Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాకు రొమాంటిక్ ఫీల్ రావట్లేదు.. ఈ సారి అభిజిత్ అట్టర్ ఫ్లాప్!
బిగ్ బాస్ షోలో వీకెండ్స్ లో నాగార్జున తన హోస్ట్ ద్వారా అనేక రకాల ట్విస్టులతో ఒక వైపు థ్రిల్ చేస్తూనే మరోవైపు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేస్తారు. అలాగే ఒక హోస్ట్ గా ఆయన బాధ్యత ప్రకారం డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వెళతారు. అయితే ఆయన ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పటికీ సోమవారం ఎపిసోడ్ కు ఎక్కువ హైలెట్ అవుతోంది. అందుకు కారణం ఎలిమినేషన్ ప్రక్రియ ఆ రోజే ఉండటం. ఇక ఈ సారి ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అభిజిత్ తీవ్రంగా నిరాశపరిచాడు.

నిరాశపరిచిన బిగ్ బాస్
చాలా సార్లు సోమవారం ఎపిసోడ్ కు అత్యదిక రేటింగ్ రావడానికి కారణం ఎలిమినేషన్స్ ను చాలా కొత్తగా క్రియేట్ చేయడం. అయితే ఈ సారి బిగ్ బాస్ ఏ విధంగా ఆలోచించాడో ఏమో గాని ఎవరికి వారు సొంత రాజ్యాంగం రాసుకోవాలి అంటూ అధికారం చేతుల్లో పెట్టేశారు. మహారాజు అయ్యే అవకాశం ఇవ్వడంతో టాలెంట్ ను బయటపెట్టడానికి చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు.

మొదటి మహారాజుగా సోహెల్
టికెట్ టూ ఫినాలే లభించడం ద్వారా సేవ్ అయిన అఖిల్ ను తప్ప మిగతా ఐదుగురుని డైరెక్ట్ గా నామినేట్ చేశారు బిగ్ బాస్.సొంత టాలెంట్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోవలనే కారణంతో మహారాజా టాస్క్ ఇచ్చారు. సోహెల్ మొదట బజార్ మోగగానే కిరీటాన్ని అందుకొని మహారాజుగా దర్శనం ఇచ్చాడు. అందులో అరియానా తన అల్లరితో అందరిని బాగానే డామినేట్ చేసేసింది. అయితే ఆ తరువాత అభి వంతు వచ్చింది.

అభిజిత్ అట్టర్ ఫ్లాప్
ప్రతి ఒక్కరికి సమానమైన టైమ్ ఇచ్చి రూల్స్ తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చని కంటెస్టెంట్స్ ను ఉపయోగించుకొని ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలని చెప్పడంతో సోహెల్ బాగానే కష్టపడ్డాడు. ఇక అభి మాత్రం ఈ టాస్క్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడనే కామెంట్స్ వచ్చాయి. అతనికి మహారాజా అయ్యే అవకాశం వచ్చినప్పుడు హౌజ్ మెంట్స్ ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. హారిక చేత ఒక పదాన్ని పదే పదే అనాలని టెస్ట్ పెట్టాడు.

రొమాంటిక్ ఫీల్ రావట్లేదు..
ఇక అరియానా, సోహెల్ మధ్య రొమాంటిక్ డ్యాన్స్ టెస్ట్ పెట్టాడు. వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తుండగా తనకు కొంచెం కూడా రొమాంటిక్ ఫీల్ రావట్లేదని చెప్పిన అభిజిత్.. ఇంకా కావాలి అంటూ ఒత్తిడి పెంచాడు. ఇక ఆ సీన్స్ ఎంత ఉన్నాయో గాని అభిజిత్ మహారాజా ఎపిసోడ్స్ ను ఎక్కువగా చూపించలేదు. ఒక విధంగా అభి షో ఈసారి అట్టర్ ప్లాప్ అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అధికారం కోసం ఎదురుచూస్తున్న వారిలో అరియానా, మోనాల్ మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.