For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నీకు జీవితాంతం రుణపడి ఉంటా.. చేతులెత్తి మొక్కిన కార్తీక్.. ఏం జరిగిదంటే?

  |

  గోడ మీద నుంచి పడిన శౌర్య అలియాస్ జ్వాలాకు కార్తీక్ ట్రీట్‌మెంట్ చేస్తుండగా మత్తు నుంచి లేచింది. కార్తీక్ పేరు వినిపించింది. మా నాన్న పేరు కూడా కార్తీక్. ఆయన కూడా డాక్టర్. నాకు ఆయనే ట్రీట్‌మెంట్ చేస్తున్నారా? అని అడిగితే.. పరదా చాటుకు వెళ్లిన కార్తీక్.. తన గురించి చెప్పవద్దని అని సైగ చేయడంతో చంద్రుడు.. కార్తీక్ పేరు విన్నది నిజమే.

  కానీ నీవు విన్నది ఈ హాస్పిటల్‌లో కాంపౌండర్ పేరు అని చెప్పాడు. అయితే ఇక్కడికి మా అమ్మ, నాన్న వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఎక్కడో మా నాన్న, అమ్మ ఉన్నట్టు అనిపిస్తున్నది అని శౌర్య చెప్పింది. దాంతో తన కూతురు మాటలు విని కార్తీక్ భోరుమని ఏడ్చాడు. కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1535 లో ఇంకా ఏం జరిగిందంటే?

  నన్ను రౌడీ అని పిలుస్తాడు అంటూ

  నన్ను రౌడీ అని పిలుస్తాడు అంటూ

  మా నాన్న రౌడీ అని పిలుస్తాడు. నేనంటే నాన్నకు చాలా ఇష్టం. నన్ను మా నాన్న చాలా ముద్దుగా చూసుకొంటాడు అని శౌర్య అంటే.. నీ తలకు దెబ్బ తగిలింది. నేను మందులు రాసిస్తాను. తప్పనిసరిగా అల్లరి చేయకుండా వాడాలి. నీవు రౌడీ పిల్ల వేషాలు వేయవద్దు. నీవు త్వరగా కోలుకొంటే మీ అమ్మ, నాన్న నీకు దొరుకుతారు. కాబట్టి మందులు సరిగా వాడాలి అని డాక్టర్ చారుశీల అంటే.. సరే అని శౌర్య చెప్పింది. శౌర్యను నిద్ర పుచ్చగానే కార్తీక్ తన కూతురును చూసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు.

  చంద్రమ్మను పట్టుకొన్న దీప

  చంద్రమ్మను పట్టుకొన్న దీప


  ఇక కార్తీక్ బాధలో బయటకు వచ్చే సరికి.. ఎదురుగా దీప ఆటో దిగుతూ కనిపించింది. పనిమనిషిని టిఫిన్ తీసుకురావాలని చెప్పానుగా.. మరి ఈమె ఎందుకు టిఫిన్ తెచ్చింది. ఈమె ఏం చేయాలనుకొంటుందో అదే చేస్తుంది అని కార్తీక్ అనుకొంటుండగా.. హాస్పిటల్‌లో ఉన్న చంద్రమ్మను దీప చూసింది. నా బిడ్డను మాయం చేసిన ఈమె ఎప్పటికి కనిపించిందా? నేను గట్టిగా అరిస్తే పారిపోతుంది. మెల్లగా వెళ్లి పట్టుకొంటాను అంటూ దీప వెళ్లి చంద్రమ్మ పట్టుకొన్నది. నా బిడ్డను ఎక్కడ ఉంచావో చెప్పు అంటూ అరిచింది. దీపను చూడగానే చంద్రమ్మ పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పట్టుకొనే ప్రయత్నంలో దీప కిందపడిపోయింది. చంద్రమ్మ అక్కడ నుంచి వెళ్లి కారు పక్కన నక్కింది. కిందపడిపోయిన దీపను కార్తీక్ వెంటనే కారులో బయటకు తీసుకెళ్లాడు.

  కొడుకు, కూతురు కోసం సౌందర్య

  కొడుకు, కూతురు కోసం సౌందర్య

  ఇక కార్తీక్, దీపను వెతికేందుకు సౌందర్య కారులో బయలు దేరింది. అంజి డ్రైవ్ చేస్తుండగా సౌందర్య తన కొడుకు, కూతురు గురించి ఆలోచిస్తుంది. అయితే కారు డ్రైవర్ అంజి.. రాత్రి అయిపోయింది. ఇక్కడే హోటల్‌లో ఆగిపోదాం అని అంటే.. లేదు.. లేదు.. నీవు డ్రైవ్ చేసి అలసిపోయి ఉంటావు. నీవు రెస్ట్ తీసుకో. నేను వెతుకుతాను. ప్రతీ క్షణం నాకు చాలా ముఖ్యం అని దీప చెప్పింది. అయితే నేను లేకుండా నీవు ఒంటరిగా వెతకడం మంచిది కాదు అని అంజి చెప్పాడు.

  దత్తత తీసుకొని.. జ్వాలా అని

  దత్తత తీసుకొని.. జ్వాలా అని


  అయితే ఇంద్రుడుతో కార్తీక్ మాట్లాడుతూ.. శౌర్య మీ వద్దకు ఎలా వచ్చింది అని అడిగితే.. జ్వాలా మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా లైఫ్ మారిపోయింది. చిల్లర దొంగతనాలు చేసుకొనే మాకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ఒకరోజు దొంగతనం చేస్తుండగా మమ్మల్ని పట్టుకొన్నది. అయితే మేము ఒకరోజు బలవంతంగా ఒప్పించి ఇంటికి తీసుకెళ్లాం. కానీ మీ అమ్మ, నాన్న ఇళ్లు అమ్ముకొని అమెరికాకు వెళ్లారని తెలిసింది. ఆ తర్వాత మేము దత్తత తీసుకొని.. జ్వాలా అని పేరుపెట్టాం. అప్పటి నుంచి మాతోనే ఉంది. మీ అమ్మ, నాన్న వచ్చినా వెళ్లనని చెప్పింది. మీ అమ్మ, నాన్నతో కలిసి ఉండకపోవడానికి హిమ కారణమని తెలిసింది. యాక్సిడెంట్‌కు హిమ కారణమని జ్వాలాకు కోపం అని చంద్రుడు చెప్పాడు. ఈ కథంతా విని.. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని కార్తీక్ చేతులు జోడించారు.

  శౌర్య ఆచూకీ లభించడంతో

  శౌర్య ఆచూకీ లభించడంతో

  అయితే పనిమనిషి పార్వతితో దీప మాట్లాడుతూ.. ఇందులో ఉన్న అమ్మాయి మా పాప. ఎక్కడైనా కనిపించిందా అంటే.. ఈ పాప మీ అమ్మాయా? మరి ఇంద్రుడు, చంద్రుడు వద్ద ఉన్నదేంటి అని చెప్పగానే.. దీప వెంటనే వెళ్దాపదమని బయలుదేరింది. చంద్రుడు వద్ద ఉన్న శౌర్య కోసం ఆటోలో బయలుదేరింది. అయితే దీప తన కూతురును కలుసుకొన్నదా? లేదా అనే వచ్చే ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

  English summary
  Karthika Deepam December 14th Episode number 1535.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X