Don't Miss!
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Sports
ఓడినా వణికించాం.. మరో 10 పరుగులు చేసుంటే మేమే గెలిచేవాళ్లం: మిచెల్ సాంట్నర్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Karthika Deepam మోనితకు మెంటల్ సర్టిఫికెట్.. కార్తీకదీపంలో భారీ ట్విస్టు
శౌర్య విషయంలో ఇంద్రుడు, చంద్రుడు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. నా భర్త మాటతో బలవంతంగా శౌర్యను తన తల్లిదండ్రులకు అప్పగించడానికి ఒప్పుకొన్నాను. కానీ శౌర్య లేకుండా నేను బతకగలనా? తల్లిదండ్రులు లేరు కదా.. మా వద్ద ఉంటుందని అనుకొన్నాను. కానీ ఇలా మళ్లీ అప్పగించాల్సి వస్తుందని అనుకోలేదు. శౌర్య సంపన్న కుటుంబం నుంచి వచ్చినా.. మన వద్దే ఎందుకు ఉంటుంది. అలాంటి అమ్మాయిని మళ్లీ పంపించడం సమంజసం కాదేమో అని చంద్రమ్మ అంటే.. నీవు కథలు చెప్పి నా అభిప్రాయాన్ని మార్చకు. ఊరంతా వెతికినా కార్తీక్, దీప కనిపించడం లేదు అని ఇంద్రుడు అన్నాడు. కార్తీకదీపం తాజా ఎపిసోడ్ 1530 లో ఏం జరిగిందంటే?

దీప ఆరోగ్యం గురించి
ఇక హైదరాబాద్‌కు బయలుదేరిన కార్తీక్, దీప ఇద్దరు మధ్యలో భోజనం చేయడానికి హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో డాక్టర్ చారుశీల కాల్ చేయడంతో.. రిపోర్టులు పంపిస్తానన్నావు. పంపించలేదు. వేరే డాక్టర్‌కు చూపించావా? అని కార్తీక్ అడిగాడు. అయితే దీప ఎలా ఉంది? సమయానికి ట్యాబ్లెట్లు వేసుకొన్నదా? అని చారుశీల అడిగితే.. ఎంత మీ పేషెంట్ అయినా.. నేను డాక్టర్‌నే. ఆ విషయం నాకు వదిలేయ్ అని కార్తీక్ అంటే.. మరిచిపోతారని నేను గుర్తు చేశాను అని డాక్టర్ చారుశీల అన్నారు.

మోనిత మెంటల్ సర్టిఫికెట్‌తో
ఇక మోనిత వ్యవహారంపై ఆనందరావు, సౌందర్య, హిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా.. వాటికి కారణం మోనితనే అని సౌందర్య చెప్పింది. అయితే అరెస్ట్ తర్వాత ఏసీపీ రోషిణి ప్రశ్నిస్తుంటే.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది. తనకు ఏమీ గుర్తు లేదనే విధంగా ఏ విషయం చెప్పడం లేదు. తనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకొన్నది. తనకు ఏ మీ గుర్తు రావడం లేదని నాటకాలు ఆడుతున్నదని ఏసీపీ రోషిణి చెప్పిందని సౌందర్య చెప్పింది.

కోమాలో వారణాసి గురించి
హాస్పిటల్‌లో కోమాలో ఉన్న వారణాసి గురించి కార్తీక్, దీప చర్చించుకొన్నారు. తనకు గతం గుర్తుకు రావడానికి కారణం వారణాసి. ఎవరో కొట్టడానికి వస్తే నన్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో వారణాసి గాయపడ్డాడు. ప్రస్తుతం వారణాసి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని కార్తీక్ చెప్పాడు. దాంతో వారణాసి పరిస్థితి తెలుసుకొని దీప బాధపడింది.
|
మీకు ఎందుకు రక్త పరీక్షలు
కారులో ప్రయాణిస్తూ.. సర్జరీ నాకు జరిగింది కదా.. మీరు రక్త పరీక్షలు ఎందుకు చేయించుకొన్నారు. డాక్టర్లు ఏదో మాట్లాడుతుంటే విన్నాను.. ఆ సమయంలో నాకు మత్తు మందు ఇవ్వడంతో వినపడలేదు. నీకు ఏమీ కాలేదు కదా.. అని దీప అంటే.. నీకు ఎందుకంత భయం అని కార్తీక్ అంటే.. మనిద్దరికి ఏమైనా అయితే.. మన పిల్లలు ఏమై పోతారనే భయంతో అడుగుతున్నాను. మీరు ఎందుకు రక్త పరీక్షలు ఎందుకు చేసుకొన్నారు అని దీప అడిగింది.. అయితే నా తలకు దెబ్బ తగిలింది కదా.. అందుకే చేయించుకొన్నాను. ఇదంతా ఎందుకు.. కాసేపట్లో మనం అమ్మ, నాన్నలను కలువబోతున్నాం. దానికి గురించి ఆలోచించు అంటూ కార్తీక్ అన్నాడు.

తల్లిదండ్రులను కలిసిన కార్తీక్
భావోద్వేగాల మధ్య కార్తీక్, దీప తమ ఇంటికి చేరుకొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఇదే ఇంటిలో ఉంటున్నారు అని కార్తీక్ అన్నారు. అయితే ఇంటిలో కార్తీక్, దీప గురించి తలచుకొంటూ సౌందర్య ఎమోషనల్ అయ్యింది. హిమ పాలు తాగమంటే తాగకపోతే.. అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి. చిన్నప్పడు వాడితో అలాగే బాధపడ్డాను. వాడు ఎక్కడ ఉన్నాడో అని అనగానే.. వెంటనే అమ్మా అని కార్తీక్ పిలిచాడు. దాంతో ఇప్పుడు కూడా వాడు నా పక్కనే ఉండి పిలుస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. అయితే కార్తీక్, దీపను చూసి ఆనందరావు, సౌందర్య, హిమ ఆనందంలో మునిగిపోయారు. అయితే తాజా ఎపిసోడ్‌లో శౌర్య మీతో ఎందుకు లేదు అంటూ దీప ప్రశ్నించింది.