Just In
- 5 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ మనం కలవాల్సిన టైమొచ్చింది.. హారిక దెబ్బకు అభిజిత్ యూ టర్న్
బిగ్ బాస్ 13 వారం చాలా ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అసలు రంగులు బయటకు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ కూడా ఆటకు తగ్గట్లుగా నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. నామినేట్ చేసే ప్రక్రియలో ఈ సారి రంగు నీళ్లను కోపం ఉన్నంత పోసి నచ్చని వారిని నామినేట్ చేయవచ్చని పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక అఖిల్, మోనాల్, అభిజిత్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

శాపంగా మారింది హారిక..
బిగ్ బాస్ 4లో ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరనే విషయంలో ఇప్పటికే అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అభిజిత్ హావా ఏ రేంజ్ లో ఉందొ సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. అతన్ని తిడితే ఆఖరికి నాగార్జునపై కూడా ట్రోల్స్ రావడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక అఖిల్ ఈ వారం కూడా నామినేషన్ లో నిలిచాడు. నమ్ముకున్న హారికనే అతని పాలిట శాపమైంది. అయితే అతను ఇప్పుడు సరికొత్తగా యూ టర్న్ తీసుకున్నాడు.

మోనాల్ కు ఇది పెద్ద షాక్
ఇక అభిజిత్ విషయంలో ఎంత ఆలోచించినా కూడా అనుకోని విధంగా గొడవలు అవుతున్నాయని అభి చాలా సార్లు వివరణ ఇచ్చాడు. అయితే ఈ సారి మోనాల్ ను నామినేట్ చేసే సమయంలో అభి మాట్లాడిన మాటలు ఎవరు ఊహించని విధంగా ఉన్నాయి. ఇక మోనాల్ కొంత సేపటి వరకు సైలెంట్ అయ్యింది. దెబ్బకు ఇద్దరు కలిసి మోనాల్ ను డేంజర్ జోన్ లోకి నెట్టినట్లు అనిపించింది.

మనం కలవాల్సిన టైమొచ్చింది..
మోనాల్ ఆట తీరుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేసిన అభి తనకోసం స్టాండ్ తీసుకోవాల్సిన సమయంలో కూడా కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆమె బౌల్ లో రంగు నీళ్లు పోసి అఖిల్ తో మాట్లాడాడు అభి. ఇక మన ఇద్దరం కలవాల్సిన టైమ్ వచ్చింది. మన సమస్యలన్నింటిని పక్కన పెట్టేస్తున్నాము. ఈ టైమ్ లో నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి నేను నిన్ను అర్థం చేసుకోవాలని అభి తెలిపాడు.

అభి యూ టర్న్ కి అసలు కారణం..
అభి సడన్ గా అఖిల్ వైపు యూ టర్న్ తీసుకోవడానికి అసలు కారణం ఏమిటో చాలా ఈజీగా అర్ధమయ్యింది. నమ్ముకున్న హారిక అభిని నామినేట్ చేయడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అభికి మరొకరి మద్దతు చాలా అవసరం అందుకే అఖిల్ అతనికి బెస్ట్ ఆప్షన్ అనిపించినట్లుంది. అందుకే గొడవలు ఎక్కువైనప్పటికి అఖిల్ తో దోస్తీకి సిద్ధమయ్యాడు. పైగా అఖిల్ , మోనాల్ కు దండం పెట్టేయడంతో అభికి అతనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. మరి రానున్న రోజుల్లో వీరి స్నేహం ఎలా ఉంటుందో చూడాలి.