushik Interview With Ariyana Glory In BB Cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X