Just In
- 17 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏడిస్తే సంపుతా మోనాల్.. ఓ వైవు అఖిల్ గాయపరిస్తే.. మరోవైపు సోహెల్ ట్రీట్‌మెంట్
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏడిస్తే మాత్రం అందరూ కలిసి ఓదార్పు యాత్రలు చేపట్టడం సర్వసాధారణం అనే చెప్పాలి. వీలైనంత వరకు కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఇక మోనాల్ జీవితంలో ఎంత ఏడ్చిందో తెలియదు గాని బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం జీవితానికి సరిపడే కన్నీళ్లు మొత్తం కార్చేసిందని మీమ్స్ వస్తున్నాయి. చాలాసార్లు కంటెస్టెంట్స్ కూడా ఆమె కన్నీళ్ళపై జోకులు వేసుకున్నారు.

ఆ రోజు వచ్చిందంటే.. మోనాల్ ట్యాప్ ఓపెన్ చేసినట్లే
నామినేషన్స్ మొదలయ్యాయి అంటే చాలు మోనాల్ ఆ రోజు ట్యాప్ ఓపెన్ చేసినట్లే. హారిక కూడా ఏడుస్తోంది గాని మోనాల్ రేంజ్ లో అయితే ప్రతి విషయానికి కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. ఇక పరిస్థితులు ఎలాంటివైనా కూడా మోనాల్ కన్నీళ్లకు మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఇక సోమవారం అయితే డోస్ మరింత పెంచేసింది. ఈ ఏడుపు ఏంట్రా బాబు..అనుకోని ఆడియెన్స్ ఉండరేమో. అంతలా ఓవర్ చేసింది మోనాల్.

గట్టిగానే గాయపరుచుకుంటున్నారు
ఇక ప్రతి వారం లాగే అఖిల్, మోనాల్ మధ్య మాటల తూటాలు గట్టిగానే పేలాయి. అఖిల్ ఆమె మీద నమ్మకం పెట్టుకుంటే చాలా ఈజీగా నామినేట్ చేసి షాక్ ఇస్తోంది. ఇక మోనాల్ కూడా తనకు నచ్చినట్లు గేమ్ ఆడాలని అనుకుంటోంది. ఈ క్రమంలో ఒకరినొకరు మనసులు గట్టిగానే గాయపరుచుకుంటున్నారు. మొన్నటి వరకు బెస్ట్ లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన ఈ ఇద్దరు ఇప్పుడు నువ్వా నేనా అంటూ నామినేషన్ లో వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు.

అఖిల్ ఏడిపిస్తే.. సోహెల్ ట్రీట్‌మెంట్
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఒక వైపు అఖిల్ మోనాల్ ను ఎడిపించేలా చేస్తుంటే.. మరోవైపు అతని మిత్రుడు సోహెల్ కన్నీళ్లు తుడుస్తూ ట్రీట్‌మెంట్ ఇవ్వడం విశేషం. అఖిల్, సోహెల్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. కానీ మోనాల్ విషయంలో అఖిల్ చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. అలాగే అఖిల్ కూడా మోనాల్ కు కౌంటర్లు ఇస్తూ ఏడిపిస్తున్నాడు. అయితే అవిషయంలో మోనాల్ ను ఓదార్చే పని పెట్టుకోవడం అలవాటుగా చేసుకున్నాడు సోహెల్.

ఏడిస్తే సంపుతా మోనాల్
మోనాల్ కన్నీళ్లు తుడిచినా సోహెల్ ఏడిస్తే సంపుతా.. గుద్దుతా అంటూ ఆప్యాయంగా తిట్టేశాడు. బ్రదర్ చెబుతున్నప్పుడు వినాలి కదా అంటూ వివరణ ఇవ్వగా మరోవైపు అఖిల్ సైలెంట్ గా ఉండిపోయాడు. వాళ్ళిద్దరి అనురాగం అఖిల్ కు ఏ మాత్రం నచ్చలేదని మోహంలోనే అర్ధమయ్యింది. కానీ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అన్నట్లుగా సోహెల్ వ్యవహరిస్తున్న తీరుకు అఖిల్ కూడా ఏమనలేని పరిస్థితి ఏర్పడింది. మరి రానున్న రోజుల్లో వీరి ఆప్యాయత ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.