Don't Miss!
- News
ఐప్యాక్ సర్వేతో రఘురామ రిజల్ట్స్ మ్యాచ్ ? పవన్-లోకేష్ ఎఫెక్ట్ కీలకం ! ముందస్తు ముహుర్తమిదే !
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
సోహెల్ పీఆర్ టీంను పెట్టుకుంటే కథ వేరేలా ఉండేది..అభిజిత్‌పై అలీ రెజా కామెంట్స్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసేందుకు వచ్చింది. నిన్నటి వరకు వచ్చిన ఓట్లతో టైటిల్ ఎవరు గెలిచారన్నది కూడా ఫిక్స్ అయింది. బయటకు అయితే అభిజిత్ పేరు వినిపిస్తోంది. కానీ అది నిజమని ఇప్పుడే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ షో. తనకు నచ్చినట్టుగా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగానూ నిర్ణయాలు తీసుకునే హక్కు బిగ్ బాస్‌కు ఉంటుంది. అలా చేసే అవకాశాలున్నాయి కూడా. అందుకే విజేత గురించి ఇప్పుడు పక్కన పెడదాం. అలీ రెజా మాట్లాడిన మాటలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఆట చూసి సపోర్ట్..
సోహెల్ నాకు ఎనిమిదేళ్లుగా తెలుసు. అతను నాకు సోదరుడి వంటి వాడు. అయితే అతన్ని సపోర్ట్ చేయడానికి మాత్రం కారణం అది కాదు. బిగ్ బాస్ షోలోకి వెళ్లేముందు అతను నన్ను మద్దతు అడిగాడు. నీదు నువ్ నిరూపించుకుంటేనే సపోర్ట్ చేస్తానని చెప్పాను. అందుకు రెండు మూడు వారాల తరువాత సోహెల్ ఆట చూసి సపోర్ట్ చేయడం ప్రారంభించాను అని అలీ రెజా చెప్పుకొచ్చాడు.

మతపరంగా కాదు..
మతపరంగా నేను సోహెల్‌ను ఎప్పుడూ మద్దతు తెలపలేదు.. అతడినే కాదు నేను ఎవరినీ కూడా మతపరంగా పక్షపాతం చూపించను.. పదేళ్ల క్రితం సోహెల్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతను ఎంతో ప్యూర్, జెన్యూన్, చిన్న పిల్లాడి మనస్తత్వం.. అవి చూసే మూడో వారం నుంచి సపోర్ట్ చేయడం ప్రారంభించాను అని అలీ రెజా పేర్కొన్నాడు.

నీలా నువ్ ఉండు..
ట్రోఫీ గెలవడం కంటే మన ఇంపాక్ట్ చూపించడం బెటర్ అని సలహా ఇచ్చాను. షో గురించి ఎలాంటి ప్రిపరేషన్స్ అవసరం లేదు.. పరిస్థితులకు తగ్గట్టు ఎలా రియాక్ట్ అవ్వాలే నేర్చుకో అని చెప్పాను. ఎందుకంటే నాకు ఎదురైన పరిస్థితులే అతనికి ఎదురుకాకపోవచ్చు కదా. అందుకే నీలా నువ్ ఉండు అని చెప్పాను. అలాగే ఉన్నాడు.. ప్రజల అభిమానాన్ని సంపాదించాడంటూ సోహెల్‌కు అలీ రెజా ఇచ్చిన సలహాల గురించి చెప్పాడు.

పీఆర్ టీం పెట్టుకుంటే..
లేడీ బిగ్ బాస్ విన్నర్ అవ్వలేరు.. దానికి జీరో చాన్స్ ఉంది. సోషల్ మీడియాను పరిగణలోకి తీసుకుంటే అభిజిత్ సోహెల్ మధ్య చాలా టఫ్ పోటీ ఉంది.. ఒకవేళ సోహెల్ కూడా ముందు నుంచి పీఆర్ టీంను పెట్టుకుని ఉంటే.. కథ వేరేలా ఉండేది. కానీ సోహెల్ ఫ్యామిలీ పీఆర్ పెట్టుకునే స్థోమత లేదు.. కానీ ఇప్పటికీ సోహెల్ గెలిచే అవకాశాలున్నాయి.. అభిజిత్ కంటే ఎక్కువగా అతను అతనిలా ఉంటూనే షో మొత్తాన్ని ముందుకు నడిపించాడంటూ సోహెల్ గురించి అలీ రెజా చెప్పుకొచ్చాడు.