For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో కౌశల్‌, రాహుల్ సేమ్.. అందుకే సీజన్ 3 విన్నర్ అతడే.. వారిద్దరి మధ్య ఓట్ల తేడా ఏంతంటే..?

  |
  Bigg Boss Telugu 3 : Rahul Sipligung To Win The Title ? || అందుకే సీజన్ 3 విన్నర్ అతడే..!!

  బిగ్‌బాస్ షో అయిపోవడానికి వచ్చింది. రాజకీయ ఎన్నికల్లో ఉండే హడావిడి కంటే బిగ్‌బాస్ ఓట్ల కోసం చేసిన ప్రచారం, రచ్చ ఎక్కువైంది. సోషల్ మీడియా తమ అభిమాన కంటెస్టెంట్ల కోసం ఫాలోవర్స్ ప్రచారాన్ని హోరెత్తించారు. మొత్తం పది హేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన షో.. ముగిసేందుకు వచ్చింది. చివరకు రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలారు.

  ఈ వారంలో హొరెత్తిన ప్రచారం..

  ఈ వారంలో హొరెత్తిన ప్రచారం..

  రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలె అందుకుని మొదటగా టాప్ 5లోకి చేరుకున్నాడు. అటుపై బాబా భాస్కర్ సెకండ్ ఫైనలిస్ట్‌గా రావడం.. శివజ్యోతి ఎలిమినేట్ కావడం అంతా జరిగిపోయింది. చివరకు టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలిన వారికి బయట వారి పీఆర్ టీమ్స్, ఫాలోవర్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ వారం అంతా ప్రచారంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది.

   శ్రీముఖి విన్నర్ అంటూ ప్రచారం..

  శ్రీముఖి విన్నర్ అంటూ ప్రచారం..

  శ్రీముఖి విన్నర్ ఓ పిక్ వైరల్ కావడంతో వాటిపై ఆమె సోదరుడు స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశాడు. ఎవ్వరూ రిలాక్స్ కావద్దని చివరి నిమిషం వరకు ఓట్లు చేస్తూనే ఉండంటూ కోరాడు. కావాలనే అలాంటి ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నారంటూ అలాంటివి నమ్మొద్దని.. ఫినాలె ఎపిసోడ్ ఆదివారం షూట్ చేస్తారని తెలిపాడు. ఆ పిక్ ఎడిట్ చేసిందని.. వాటిని పట్టించుకోకండి అని వీడియో ద్వారా ఓ సందేశాన్ని పంపాడు.

   రాహుల్‌కు పెరిగిన మద్దతు..

  రాహుల్‌కు పెరిగిన మద్దతు..

  బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడకుండా.. నిజాయితీగా ఉన్న వ్యక్తిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు తెచ్చుకున్నాడు. ఏది ఉన్నా మొహం మీదే చెప్పడం.. ముక్కుసూటిగా వ్యవహరించడంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే అతను వాడే భాష మీద కొంచెం నెగెటివిటీ వచ్చినా.. వాటిని అతని ఫాలోవర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. మహేష్ మాట్లాడితే రాయలసీమ యాస అంటూ వెనకేసుకొచ్చిన నాగ్.. రాహుల్‌ను ఎలా తప్పుపడతారని ప్రశ్నించసాగారు.

  కౌశల్, రాహుల్ విషయం అదే జరిగింది...

  కౌశల్, రాహుల్ విషయం అదే జరిగింది...

  గత సీజన్‌లో కౌశల్ ఆడిన విధానానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. కౌశల్ పేరిట ర్యాలీలు తీయడం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే అందరూ అతడిని కార్నర్ చేయడం.. ఒంటరిని చేసి అందరూ ఆడటంతో అతనిపై సింపతి కూడా వర్కౌట్ అయింది. నామినేషన్స్ వచ్చేసరికి అందరూ కలిసి కౌశల్‌ను టార్గెట్ చేయడం అతనికి కలిసి వచ్చింది. అదే అతడ్ని విన్నర్ చేసింది. అందరి కంటే ఎక్కువ సార్లు (మొత్తం 11 సార్లు )నామినేషన్స్‌కు వెళ్లిన కౌశల్.. విజేతగా నిలిచాడు. అదే ఫార్మూలా రాహుల్ విషయంలోనూ జరిగింది. శ్రీముఖి పదే పదే రాహుల్‌ను టార్గెట్ చేయడంతో అతనిపై సింపతీ పెరిగింది. రాహుల్ నామినేషన్‌కు వెళ్లడం తిరిగి రావడంతో.. ఒకానొక సందర్భంలో శ్రీముఖి వెనక్కి తగ్గింది. రాహుల్ సైతం ఈ సీజన్‌లో 11సార్లు నామినేట్ అయ్యాడు. ఇదే విషయాన్ని పోల్చుతూ రాహుల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

  ఓట్లలో ఇద్దరికీ తేడా ఎంతంటే..?

  ఓట్లలో ఇద్దరికీ తేడా ఎంతంటే..?

  ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇద్దరికీ దాదాపు ఒకే రేంజ్లో ఓట్లు పోలయ్యాయి. అయితే రాహుల్‌కు కాస్త ఎక్కువగా (0.05శాతం) ఓట్లు వచ్చినట్టు వినికిడి. కానీ బిగ్‌బాస్ బ‌ృందం చివరి వరకు ఎవరిని విన్నర్‌గా ప్రకటిస్తుందో చెప్పలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీముఖికి బిగ్‌బాస్ నిర్హాకుల సపోర్ట్ ఉండనే ఉందని.. ఆమెకే టైటిల్ కట్టబెడతారనే టాక్ మరోవైపు నడుస్తోంది. ఏం జరగనుందో ఇంకొన్ని గంటల్లో తేలనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  English summary
  Bigg Boss 3 Telugu Buzz Is That Rahul Sipligunj Has Many Chances To Win Title. Kausahal And rahul Nominated 11 times Through Out Whole Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X