For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam గెలిచి ఓడింది నేనే.. దీప పరిస్థితి చూసి భోరుమన్న కార్తీక్

  |

  హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయిన జ్వాలా ఇంట్లో పేపర్ చదువుతుంటే.. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటావా? అని చంద్రమ అడిగితే. లేదు.. త్వరలో అమ్మ, నాన్న కలుస్తారు కదా.. అప్పుడు అందరం అక్కడికి వెళ్లిన తర్వాత చదువుకొంటాను అని జ్వాలా అన్నారు. అయితే చారుశీల నీకు ముందే తెలుసా? అని జ్వాలా అంటే.. అవును అని చంద్రమ్మ సమాధానం చెప్పింది. ఇంతకు ముందు వాళ్లింట్లో పనిచేశాను. అయితే దొంగతనం చేసి పట్టుపడితే.. ఇంకోసారి దొంగతనం చేయవద్దని చెప్పి.. వెయి రూపాయలు ఇవ్వపోయింది అని చంద్రమ్మ అంటే.. ఆమె అంతా మంచిదా? అయితే నేను ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేసి.. నేను అమ్మ, నాన్నను వెతుకుతాను అని జ్వాలా చెప్పింది. అయితే మీ నాన్నే నిన్ను వద్దని చెబుతున్నాడు. కానీ నిన్ను కంటికి రెప్పలా చూసుకొంటున్నాడు. కారణాలు ఏమిటో తెలియదు అని చంద్రమ్మ మనసులో అనుకొన్నది. కార్తీకదీపం సీరియల్‌ 1536 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

  నేను ఎందుకు పట్టుకోలేకపోయాను

  నేను ఎందుకు పట్టుకోలేకపోయాను


  చంద్రమ్మ దొరికినట్టే దొరికి పారిపోయిందే.. నేను ఎందుకు పట్టుకోలేకపోయాను అని దీప దీర్ఘంగా ఆలోచిస్తుంటే.. కార్తీక్ వచ్చి.. పనిమనిషి పండరి వంట చేసిందా? నిన్ను ఏ పని చేయకుండా చూసుకొనే పండరి.. వంట చేయనిస్తుందా? అని కార్తీక్ అంటే.. డాక్టర్ బాబు.. నాకు ఏం మాయ రోగం వచ్చింది. నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా? అసలు నాకు ఏమైంది. నాలుగు అడుగులు కూడా వేయలేకపోయాను అని కార్తీక్‌పై దీప ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో అంతా బాగానే ఉంది. నీకు ఆపరేషన్ అయింది కదా.. అందుకే పరుగెత్తలేకపోయావు. త్వరలోనే కోలుకొంటావు అని కార్తీక్ బుజ్జగించే ప్రయత్నం చేశాడు.

   శౌర్యకు ఎమైనా అయిందా?

  శౌర్యకు ఎమైనా అయిందా?


  అయితే శౌర్యను వెతకడానికి నేను వెళ్తాను అంటే.. ఇప్పుడే నీవు కోలుకొంటున్నావు. మళ్లీ బయట తిరిగితే ఆరోగ్యం పాడవుతుంది. నేను వెతుకుతాను కదా అని కార్తీక్ అన్నాడు. అయితే శౌర్యను త్వరగా వెతకాలి. అయినా ఇంద్రుడు, చంద్రుడు హాస్పిటల్‌కు ఎందుకు వచ్చారు. శౌర్యకు ఎమైనా అయిందా? అని అంటే.. లేదు.. శౌర్యను తీసుకు రాలేదు. వాళ్ల బంధువులు ఎవరో ఉంటే.. వారి కోసం వచ్చి ఉంటారేమో. నేను, చారుశీల హాస్పిటల్‌లో చూస్తున్నాం కదా.. త్వరలోనే శౌర్యను ఆచూకీని తెలుస్తుంది. నీవు నిశ్చంతగా ఉండూ అంటూ కార్తీక్ నచ్చజెప్పాడు.

   వెతికి వచ్చాను అని సౌందర్య అంటే

  వెతికి వచ్చాను అని సౌందర్య అంటే


  ఇక శౌర్య, కార్తీక్, దీపను వెతికేందుకు వచ్చిన సౌందర్య ఆ పనిలో బిజీగా ఉంది. హోటల్‌కు వచ్చి సేద తిరుతున్న ఆమెకు భర్త ఆనందరావు ఫోన్ చేశాడు. దాంతో ఇప్పటి వరకు నేను వెతికి వచ్చాను అని సౌందర్య అంటే.. రాత్రి వరకు వెతకకు అని ఆనందరావు చెప్పాడు. వాళ్లు బతికే ఉంటే.. మనకు కనపడకుండా ఎందుకు ఉంటున్నారు. సౌందర్య మీ కోసం పిచ్చిదానిలా తిరుగుతున్నది. మీరు ఎక్కడున్నా కనిపించండి అని ఆనందరావు తనలో తాను బాధపడ్డాడు.

   చంద్రమ్మ గురించే ఆలోచిస్తున్నావా?

  చంద్రమ్మ గురించే ఆలోచిస్తున్నావా?


  దీప పరిస్థితిని చూసి కార్తీక్ కంటతడి పెట్టుకొన్నాడు. నాకు గతం ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. నీ పరిస్థితి చూసి భోరుమని ఏడవటానికా? నిజాన్ని దాచడానికా? గతం గుర్తుకు రాకుండా ఉంటే.. కూతురు గుర్తుకు రాకుండా ఉండేదానిని అని కార్తీక్ బాధపడ్డాడు. ఇంకా చంద్రమ్మ గురించే ఆలోచిస్తున్నావా? అంటే.. అవును దొరికినట్టే దొరికి పారిపోయారు. ఇది మొదటిసారి కాదు. గతంలో తెలియక వదిలేశాను. ఇప్పుడు తెలిసి వదిలేశాను అని దీప అంది.. శౌర్య దొరికితే ప్రపంచంలో లేని ఆనందం నీ ముఖంలో కనిపిస్తుందని అనుకొన్నాను. కానీ ఇప్పుడు ఏడుపు చూస్తున్నాను. ఈ ప్రపంచంలో గెలిచి ఓడినా వాడు ఎవరైనా ఉన్నారంటే.. అది నేనే అని కార్తీక్ బాధపడ్డాడు.

   శౌర్యను చూసి డాక్టర్ చారుశీల కంగారు

  శౌర్యను చూసి డాక్టర్ చారుశీల కంగారు


  తన హాస్పిటల్‌కు వచ్చిన శౌర్యను చూసి డాక్టర్ చారుశీల కంగారు పడిపోయింది. ఇక కార్తీక్‌ను చూస్తే అంతే.. అని మనసులో అనుకొన్నది. ఇదిలా ఉండగా.. తాజా ప్రోమోలో పనిమనిషి పండరికి తన బిడ్డ శౌర్య ఫోటోను చూపించింది. ఈ బిడ్డ మీ అమ్మాయినా? ఇంద్రుడు, చంద్రుడు ఇంటిలో ఉన్నది అని అంటే.. వీళ్లు మీకు తెలుసా? అని దీప అడిగితే.. తెలుసు. మా ఇంటికి పక్కనే ఉంటారు. మనల్ని చూసి పారిపోయేంత సీన్ లేదు.. ఒక్క కేక వేస్తే.. మనవాళ్లు వచ్చి పట్టుకొంటారు అని పండరి చెప్పింది. దాంతో శౌర్యను పట్టుకొనేందుకు ఇద్దరు బయలుదేరారు.

  English summary
  Karthika Deepam December 15th Episode number 1536.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X