Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss Elimination: ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్.. టాప్‌లో అతడే.. చివర్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్
తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఐదేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఐదోది కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఇప్పుడిది తుది అంకానికి చేరుకోవడంతో మరింత రంజుగా మారిపోయింది. చివరి వారం ఒకరు ఎలిమినేట్ అవడంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ వారానికి సంబంధించి ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా.. అందులో ఎవరు బయటకు వెళ్లిపోతారన్నది సస్పెన్స్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ అధికారిక ఓటింగ్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో తెలిసింది. ఆ సంగతులు మీకోసం!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

13 వారాలు.. 13 మంది ఎలిమినేట్
ఐదో సీజన్‌లోకి ఆరంభంలోనే 19 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 13 వారాలకు పదమూడు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారంలో ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లిపోయాడు.
హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

ఫినాలేకు చేరువ కావడంతో ఆసక్తి
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం లాస్ట్ వీక్ కాగా.. డిసెంబర్ 19న ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. గత వారామే టికెట్ టు ఫినాలే ద్వారా శ్రీరామ చంద్ర ఫైనల్‌లో అడుగెట్టాడు. ఇక, ఈ వారం రోల్ ప్లే టాస్కును ఇస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం.. హౌస్‌లో జరిగిన కొన్ని గొడవలను రీ క్రియేట్ చేస్తున్నారు. అలాగే, కంటెస్టెంట్లకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని అంటున్నారు. దీంతో ఇది మరింత ఆసక్తికరంగా మారిపోయింది.

ఆ ఐదుగురు ఎవరన్నది సస్పెన్స్
ఐదో సీజన్ ఫినాలే వీక్‌కు టైం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు చెబుతున్నారు. అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇప్పుడున్న ఆరుగురిలో ఒకరు ఇప్పటికే ఫినాలేకు చేరుకున్నారు. మిగిలిన వారిలో ఒకరు మాత్రం ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది బాగా సస్పెన్స్ అయిపోయింది.
Ashu
Reddy
Pregnant:
తల్లి
కాబోతున్న
అషు..
పిచ్చ
కొట్టుడు
కొట్టిన
తల్లి..
అలా
బయటకు
వచ్చిన
వీడియో
https://telugu.filmibeat.com/television/ashu-reddy-pregnant-prank-gone-wrong-105248.html

14వ వారం వాళ్లందరూ నామినేట్
గత సీజన్లతో పోలిస్తే ఐదో దానిలో ఆరంభం నుంచే వీలైనంత ఎక్కువ మందిని నామినేషన్స్‌లో ఉంచుతున్నారు. తద్వారా కంటెస్టెంట్ల భవిష్యత్‌ను ప్రేక్షకుల చేతిలో పెడుతున్నారు. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో టాప్ 5 కంటెస్టెంట్ల జాతకాలను కూడా ప్రేక్షకులకే వదిలేశారు. అందుకే హౌస్‌లో ఉన్న అందరనీ (టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ్ తప్ప) ఈ వారానికి నామినేట్ చేశారు. దీంతో మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు నామినేట్ అయ్యారు. ఇక, వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఊహలకే అందడం లేదు.

టాప్ ప్లేస్‌లో ఉన్నది అతడేనట
14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అంటే షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారట. ఒకరోజు అతడు.. ఒకరోజు ఇతడు అన్నట్లు టాప్ ప్లేస్‌ను పంచుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం వీజే సన్నీనే మొదటి స్థానంలో ఉన్నాడట. అయితే, షణ్ముఖ్‌కు అతడికి ఎంతో తేడా లేదని తెలిసింది. మరి ఈ వారాంతానికి టాప్ ప్లేస్ మారుతుందో లేదో చూడాలి.
RRR Trailer: వకీల్ సాబ్‌ను దాటలేకపోయిన ఆర్ఆర్ఆర్.. ఇంకా పవన్ కంట్రోల్లోనే అరుదైన రికార్డు

ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్
గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్ల అభిమానులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో పాటే సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక, 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆరంభ రోజుల్లో సిరి హన్మంత్ చివరి స్థానంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఒక్క ఎపిసోడ్‌కే ఆమె స్థానం మారిపోయినట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో ఉన్న ఆ కంటెస్టెంట్ ఏకంగా మూడో స్థానానికి వెళ్లిపోయిందట. దీంతో మొదటి మూడు స్థానాల్లో సన్నీ, షణ్ముఖ్, సిరి హన్మంత్ ఉన్నారని టాక్.

చివరికి పడిన స్ట్రాంగ్ కంటెస్టెంట్
ప్రస్తుతం
బిగ్
బాస్
హౌస్‌లో
ఉన్న
కంటెస్టెంట్లు
అందరిలో
తక్కువ
ఫాలోయింగ్
ఉన్న
కంటెస్టెంట్
మానస్
మాత్రమే.
అందుకే
అతడు
ఈ
వారం
ఆరంభం
నుంచీ
డేంజర్
జోన్‌లోనే
ఉన్నాడని
తెలుస్తోంది.
ఇక,
ఈ
వారం
మొదట్లో
మూడో
స్థానంలో
ఉన్న
ఆర్జే
కాజల్..
ఇప్పుడు
ఐదో
స్థానానికి
పడిపోయిందని
తెలిసింది.
శ్రీరామ్‌తో
జరిగిన
గొడవ
ఆమెకు
బాగా
మైనస్
అయిందని
అంటున్నారు.
అదే
సమయంలో
షన్నూ
పదే
పదే
తిట్టి
బాధ
పెట్టడ
సిరికి
ప్లస్
అయిందనే
టాక్
వినిపిస్తోంది.
అందుకే
వీళ్లిద్దరి
స్థానాలు
ఒకే
ఒక్క
ఎపిసోడ్‌తో
తారుమారు
అయ్యాయని
టాక్.