For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్‌తో పాటు ర్యాంకులు.. టాప్‌లో అతడు లాస్ట్ ఆమె.. అందరికీ షాక్

  |

  ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును సంపాదించుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది. ఈ జోష్‌లోనే తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా ఆరంభం నుంచే మంచి స్పందనతో దూసుకుపోతోంది.

  ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో నిర్వహకులు సరికొత్త టాస్కులతో ప్రయోగాలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇది మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 14వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ లీకైంది. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దాం!

  ఈ సారి మరింత వినోదాన్ని పంచేలా

  ఈ సారి మరింత వినోదాన్ని పంచేలా

  బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా దానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. దీంతో టీఆర్పీలో మన షో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటోంది. ఇప్పుడు ఐదో సీజన్‌లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఆరంభంలోనే 19 మందిని పంపిన నిర్వహకులు షోపై ఆసక్తిని పెంచారు.

  ఆ తర్వాత క్రమంగా షోలో గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో షోపై ఇంకా ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తూ సరికొత్త కాన్సెప్టులతో టాస్కులు ప్లాన్ చేస్తున్నారు.

  మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

  13 వారాలు... పదమూడు మంది ఔట్

  13 వారాలు... పదమూడు మంది ఔట్

  ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 13 వారాలకు 13 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారంలో ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లిపోయాడు.

  చివర్లో మరింత రంజుగా మారిందిగా

  చివర్లో మరింత రంజుగా మారిందిగా

  బిగ్ బాస్ ఐదో సీజన్ లాస్ట్ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాల్లో ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. గత వారామే టికెట్ టు ఫినాలే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో సింగర్ శ్రీరామ చంద్ర విజేతగా నిలిచాడు.

  తద్వారా ఫినాలేకు చేరిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఈ వారం కంటెస్టెంట్లకు ఎలాంటి టాస్కులు ఇవ్వబోరని తెలుస్తోంది. అంతేకాదు, వాళ్లకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని అంటున్నారు. దీంతో ఇది మరింత రంజకంగా సాగబోతుంది.

  Bigg Boss: షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో తొలిసారి.. అదే జరిగితే విన్నర్ అతడే!

  చివరి నామినేషన్.. అందరిలో ఆసక్తి

  చివరి నామినేషన్.. అందరిలో ఆసక్తి

  బిగ్ బాస్ షోలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌లో చివరి నామినేషన్ కావడంతో ఈరోజు జరిగే ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

  14వ వారం నామినేషన్స్ ప్రక్రియ లీక్

  14వ వారం నామినేషన్స్ ప్రక్రియ లీక్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో చివరి నామినేషన్ వీక్ కావడంతో దీన్ని సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సోమవారం జరిగే నామినేషన్ ప్రక్రియలో.. గార్డెన్ ఏరియాలో ఆరు ర్యాంకులతో కూడిన పోడియంలు ఏర్పాటు చేశారు. అందులో ఎవరు ఏ స్థానానికి అర్హులో తేల్చుకుని అక్కడ నిల్చోవాలంటూ ఈరోజు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వబోతున్నాడు. అందులో స్థానాలను బట్టో.. మరో రీజన్ చూపించో బిగ్ బాస్ కొందరని నామినేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ర్యాంకుల విషయంలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు జరిగాయని తెలిసింది.

  హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

  14వ వారం ఎవరు నామినేట్ అయ్యారు

  14వ వారం ఎవరు నామినేట్ అయ్యారు

  తాజా సమాచారం ప్రకారం.. 14వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ అంతా గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతుందట. మరీ ముఖ్యంగా నెంబర్ వన్ ర్యాంక్ కోసం కొందరు కంటెస్టెంట్లు గొడవ పడతారని తెలిసింది. ఇక, ఈ ప్రక్రియలో ఏకంగా ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ చంద్ర తప్ప.. అంటే హౌస్‌లో ఉన్న మిగిలిన సభ్యులు మానస్, కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఈ వారం నామినేట్ అయ్యారని సమాచారం.

  RRR Trailer: Radhe Shyam And Bheemla Nayak Trailer Release Dates | Filmibeat Telugu
   ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా?

  ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా?

  ఫినాలేకు ముందు ఒక వారం మాత్రమే ఉండడంతో కంటెస్టెంట్లు తమ ర్యాంకులను ఎంచుకోవాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడట. ఇందులో ఎన్నో గొడవలు జరిగిన తర్వాత కంటెస్టెంట్లు తమ తమ స్థానాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వీజే సన్నీ మొదటి స్థానంలో నిలవగా.. రెండో ర్యాంకులో షణ్ముఖ్ జస్వంత్ ఉన్నారట. ఇక, మూడో స్థానంలో ఆర్జే కాజల్, నాలుగో స్థానంలో శ్రీరామ చంద్ర, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి హన్మంత్ నిలిచారట. ఇక, టాస్క్ తర్వాత బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి షాకిచ్చాడట.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In 14th Week Kajal, Vj Sunny, Shanmukh, Maanas and Siri Gets Gets Nominated.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X