Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ టాప్ రేటింగ్‌తో ముందుకు సాగుతోంది జబర్ధస్త్. ఇది ఎంతో మంది ఆర్టిస్టులను కూడా పరిచయం చేసింది. అలా వచ్చిన వారిలో నూకరాజు ఒకడు. చిన్న వయసులోనే కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. వరుస ఆఫర్లతో తెగ హడావిడి చేస్తున్నాడు. అలాగే, లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును కూడా నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నూకరాజు లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

పటాస్ షోతో ఎంటరైన నూకరాజు
తెలుగు టెలివిజన్‌పై ప్రసారమైన సక్సెస్‌ఫుల్ షోలలో 'పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌గా పేరు సంపాదించాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని వరుసగా ఆఫర్లను దక్కించుకున్నాడు.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

అక్కడి నుంచి ఇక్కడకు ఎంటర్
చాలా కాలం పాటు 'పటాస్' షో విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, గత లాక్‌డౌన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ హేమాహేమీ కమెడియన్లతో పాటు పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో అలరించాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయి.. ఫుల్ పాపులర్ అయిపోయాడు.

కామెడీతో పాటు యాక్టింగ్ కూడా
'పటాస్'లో కంటే జబర్ధస్త్ షోలో చేయడం వల్ల నూకరాజు బాగా ఫేమస్ అయిపోయాడు. సాదాసీదా ఆర్టిస్టుగా ఇందులోకి వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగిపోయాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. దీంతో సినిమాల్లోనూ ఛాన్స్ పట్టేస్తున్నాడు.
బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

ఆ షోలు.. లవ్ ట్రాకుతో ఫుమస్
జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి తోటి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటోన్నారు.

టీమ్ లీడర్... తల్లిదండ్రులతో
సాదాసీదా కమెడియన్‌గా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన నూకరాజు ఇప్పుడు టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిపోయాడు. గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లో అతడు పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక, వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం నూకరాజు, ఆసియా తల్లిదండ్రులు స్కిట్ చేయడం కోసం వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్వహకులు తాజాగా విడుదల చేశారు.
Shivathmika Rajashekar: లేలేత అందాలతో కవ్విస్తోన్న శివాత్మక.. అబ్బో ఆమె ఫోజులు చూశారంటే!
ఎంగేజ్‌మెంట్.. ఇంద్రజ ప్రశ్న
జబర్ధస్త్ షోలో భాగంగా నూకరాజు - ఆసియా తల్లిద్రండులు స్కిట్ చేశారు. ఆరంభంలో అతడి తండ్రి అదిరిపోయే పేరడీ సాంగ్‌తో అందరినీ నవ్వించాడు. అనంతరం వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ వరకూ చేసినట్లు ఇందులో చూపించారు. ఇక, స్కిట్ తర్వాత జడ్జ్ ఇంద్రజ 'ఇంత దూరం తీసుకొచ్చి.. తాంబూలం మార్చుకునే దగ్గర కట్ చేసి వదిలేశారు ఏంటి' అని ప్రశ్నించింది.

నిజంగా కుదరదు అంటూనే
జడ్జ్ ఇంద్రజ అడిగిన ప్రశ్నకు నూకరాజు తల్లి 'మేడం ఇది స్కిట్ వరకే అన్నారు. నిజంగా అయితే కుదరదు మేడం' అని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆసియాతో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. నూకరాజు తల్లి ఆ మాట అనడంతో పాటు కోపంగా స్టేజ్ విడిచి వెళ్లిపోయారు. దీంతో అసలేం జరిగింది అనేది సస్పెన్స్‌గా మారింది. ఫలితంగా ఈ వీడియో వైరల్ అవుతోంది.