For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఒక్క గొడవతోనే సోహెల్ సీన్ మారిపోయింది.. ఇక అభి కూడా సిద్ధం కావాల్సిందే

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలైనప్పుడు భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకోవడం కష్టమని చాలా కామెంట్స్ వచ్చాయి. అసలు షోలో చెప్పుకోదగ్గ సెలబ్రెటీలు ఎవరు కూడా లేరని చాలానే ట్రోలింగ్స్ వచ్చాయి. కానీ ఆ తరువాత మెల్లగా ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా అభిజిత్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే సోహెల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏకంగా ఫైనల్ కు చేరుకోవడంతో షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

  అరియానాపై కంప్లైంట్స్..

  అరియానాపై కంప్లైంట్స్..

  శనివారం ఎపిసోడ్ లో ఒక్కసారిగా అందరూ అరియానాపై ఎగబడినట్లు అనిపించింది. ఆఖరికి నాగార్జున కూడా ఆమెకు కౌంటర్స్ ఇస్తూనే మళ్ళీ సపోర్ట్ చేస్తున్నట్లుగా పాజిటివ్ గా మాట్లాడారు. అరియానా ఎమోషన్స్ తన ఇష్టమని దాని గురించి మిగాతా వారికి అనవసరం అంటూ యూ టర్న్ తీసుకున్నారు నాగార్జున. అయితే ఒక విధంగా సోహెల్ కు మంచి మార్కులే పడ్డాయి.

  ఒక గంట కంటెంట్ దొరకడం లేదా?

  ఒక గంట కంటెంట్ దొరకడం లేదా?

  ఈ వారం మూడు టాస్కులను ఇచ్చిన బిగ్ బాస్ పెద్దగా ఫన్ క్రియేట్ చేయలేకపోయినట్లు అనిపించింది. 16 గంటలకుపైగా హౌజ్ లో సందడిగా ఉండే కంటెస్టెంట్స్ నుంచి ఒక గంట ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా దొరకడం లేదా అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. గత రెండు రోజుల నుంచి షోకు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వడం లేదు. ఒక్క సోహెల్, అరియానా గొడవ తప్పితే ఈ వారం హైలెట్ అయ్యిందేమీ లేదు.

  ఆ గొడవ వలనే..

  ఆ గొడవ వలనే..

  ఇక తొలి ఫైనలిస్ట్ గా ఎంపికైన సోహెల్ కు ఈ మధ్య గొడవలు బాగానే ఉపయోగపడ్డాయి. మొదట అతని కోపమే మైనెస్ అని చెప్పిన నాగార్జున ఆ తరువాత పరవాలేదు అవసరం ఉన్నప్పుడు ఎమోషన్స్ ని బయటపెట్టాలని చెప్పడంతో తన అసలు కోపాన్ని మొన్నటి ఎపిసోడ్ లో చూపించాడు సోహెల్. టాస్క్ లో భాగంగా చిన్న బొమ్మతో మొదలైన గొడవలో అరియానాపై తన ఆగ్రహాన్ని చూపించాడు సోహెల్.

   ఆ పాయింట్స్ హైలెట్ చేయడంతో

  ఆ పాయింట్స్ హైలెట్ చేయడంతో

  ఆ గొడవలో సోహెల్ అరియానా మైనెస్ పాయింట్స్ హైలెట్ చేయడం బాగా కలిసొచ్చింది. అవినాష్ ఎమోషన్స్ తో కూడా ఆడుకున్నావ్, గోడవ పడ్డావ్ అంటూ జరిగిన తప్పులను కూడా క్లారిటీ చెప్పేశాడు. ఇక అఖిల్ విషయంలో జరిగిన గొడవ వల్ల కూడా సోహెల్ బాగా హైలెట్ అయ్యాడు. మహారాజా టాస్క్ లో అఖిల్ మంత్రిగా ఉన్నప్పుడు అంతగా సపోర్ట్ చేయలేదని అతని తప్పొప్పులను ఎత్తి చూపాడు. అందుకు తగ్గట్టుగా అఖిల్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయాడు.

  Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
  ఇక అభి సిద్ధం కావాల్సిందే..

  ఇక అభి సిద్ధం కావాల్సిందే..

  ఇప్పటికే అఖిల్ గెలుపు బాటను సెట్ చేసుకోగా ఇప్పుడు సోహెల్ కూడా బలంగా సిద్ధమయ్యాడు. ఇక గత రెండు వారాల నుంచి అభిజిత్ కొంచెం కూడా హైలెట్ కాలేదు. అయినప్పటికీ అతని ఓటు బ్యాంకుకు పెద్దగా డోకా లేదు. కానీ కేవలం ఓట్లు వస్తే సరిపోదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో తెలియదు కాబట్టి అభి రానున్న రోజుల్లో మరింత బలంగా మారాలనే కామెంట్స్ వస్తున్నాయి.

  English summary
  Whether or not she received such a craze as an anchor, Ariana gave herself the title of Bold Girl. The hustle and bustle in this young girl's house, which was seen with the entry of Bigg Boss 4th season, is not normal. Trying to impress with the daily comedy task is not going to be a workout in the range as expected either. There have already been a lot of satires on her voice.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X