For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజంగానే అన్ని కోట్ల ఓట్లు పడ్డాయా?.. కంటెస్టెంట్లు వీక్‌గా ఉన్నా పబ్లిసిటీ పీక్‌!!

  |

  బిగ్‌బాస్ నాల్గో సీజన్, కంటెస్టెంట్లపై వస్తోన్న రూమర్స్, సెటైర్స్, నెగెటివ్ కామెంట్లకు బదులు చెప్పేశాడు హోస్ట్ నాగార్జున. అయితే అది కావాలని చెప్పాడా? లేక షోకి ఉన్న ఆదరణ గురించి చెప్పాడో లేక షో సక్సెస్ అయిపోయిందని హింట్ ఇచ్చాడో తెలీదు గానీ వస్తూనే ఐదు కోట్ల ఓట్లు పడ్డాయని నెవ్వర్ బిఫోర్ అని ఘంటాపథంగా చెప్పేశాడు. ఇక వీటిపైనే నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

  గ్రాండ్‌గానే లాంచ్..

  గ్రాండ్‌గానే లాంచ్..

  నాల్గో సీజన్ గ్రాండ్‌గానే లాంచ్ అయింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే కంటెస్టెంట్ల విషయంలోనే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని టాక్ వచ్చింది. ఒకరిద్దర తప్పా మిగిలిన వాళ్లంతా తెలియని మొహాలే. వీరితో షోను రన్ చేయడమే కష్టం. అలాంటిది మొదటి వారంలో ఎలాంటి రసవత్తరమైన టాస్కులు లేకుండా కట్టప్ప చుట్టూ తిప్పి మమ అనిపించేశారు.

   మెల్లిగా పికప్..

  మెల్లిగా పికప్..

  అయితే ఈ సీజన్ మెల్లిగా పికప్ అవుతుందని అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. హౌస్‌లో గ్లామరస్ క్వీన్‌లు ఉండటం, కొత్త కొత్త ట్రాకులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు నాగ్ హింట్స్ ఇవ్వడం. ఇంకా ట్రాక్ స్టార్ట్ చేయలేదు ఎందుకని అడిగినట్టు ప్రశ్నలు అడగడం, దగ్గరుండి మరీ లవ్ ట్రాక్ నడిపించేందుకు నాగ్ సిద్దమైనట్టు కనిపిస్తోంది.

  దివి, హారిక, మోనాల్..

  దివి, హారిక, మోనాల్..

  ఈ సీజన్‌ భారాన్ని దివి, హారిక, మోనాల్ మోయాల్సి వస్తుందేమో. మోనాల్ కాస్త ఏడుపు తగ్గించి ఎవరి ట్రాక్‌లోనైనా నడిస్తే బాగానే వర్కవుట్ అవుతుంది. ఇక దివి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కింది. హారిక అభిజీత్‌తో బాగానే మూవ్ అవుతోంది. ఇక ఆరియానా యథావిథిగా అతిని ప్రదర్శిస్తోంది.

   ఎన్నో లోపాలు..

  ఎన్నో లోపాలు..

  గంగవ్వ మాటలు అందరికీ సరిగ్గా అర్థం కాకపోవడం.. మిగతా కంటెస్టెంట్లు తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాట్లాడటం, టాస్క్‌లు కూడా అంతగా మెప్పించేలా లేకపోవడంతో మొదటి వారం సోసోగా నడిచింది. అయితే ఎలిమినేషన్‌లో ఉన్నవారిని రక్షించేందుకు ప్రేక్షకులు వేసిన ఓట్లు మొత్తం ఐదు కోట్లు అంటే..కంటెస్టెంట్లు వీక్‌గా ఉన్నా పబ్లిసిటీ పీక్‌‌లో చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో గంగవ్వకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఇన్ సైడ్ టాక్.

  Bigg Boss Telugu 4 | Episode 6 Highlights | ఎలిమినేషన్ నుంచి గంగవ్వ సేఫ్ | Filmibeat Telugu
  ఒకరు అవుట్.. ఇంకొరు ఇన్..

  ఒకరు అవుట్.. ఇంకొరు ఇన్..

  ఇక మొదటి వారం ఎలిమినేషన్‌లో భాగంగా సూర్య కిరణ్ బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపలికి పంపబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కమెడియన్ సాయి కుమార్ (ఈరోజుల్లో ఫేం) నేడే హౌస్‌లోకి వెళ్లనున్నట్టు టాక్.

  English summary
  bigg Boss 4 Telugu 1st Week Total Votes Is 5 Crores And Sai Kumar Pampana As Wild card Entry, Surya Kiran Expected To eliminated In 1st Week
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X