For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేష్ చెప్పిందే నిజమవుతుందా? అసలు బిగ్ బాస్ హౌస్లో అతని కథేంటి..?

|

బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలా ఉంటారు? ఎప్పుడెలా ప్రవర్తిస్తారు? కంటెస్టెంట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ఈ మూడో సీజన్లో.. మహేష్ కూడా అలానే ఉంటున్నాడు. అయితే మొదట్లో చాలా ఆవేశంగా ఉన్న మహేష్.. రానురాను కాస్త చల్లబడ్డాడు. అయితే గేమ్ ఆడే విధానాన్ని కూడా మార్చుకున్నాడు.

పునర్నవి ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాలా: రాహుల్.. ప్రేమగా మార్చుకుంటాడేమోనన్న వరుణ్

బాబా బంటుగా..

బాబా బంటుగా..

బాబా భాస్కర్ వెంటే ఉండటం, ఆయనతోనే మాట్లాడటం.. మిగతా ఎవ్వరితోనూ కలవకపోవడం లాంటివి చేయడం, ఇద్దరూ కలిసే రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే కనబడటంతో బాబా బంటు అని మహేష్కు ట్యాగ్ వచ్చేసింది. ఇక దీని నుంచి బయటపడాలని మహేష్ ప్రయత్నం చేశాడు..

వరుణ్ బ్యాచ్ కు దగ్గరైన మహేష్..

వరుణ్ బ్యాచ్ కు దగ్గరైన మహేష్..

బాబా బంటు అనే ట్యాగ్ పోవాలంటే అందరితో కలిసుండాలని నిశ్చయించుకున్న మహేష్ వరుణ్, రాహుల్, వితికా, పునర్నవిలతో బాగానే కలిసిపోయాడు. ఇక వీరితో క్లోజ్ గా ఉండేసరికి బాబాకు కాస్త దూరమయ్యాడు. వీరిద్దరి మధ్యలో కాస్త గ్యాప్ పెరిగింది. అయితే దీనంతటికి కారణం శ్రీముఖే అని మహేష్ అభిప్రాయం. మళ్లీ బాబాతో మాట్లాడి మామూలు స్థితికి వచ్చేశాడు.

Bigg Boss Telugu 3 : Episode 78 Highlights || బాబా స్ట్రాటజీ ప్లే చేశాడా..?
గతవారంలో మహేష్ చెప్పినట్టుగా ఎలిమినేషన్

గతవారంలో మహేష్ చెప్పినట్టుగా ఎలిమినేషన్

వరుణ్, రాహుల్, పునర్నవి, మహేష్ ఎలిమినేషన్లో ఉండగా.. ఆ ముగ్గురిలోంచే ఒకరు పోతారని మహేష్ తెలిపాడు. లేదంటే తానే ఎలిమినేట్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కలిసే ఉన్నారు.. వారిలోంచి ఎవరూ ఎలిమినేట్ కాలేదు.. వారికి ఆ బాధ ఎలా ఉంటుంది తెలియదు కదా? అందుకే ఈ సారి ఒకరు ఎలిమినేట్ కావాలి.. ఆ బాధ వారు కూడా పడాలంటూ చెప్పుకొచ్చాడు. నిజంగానే మహేష్ చెప్పినట్లు.. పున్ను ఎలిమినేట్ అయింది.

రెండు గ్రూపుల మధ్య వారధి..

రెండు గ్రూపుల మధ్య వారధి..

శ్రీముఖి గ్రూప్లో బాబా, అలీ, శివజ్యోతి ఉన్నట్లు నిన్నటి ఎపిసోడ్లో క్లియర్ కట్ గా తెలిసిపోయింది. వరుణ్, రాహుల్, వితికా, మహేష్ లు ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. శ్రీముఖి, అలీ, శివజ్యోతి, బాబాలు మరోచోట కూర్చుని మాట్లాడుతున్నారు. ఇక శ్రీముఖి మాట్లాడుతూ.. మహేష్ తనకు అందుకే నచ్చడంటూ.. తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. నామినేట్ అయ్యాడు కాబట్టే.. ఆ గ్రూప్లో చేరాడు అంటూ మహేష్ గురించి చెప్పుకొచ్చింది.

పుల్లలు పెడుతున్నాడని అనుకోవద్దు ప్రేక్షకులు..

పుల్లలు పెడుతున్నాడని అనుకోవద్దు ప్రేక్షకులు..

వరుణ్ వాళ్లతో మాట్లాడటం అయ్యాక శ్రీముఖి వాళ్ల దగ్గరకు వచ్చాడు. మీ మీటింగ్స్ అయిపోయాయా అంటూ శ్రీముఖి సెటైరికల్ గా అంది. మాష్టర్ గురించే మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు. అతను కావాలని చేసినా, స్ట్రాటజీ అయినా మనకు చెబుతాడా? అయినా ఎవరికి ఎవరు చేసినా మనం బాగా ఆడటం లేదు కాబట్టి నామినేషన్లోకి వచ్చాము.. పోయిన వారం కూడా మనమే కదా నామినేషన్లోకి వచ్చామని చెప్పినట్లు తెలిపాడు.

ఆ ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ. మనమే ఐదుగురం ఫైనల్కు వెళ్దామని మహేష్ అనగా.. మనది మనమే రీజన్స్ చెపుకుందామని శ్రీముఖి అంటూ.. నేను శివజ్యోతి పేరు చెబుతాను అది నాకు విలన్.. కిచెన్లో ఎప్పుడూ సహాయం చేయలేదంటూ.. చెప్పుకొచ్చింది. అయితే చివర్లో నామినేషన్స్ ఉండవంటూ అలీ పంచ్ వేశాడు. అలీ శివజ్యోతి నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటూ.. వరుణ్, రాహుల్, వితికా అవుతారని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అతి తెలివిని ప్రదర్శిస్తూ.. వీ, ఆర్ అంటూ బెడ్పై రాస్తూ.. అలీతో మాట్లాడుకొచ్చింది. అయితే ఆర్, వీ అంటూ అలీబయటకు మాట్లాడేసి.. ఇదేమన్నా పెద్ద సీక్రెటా? అని అన్నాడు. అయితే వారు మాట్లాడుకున్నట్లే.. రాహుల్, వరుణ్ నామినేషన్లోకి వచ్చారు. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

English summary
Bigg boss 3 Telugu 12th Week updates, Nomination Process Is Completed. Rahul varun And Mahesh Are not In Nominations. Mahesh Wants To close With Two Groups In Bigg Boss House
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more