twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మోనిత చెంప పగలకొట్టిన దీప.. బాబాయ్‌ని చంపి కార్తీక్‌ను అలా అంటూ

    |

    తన కుమారుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తి కోటేశ్వరరావు. ఆయన యాక్సిడెంట్‌లో మరణించడంతో వాళ్ల బాబును కార్తీక్, దీప పెంచుకొంటున్నారు అని అప్పారావు చెప్పాడు. దాంతో మోనితలో రకరకాల ఫీలింగ్స్ కనిపించాయి. కార్తీక్ ముద్దుగా ఆడిస్తున్నది తన కొడుకేనా అంటూ ఆనందపడిపోయింది. తమ్ముడి కొడుకును ముద్దు చేస్తున్నావు.. నీ సొంత కొడుకును ఎనాడైనా ఎత్తుకొన్నావా అంటూ నిలదీసిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. తన కుమారుడి అచూకీ చెప్పిన అప్పారావుకు డబ్బు ఇవ్వబోగా అందుకు నిరాకరించి వెళ్లిపోయాడు.

    దాంతో ఆనందంలో మోనిత మునిగిపోయింది.. నా ఆనందరావు మమ్మీని వదిలి డాడీ వద్దకు వెళ్లాడా అని సంతోషపడింది. ఇదిలా ఉండగా, మోనిత బాబాయ్‌కి అనుకోకుండా గుండెలో నొప్పి వచ్చింది. దాంతో నర్సు విన్నీ వెంటనే టాబ్లెట్ ఇచ్చింది. దాంతో కాస్త ఉపశమనం కలిగింది. వెంటనే మోనితకు ఫోన్ చేసి బాబాయ్‌కి నొప్పి విషయాన్ని చెప్పింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లోని తాజా ఎపిసోడ్ 1282లో ఇంకా ఏం జరిగిందంటే..

    బాబాయ్ బతకడం ఇష్టం లేదా అంటూ

    బాబాయ్ బతకడం ఇష్టం లేదా అంటూ

    మోనిత కుట్రల గురించి దీప ఆరా తీయడం ప్రారంభించింది. డాక్టర్ లైసెన్స్ రావడానికి మోనిత కారణమైతే.. అది పోవడానికి ఎందుకు కారణం కాకూడదు అంటూ అనుమానించింది. వెంటనే వారణాసికి ఫోన్ చేసి మోనిత బాబాయ్‌ను ఆపరేషన్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారా అంటే.. లేదు. సర్జరీ రేపు అంటూ వారణాసి చెప్పడంతో మరింత అనుమానం దీపలో పెరిగింది.

    ఆపరేషన్ ఈ రోజే అని చెప్పారుగా అంటూ కార్తీక్‌కు దీప ఫోన్ కలిపింది. కార్తీక్‌తో దీప మాట్లాడుతూ.. మోనిత బాబాయ్ ఆపరేషన్ ఏ రోజు అని అడిగితే.. డాక్టర్‌ను నేను. సర్జరీ చేసేది నేను. మీరు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని కార్తీక్ కసురుకొన్నాడు. దాంతో డాక్టర్ బాబు.. ఆపరేషన్ ఎప్పుడో చెప్పండి. అంతకు మంచి అడగను అని దీప బతిమిలాడితే.. ఈ రోజే. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? అంటూ కార్తీక్ అసహనంతో సమాధానం చెప్పాడు. దాంతో సరే అంటూ దీప ఫోన్ పెట్టేసింది. మోనిత ఏదో చేస్తున్నది. తన బాబాయ్ బతకడం ఇష్టం లేదా అంటూ దీప మనసులో అనుకొన్నది.

    మోనితకు షాకిచ్చిన దీప

    మోనితకు షాకిచ్చిన దీప

    అప్పారావు చెప్పిన విషయంతో మోనిత ఆనందంతో ఉంటూ.. ఆనందరావు మీరు అక్కడే ఉండాలి. అక్కడే ఉంటూ మమ్మీని డాడీని కలుపాలి. ఆ పనిలో మీరు ఉండండి. నా బాబాయ్ తొందరగా పోతే.. ఆయన చావును అడ్డుపెట్టుకొని మీ డాడీ మనసును మార్చేసుకొంటాను. త్వరగా వచ్చేస్తాను. ఆనందరావు మీరు డాడీ వద్దకు వెళ్లి భలే పనిచేశారు అంటూ మోనిత తనలో తాను అనుకొన్నది. కారులోకి వెళ్లి కూర్చోగానే నర్సు విన్నీ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి.

    నర్సుకు ఏమీ పనిలేదా.. ప్రతీ చిన్న విషయానికి ఫోన్ చేస్తుంటుందని అనుకొంటూ ఇంటికి చేరింది. ఇంటికి వెళ్లగానే దీప వచ్చి బాబాయ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది అని చెప్పగానే.. అలా ఎలా తీసుకెళ్లింది. మీరు గాడిదలను కాస్తున్నారా అంటూ కోపంతో ఊగిపోయింది. కావాలనే నేనే బాబాయ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లలేదు. అంతా కరెక్ట్ జరుగుతుందని అనుకొంటుండగా.. దీప మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టింది అని మోనిత కంగారుపడిపోయింది.

    మోసాన్ని మోనిత బయటపెడితే..

    మోసాన్ని మోనిత బయటపెడితే..

    మోనిత బాబాయ్‌ను హస్పిటల్‌కు తీసుకెళ్లి కార్తీక్‌కు దీప అప్పగించింది. మోనిత ఏదో కుట్ర పన్నింది. బాబాయ్ ప్రాణాలు తీసి చేయాలనుకొన్నదో అని దీప అంటే.. నీవు మంచి పనిచేశావు. నీవు తొందరపడటం మంచే జరిగింది. లేకపోతే పాపం వాళ్ల బాబాయ్‌కి ఏం జరిగేదో.. ఆ పాపం నన్ను వెంటాడేదేమో. లక్కీగా నీవు ఆయనను తీసుకొచ్చావు. ఆపరేషన్ సక్సెస్ అయింది.

    కోలుకోగానే అమెరికాకు వెళ్లిపోతానని చెప్పాడు అని అంటుండగా మోనిత అక్కడికి వచ్చింది. ఏంటి కార్తీక్.. ఆపరేషన్ రేపు అని చెప్పి.. ఈ రోజే చేసేశావా? అని అనగానే... మోనితను లాగి చెంపపై ఒక్కటిచ్చింది. దాంతో దీప ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేకపోయింది. వెంటనే తేరుకొని..నిన్ను అంటూ మోనిత ఏదో అనబోగానే.. నువ్వు అబద్దం.. నీ ఆలోచన అబద్దం. నీ బతుకే పెద్ద అబద్దం అని దీప అంటే.. కార్తీక్ చూస్తున్నావా? నన్ను కొడుతుంటే చూస్తున్నావా అని మోనిత అనగానే మధ్యలో దీప జోక్యం చేసుకొంది. ఆపరేషన్ ఈ రోజే అని కార్తీక్ చెప్పాడు. అది ఇక్కడే నిరూపించగలను. ఫోన్ కాల్ లిస్ట్ కూడా ఉంది అని దీప అంటే.. అవును.. అది నిజమే.. కావాలనే నేను చేశాను అంటూ మోనిత ఆవేశపడిపోయింది.

    మోనితను లాగి పెట్టి కొట్టిన కార్తీక్

    మోనితను లాగి పెట్టి కొట్టిన కార్తీక్

    నా బాబాయ్‌కి ఆపరేషన్ చేయించవద్దని నేనే నిర్ణయం తీసుకొన్నాను. అవును.. కావాలనే చేశాను. ఇక్కడ మోనిత.. ఎందుకో తెలుసా? కార్తీక్‌ మీద ప్రేమ, పిచ్చి. బాబాయ్‌ను ఆపరేషన్‌కు ఒప్పించి.. బాబాయ్‌ ఆపరేషన్ ఆపేసి.. ఆయన చనిపోతే.. దిక్కులేని అయిపోయానని.. తల పగలకొట్టుకొని ఏడిస్తే.. కార్తీక్ మనసు కరిగేలా చేయాలి. ఆయన సానుభూతిని పొందాలని ప్లాన్ చేశాను. మోనిత.. మోనిత ఇక్కడ అనగానే.. ఆమెను లాగి కార్తీక్ చెంపపై గట్టిగా ఒకటి పీకాడు. దాంతో ఊహించని పరిణామానికి మోనిత బిత్తరపోయింది.

    తాళిని తెంచేసి ముఖంపై కొట్టిన కార్తీక్

    తాళిని తెంచేసి ముఖంపై కొట్టిన కార్తీక్

    కార్తీక్‌ను అలా చూస్తుండగా.. ఏమనుకొంటున్నావు నన్ను. అంత చులకనై పోయానా? నీ వల్ల నా ఫ్యామిలీ నరకం అనుభవిస్తున్నది. 11 ఏళ్లు దూరమైపోయాం. ఇంట్లో నుంచి పారిపోయాం. ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? నువ్వెవరు? నీతో నాకేంటి అంటూ కార్తీక్ ప్రశ్నించాడు. దాంతో అలా అంటావేమిటి? నేను కూడా నీ భార్యనే కదా అంటూ మెడలోని పసుపు తాడు లాగి చూపించింది. దాంతో మోనితను కిందికిపైకి చూసి పసుపు తాడును లాగి తెంచేశాడు. దాంతో దీప ముఖంలో ఆనందం కనిపించింది.

    నా బాబును వెతికి ఇవ్వు అంటూ మోనిత

    నా బాబును వెతికి ఇవ్వు అంటూ మోనిత

    మోనిత తాళిని తెంపిన కార్తీక్ మాట్లాడుతూ.. 20 రూపాయలు పెట్టి పసుపు తాడు కొనుక్కొని.. తాళి అంటే సరిపోతుందా? అలా వేసుకొన్న దానిని తాడు అంటారు.. కాని తాళి అనరు. దానికి ఓ పవిత్రత ఉంది అంటూ ముఖంపై విసిరికొట్టాడు. తాళి, బంధం, ప్రేమ, ఆప్యాయత లాంటి వాటి అర్ధం తెలియదు.. చెప్పినా అర్ధం కాదు. మేము ప్రశాంతంగా బతకాలంటే ఏం కావాలి.. డబ్బు కావాలా? బంగారం, బంగళా, షేర్లు అన్నీ రాసిస్తాను.

    మమ్మల్ని వదిలిపెట్టు. అని కార్తీక్ అంటే.. ఈవేమి నాకు వద్దు.. నాకు నా బాబు కావాలి. నా బాబు తెచ్చి ఇవ్వు. మన బాబు అని నువ్వు అనుకోవడం లేదు కదా.. నా బాబును నాకు వెతికిపెట్టి ఇవ్వు కార్తీక్. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మోనిత అంటే.. ఈ మాట మీదే ఉంటావా? అని కార్తీక్ అంటే.. డాక్టర్ బాబు.. నీవు ఎక్కడ నుంచి తీసుకొస్తావు. ఎక్కడ ఉన్నాడో తెలియదు అని దీప అంటే.. నీవు మధ్యలో రాకు.. మోనిత నీవు మాట మీద ఉంటావా అని కార్తీక్ అంటే.. మోనిత మాటలు నమ్మకు అని దీప ఏదో చెప్పబోయింది. దాంతో దీపను నీవు మధ్యలో రాకు అని చెప్పి.. మోనిత నీవు మాట మీద ఉంటావా అని కార్తీక్ అడిగితే.. సరే.. మన ప్రేమ మీద ఒట్టు అని మోనిత అంటే.. షటప్ అంటూ అరిచాడు. మాట మీద నిలబడు అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.

    మీ బంధంపై దెబ్బ తీస్తాను అంటూ మోనిత

    మీ బంధంపై దెబ్బ తీస్తాను అంటూ మోనిత

    ఇక దీప, కార్తీక్ తనను కొట్టడంపై మోనిత కుమిలిపోతూ.. ఇద్దరిని కొట్టారు కదా.. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకొంటాను. నా బిడ్డ కోసం ఎక్కడ వెతుకుతావు. నీ ఇంట్లోనే ఉన్న విషయం నీకు తెలియదు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూపించను. నా బిడ్డ ఆచూకీ తెలిసే వరకు కథను మరింత రసవత్తరంగా మారుస్తాను అని మోనిత అంటే.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఇద్దరు చేయిచూపించారు. దాంతో మీ ఇద్దరు నన్ను కొట్టారని గర్వపడుతున్నారేమో.. కానీ మీ అనుబంధం మీద అంతకు అంత దెబ్బ తీస్తాను అంటూ మోనిత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    English summary
    Karthika Deepam February 22nd Episode number 1282. Top most rating serial witness highly powerful scenes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X