Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam పారిపోయిన మోనిత.. అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట
హార్ట్ సర్జరీ అనంతరం స్పృహలోకి వచ్చిన దీప.. శౌర్యను వెతికేందుకు వెళ్లేలేదా అని అరిచింది. బాధతో కేకలు పెడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు.. నీ హెల్త్ బాగైన తర్వాత ఇద్దరం వెతుకుదాం అని కార్తీక్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కార్తీక్ మాటలు వినికుండా శౌర్యను వెతకడానికి వెళ్తాను అని లేవడానికి ప్రయత్నిస్తే.. డాక్టర్ బాబు వెళితే.. నీకు ఆపరేషన్ ఎవరు చేసేవారు అని డాక్టర్ అరిచింది. దాంతో నాకు డాక్టర్ బాబు సర్జరీ చేశారా? అని దీప అంటే.. అవును అని డాక్టర్ చెప్పింది. దాంతో నీకు గతం గుర్తుకు వచ్చిందా? డాక్టర్ సాబ్ అంటూ దీప ఆనంద పడింది. దాంతో అవును అని కార్తీక్ సమాధానం చెప్పారు. గతం గుర్తుకు వచ్చిందని కార్తీక్ చెప్పగానే.. ఎప్పుడు గుర్తుకు వచ్చింది? నాకు ఎందుకు చెప్పలేదు అంటూ కార్తీక్‌ను ప్రశ్నలతో నిలదీసింది. అయితే నీకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి.. శౌర్యను తీసుకొని మనం హైదరాబాద్‌కు వెళ్దామని దీప అడిగింది. కార్తీకదీపం సీరియల్ 1526 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

ఇంట్లో ఎవరులేనిది చూసి మోనిత పారిపోయిందుకు ప్లాన్ వేసింది. సౌందర్య, ఆనందరావు బయటకు వెళ్లారు. హిమ హోంవర్క్ చేసుకొంటున్నది. ఇంతకంటే మంచి టైమ్ దొరకదు. ఇంటి నుంచి బయటపడాలి అంటూ కొడుకు ఆనంద్‌ను ఒడిలో పెట్టుకొని మోనిత బయటకు వెళ్లబోతుంటే.. హిమ ఎదురుపడింది. దాంతో నేను చిన్న పని ఉంది.. నేను బయటకు వస్తాను అంటూ హిమకు నచ్చజెప్పి వెళ్లింది.
ఇక మోనిత పెరోల్ మీద బయటకు వచ్చి.. మళ్లీ జైలుకు రాలేదు. ఆమె ఎక్కడుందో పట్టుకోమని నోటీసులు వచ్చారు. ఈ మోనిత ఎక్కడుందో తెలుసా? రత్నసీత అని కానిస్టేబుల్‌ను ఆఫీసర్ ప్రశ్నించింది. మోనితకు నేను గతంలో సహాయం చేశాను. కానీ నేను ఆ తర్వాత ఆమెను వదిలేశాను అని కానిస్టేబుల్ రత్నసీత చెప్పింది. కార్తీక్ ఫ్యామిలీ ఇలా కావడానికి మోనితనే కారణం అంటూ పోలీస్ ఆఫీసర్ అంది. మోనిత ఎక్కడున్నా నేను పట్టుకొంటాను అని చెప్పింది. బయటకు వచ్చిన మోనిత కారు బుకింగ్ చేసుకొని ఎవరికంటా పడకుండా పారిపోయింది. అయితే తన కుమారుడు వెంటలేకపోవడం గమనార్హం.
ఇంట్లో మోనిత కనిపించకపోయే సరికి ఆనందరావు, సౌందర్య కంగారు పడింది. ఇళ్లంతా వెతుకుతుంటే.. హిమ కనిపించింది. మోనిత ఏది అంటే.. ఇప్పుడే బయటకు వెళ్లి వస్తానని వెళ్లింది అని సమాధానం చెప్పింది. మోనిత పారిపోయిందా అంటూ సౌందర్య కంగారు పడింది. అమ్మ, నాన్న బతికే ఉన్నారా? ఆమె అక్కడికే వెళ్లిందా? అని హిమ ప్రశ్నించింది. అయితే మోనితను ఏం చేయాలో నేను తేల్చుకొంటా అని సౌందర్య చెప్పింది.