Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 4 Elimination: మోనాల్ దారిలో అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్ నుంచి బయటకు..
బిగ్ బాస్ నాల్గో సీజన్ పోరు రసవత్తరంగా ఏమీ సాగ లేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా వ్యవహారం ఉంది. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగా ఫలితం రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లీకుల సమాచారం మేరకు హారిక ఐదో స్థానంలో ఉంది. ఫినాలే రేసు నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్ అప్డేట్స్ వరుసగా ఇలా బయటకు వస్తుండటంతో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చగా మారింది.

స్పెషల్ హ్యాష్ ట్యాగ్..
రేపటి బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కోసం స్టార్ మా ఇప్పటి నుంచే సంబరాలు మొదలెట్టేసింది. రేపు జరగబోయే ఫినాలే ఫెస్టివెల్‌లో అందరూ పాల్గొనండి అంటూ ఓ స్పెషల్ హ్యాష్ ట్యాగ్‌ను రిలీజ్ చేసింది. BB Telugu Grand Finale అనే హ్యాష్ ట్యాగ్‌తో సంబరాలు చేయాలని అందరినీ కోరింది. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

నాగార్జున స్పెషల్ ట్వీట్..
నాగార్జున కూడా ఇదే విషయాన్ని చెబుతూ హ్యాష్ ట్యాగ్‌ను ప్రమోట్ చేశాడు. ఫినాలె ఎపిసోడ్‌ను ఆదరించండి.. ఈ ఈవెంట్‌ను అందరికీ తెలిసేలా చేయండి.. ఈ హ్యాష్ ట్యాగ్‌ను వాడండి అంటూ వాయిస్‌ను రిలీజ్ చేశాడు. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం రేపు ఫినాలె ఎపిసోడ్ రచ్చ చేసేలా గట్టిగా ప్లాన్ వేశారు.

తమన్ కూడా..
ఇక రేపటి ఈ గ్రాండ్ ఫినాలె ఈవెంట్‌లో తమన్ తన డప్పులతో దరువు వేయనున్నాడట. దాదాపు 9 నెలల తరువాత ఇలా బయటకు వచ్చిన పర్ఫామెన్స్ ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ తమన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రేపు అసలు పండుగ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

హారిక అవుట్..
ముందుగా అనుకున్నట్టే హారిక 5వ స్థానానికే పరిమితమైనట్టు సమాచారం. ఆమె తన చేతులారా చేసుకున్న స్వయం కృతాపారాధమే ఐదోస్థానంలో నిలబెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరి వారాల్లో అభిని దూరం పెట్టడం, అఖిల్‌తో మరింత సన్నిహితంగా ఉండటంతోనే ఐదో స్థానంలో ఉందని కామెంట్లు చేస్తున్నారు.

అఖిల్ నాల్గో స్థానంలో..
ఇక అఖిల్ తాను విన్నర్ అవుతాను.. టైటిల్ కొడతాను అంటూ ఆశపడ్డాడు. కానీ చివరకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. అఖిల్ మూడో స్థానంలోనే ఆగిపోయాడని, టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికి ఇంట్లో సోహెల్, అభిజిత్ మిగిలారు. వీరిలో విన్నర్ అందరికీ తెలిసిందే. రన్నర్ ఎవరు అవుతారో చూడాలి.