Just In
- 35 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజిత్‌ను దారుణంగా అవమానించిన సోహెల్ టీం.. ఫినాలే రోజు వివాదం సృష్టిస్తోన్న పోస్ట్
బిగ్ బాస్ షో ఉన్నా అయిపోయినా కంటెస్టెంట్ల మీద ట్రోలింగ్, సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది. బిగ్ బాస్ ద్వారా ఎంత మంచి పేరు వస్తుందో అంతే చెడ్డ పేరు వస్తుంది. ఒక్కసారి నెగెటివ్ ఇమేజ్ పడితే మళ్లీ లేవడం సాధ్యమయ్యే పని కాదు. అప్పుడెప్పుడో గత సీజన్‌లో నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకున్న వారే ఇంకా కనిపించడం లేదు. అలా అని టైటిల్ విజేతలు అయినంత మాత్రాన అవకాశాలు ఊడిపడుతున్నాయా? అంటే అదీ చెప్పలేం. కానీ కొందరికి మాత్రం సూపర్ పాజిటివ్ ఇమేజ్ వచ్చి ఫుల్ ఫేమస్ అవుతుంటారు. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ ఎదుర్కొవాల్సిందే.

బిగ్ బాస్‌కు సోషల్ మీడియాకు సంబంధం..
బిగ్ బాస్ షోకు సోషల్ మీడియాకు విడదీయలేని బంధం ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ నడిచినంత కాలం సోషల్ మీడియాలో మంచి టాపిక్‌లు నడుస్తుంటాయి. కంటెస్టెంట్లకు సపోర్ట్‌గా, వ్యతిరేకంగా ఇలా ప్రచారాలు జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ట్రోల్స్, మీమ్స్ ఇలా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ లభిస్తుంటుంది.

టాప్ 5 పోరు..
టాప్ 5 కంటెస్టెంట్లుగా అభిజిత్ సోహెల్ అరియానా అఖిల్ హారికలు ఉన్నారు. కానీ ప్రధానమైన పోటి మాత్రం సోహెల్ అభిజిత్ మధ్యే జరిగింది. కాకపోతే మధ్యలో అరియానాకు కూడా ఓట్లు భారీగా పడుతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ అది తప్పని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అరియానా నాల్గో స్థానంలోనే వెనక్కి మళ్లిందని లీకులు అందుతున్నాయి.

అభిజిత్ సోహెల్ వార్..
మొదటి నుంచి కూడా అభిజిత్ సోహెల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఇద్దరూ ఒక్కోసారి బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్లీ ఏదో గొడవలున్నట్టే కనిపిస్తుంది. సోహెల్ కూడా ప్రతీసారి మాస్ క్లాస్ అంటూ తేడాలు చూపిస్తుంటాడు. అయితే బయట వారి టీంలు కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారి అధికారిక ఖాతాల్లో ఇతర కంటెస్టెంట్లను ట్రోలింగ్ చేయరు. కానీ ఫినాలే ఎపిసోడ్ ఉండగా ఓ కొత్త వివాదాం తెరమీదకు వచ్చింది.

అభిజిత్‌పై నెగెటివ్ కామెంట్స్..
సోహెల్ అధికారిక ఖాతాలో ఓ మీమ్‌ను షేర్ చేశారు. అందులో అభిజిత్‌ను దారుణంగా కామెంట్ చేశారు. అదే సమయంలో సోహెల్‌కు బాగా ఎలివేషన్ ఇచ్చారు. హోటల్ టాస్క్‌లో అభిజిత్ హారికకు మసాజ్ చేయడాన్ని పులిహోర అని, అదే టాస్కులో సోహెల్ తన కాళ్లను దివి చేత పట్టిస్తూ మసాజ్ చేయించుకోవడాన్ని పులి అంటూ మీమ్ క్రియేట్ చేశారు. ఆ మీమ్‌ను సోహెల్ అఫీషియల్ ఖాతాలో షేర్ చేశారు.

మొదలైన వివాదం..
అలాంటి ట్రోలింగ్‌లు సోషల్ మీడియాలో సహజమే అయినా.. ఇలా అధికారిక ఖాతాలో కూడా వేరే కంటెస్టెంట్‌ను డీగ్రేడ్ చేసి చూపించడం, కించపరచడం మంచిది కాదంటూ సోహెల్ టీం మీద విరుచుకుపడుతున్నారు. ఇలా ఫినాలే రోజు చేయడం మరీ దారుణం అంటూ సోహెల్ టీంను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకి అది నిజంగానే సోహెల్ టీం షేర్ చేసిందా? లేదా? అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై సోహెల్ టీం స్పందిస్తుందా లేదా? అన్నది చూడాలి.