ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న టీవీ హీరోయిన్
Recommended Video

బెంగాళీ టీవీ నటి మౌమితా సాహా (23) తన ప్లాట్‌లో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోల్‌కతాలోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... మౌమితా సాహా రెండు నెలల క్రితం ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. ఆమె ఎంతకీ తలుపులు తెరవక పోవడంతో ఇంటి ఓనర్, చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. తలపులు బద్దలు కొట్టి చూడగా సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ మౌమితా సాహా మృతదేహం కనిపించింది.

మౌమిత చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశారు. దాని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
మౌమిత సాహా సోషల్ మీడియా అకౌంట్స్, ఫోన్ కాల్ లిస్ట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె చివరిగా చేసిన సోషల్ మీడియా పోస్టు పరిశీలించిన పోలీసులు ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లుఒక నిర్దారణకు వచ్చారు. ఫోన్ కాల్స్ లిస్టు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











