Don't Miss!
- News
చంద్రబాబునాయుడి ప్రాణ స్నేహితుడు మృతి
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నాడు మోనాల్, నేడు సోహెల్.. లాజిక్‌లతో నోర్మూయించిన అవినాష్
బిగ్ బాస్ షోలో అవినాష్ ఒక్కోసారి అపరిచితుడిలా మారిపోతుంటాడు. టాస్కుల్లో ఒక్కసారిగా అంత ఎత్తున లేస్తాడు. అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన అవినాష్.. ఎందుకు ఎవరి మీద అరుస్తున్నాడో తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. అయితే కొన్ని సార్లు అవినాష్ మాటల్లో లాజిక్‌లు ఉంటాయి. వాటితో అవతలి వారు ఏం మాట్లాడాలో తెలీక నోర్మూసుకుని కూర్చునే పరిస్థితి వస్తుంది. గత వారం నామినేషన్ ప్రక్రియలో మోనాల్‌ను అలాగే లాజిక్‌తో కొట్టేశాడు.

మళ్లీ తాజాగా..
అయితే అలా మోనాల్‌ను లాజిక్‌తో కట్టిపడేసిన అవినాష్ తాజాగా సోహెల్‌ను నోర్మూయించాడు. రేస్ టు ఫినాలే టాస్క్ మొదటి లెవెల్‌లో భాగంగా పాలు పట్టే టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్ సోహెల్ కలిసి ఆడారు. కానీ బయటకు మాత్రం అలా చెప్పడం లేదు. వారు చెప్పకపోయినా అందరికీ అర్థమవుతూనే ఉంది.

ఇదే విషయంపై..
అలా కలిసి ఆడటంపైనే అవినాష్ సోహెల్‌ను ప్రశ్నించాడు. మొదటి లెవెల్ అందరం ఆడాం.. రెండో లెవల్‌కు నలుగురు వెళ్లారు.. మూడో లెవెల్‌లో ముగ్గురు లేదా ఇద్దరు మిగులుతారు.. మరి అప్పుడు ఎలా ఆడతారు? అని సోహెల్‌ను ప్రశ్నించాడు. అప్పుడు విడి విడిగా ఆడతామని సోహెల్ నోరు జారాడు.
Recommended Video

ఇరుక్కున్నాడు..
ఆ మాటను అవినాష్ పట్టుకున్నాడు. అంటే ఇంతకు ముందు కలిసి ఆడినట్టే కదా? అని సోహెల్‌ను తిరిగి ప్రశ్నించాడు. దీంతో సోహెల్ అవినాష్ మీద అరిచేశాడు. ఒంటరిగా ఆడు ఒంటరిగా ఆడు అని నువ్ ప్రతీసారి చెప్పకు.. మేం ఏదో తప్పు చేస్తున్నట్టు.. ఎప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు.. అది మా తెలివి అంటూ సోహెల్ ఫైర్ అయ్యాడు కానీ అవినాష్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.