»   » బిగ్ బాస్ చరిత్రలో షాకింగ్ రెమ్యూనరేషన్, ఎపిసోడ్‌కు 11 కోట్లు?

బిగ్ బాస్ చరిత్రలో షాకింగ్ రెమ్యూనరేషన్, ఎపిసోడ్‌కు 11 కోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వారికి 'బిగ్ బాస్' షో చాలా కొత్త. ఈ రోజుతో తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ ముగియబోతోంది. హిందీలో అయితే ఇప్పటికే 10 సీజన్లు పూర్తయ్యాయి. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ 10 వారాలు జరుగగా... వారానికి రెండు రోజుల చొప్పున ఆయన హోస్ట్ షో జరిగింది.

మొత్తం 70 రోజులు పాటు సాగిన బిగ్ బాస్ షోలో 20 రోజుల పాటు తారక్ హోస్ట్ షోలు ప్రసారం అయ్యాయి. ఇందుకు గాను ఓవరాల్‌గా ఎన్టీఆర్ రూ. 7 నుండి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. తెలుగులో బిగ్ బాస్ షో జరిగినట్లే హిందీ, తమిళం, కన్నడ ఇలా చాలా బాషల్లో ఈ షో ప్రసారం అవుతోంది.

టాప్ ప్లేసులో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్

టాప్ ప్లేసులో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్

హిందీలో ‘బిగ్ బాస్' రియాల్టీ షోను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాప్ ప్లేసులో కొనసాగుతున్న బిగ్ బాస్ షో ఇదే. హిందీలో ఇప్పటికే 10 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.

త్వరలో 11వ సీజన్ ప్రారంభం

త్వరలో 11వ సీజన్ ప్రారంభం

త్వరలో బిగ్ బాస్ హిందీ 11వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్లో సల్మాన్ ఖాన్ ఎవరూ ఊహించనంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. ఒక్కో ఎపిసోడ్ సల్మాన్ ఖాన్ రూ. 11 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

గత సీజన్లో 8 కోట్లు

గత సీజన్లో 8 కోట్లు

బిగ్ బాస్ 10వ సీజన్‌ను హోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ ఆ సీజన్లో ఒక్కో ఎపిసోడ్ కు రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ప్రతి సీజన్‌కు రెమ్యూనరేషన్‌ పెంపు

ప్రతి సీజన్‌కు రెమ్యూనరేషన్‌ పెంపు

హిందీ బిగ్ బాస్ 4, 6వ సీజన్లకు సల్మాన్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2.5 కోట్లు చార్జ్ చేశాడట. 7వ సీజన్లో ఒక్కో ఎపిసోడ్ కు రూ. 5 కోట్లు అందుకున్నాడని, 8వ సీజన్‌కు రూ. 5.5 కోట్లు తీసుకున్నాడని, 9వ సీజన్‌కు రూ. 7 కోట్లు, 10వ సీజన్ కు రూ. 8 కోట్లు అందుకున్నట్లు సమాచారం.

అక్టోబర్ 1 నుండి 11వ సీజన్

అక్టోబర్ 1 నుండి 11వ సీజన్

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోతున్న బిగ్ బాస్ 11వ సీజన్ అక్టోబర్ 1 తేదీన ప్రారంభం కాబోతోంది. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సల్మాన్ ఖాన్ అత్యధికంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 11 కోట్లు హోస్ట్ చేయబోతుండటం హాట్ టాపిక్ అయింది.

ఇదే బిగ్ బాస్ హౌస్

హిందీ బిగ్ బాస్ 11వ సీజన్ జరుగబోయే ఇంటి ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి.

ప్రోమో

హిందీ బిగ్ బాస్ 11 ప్రోమో కూడా రిలీజైంది. అక్టోబర్ 1 నుండి ఈ షో ప్రారంభం కాబోతోంది.

English summary
Fresh reports are emerging about Salman charging an unbelievable Rs 11 Cr per day to host the new season of Bigg Boss. Bollywood media is abuzz with the reports that Salman is charging 11 Cr per episode for hosting the 11th season of Bigg Boss. He reportedly charged Rs 8 Cr per episode for Bigg Boss 10.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu