For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఒక్క నిర్ణయంతో గెలిచేసింది.. అరియానాపై ఇంటా బయట అదే టాక్!!

  |

  బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఇమేజ్ మారపోవడానికి ఒక్క సంఘటన, ఒక్క మాట చాలు. ఒకే ఒక్క ఘటనతో ఆకాశమంతా ఎత్తుకు ఎదగొచ్చు.. లేదా అథ:పాతాళానికి పడిపోవచ్చు. ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. పరిస్థితిని బట్టివాటిని చేయాలా వద్దా అన్నది సదరు కంటెస్టెంట్ల వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలోనే బిగ్ బాస్ ఓ పెద్ద ట్విస్ట్ పెట్టాడు.

  మాస్టర్ ప్లాన్ వేశాడ..

  మాస్టర్ ప్లాన్ వేశాడ..

  బిగ్ బాస్ ఏడో వారానికి గానూ పెట్టిన నామినేషన్ ప్రక్రియ, జంటలుగా విడగొట్టిన తీరును చూస్తేనే మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థమైంది. అభిజిత్ హారిక, అఖిలో మోనాల్ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో బిగ్ బాస్‌కు తెలుసు. అందుకే ప్రేమతో ఎవరైనా త్యాగం చేస్తారా? లేదా వాదించుకుంటారా? అని ఆ జంటలను అలా ఫిక్స్ చేశాడు. మిగతా వారి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు వచ్చే ఉన్నాయి.. అలాంటి వాళ్లు నామినేషన్‌లో గొడవలు పెట్టుకుంటారా? లేదా సర్దుకుని త్యాగం చేస్తారా? అని పరీక్షించినట్టుంది.

  అవినాష్, దివిలు అలా..

  అవినాష్, దివిలు అలా..

  నామినేషన్ ప్రక్రియలో అఖిల్ తాను స్ట్రాంగ్ అని చెప్పడంతో మోనాల్ అంగీకరించింది. అది త్యాగమో మరేమిటో గానీ మోనాల్ నామినేట్ అయింది. ఇక తాను కేవలం రోబో టాస్కులోనే బాగా ఆడానని మిగతా ఎక్కడా కూడా బాగా ఆడలేదని చెప్పిన అభిజిత్ నామినేషన్‌లోకి వెళ్లాడు. అవినాష్ సోహెల్ మాత్రం చాలా సేపు వాదించుకున్నాడు. చివరకు అవినాష్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. లాస్య దివిలు కూడా వాదించుకున్నారు. లాస్యకు తన మీదున్న నెగెటివిటీ ఇలాగైనా పోతుందేమోనని తానే ముందుకు వచ్చి నామినేట్ అయింది.

  అక్కడ మాత్రం..

  అక్కడ మాత్రం..

  అన్ని జంటలు ఏదోలా ఓ కొలిక్కి వచ్చాయి. కానీ మెహబూబ్ అరియానా మాత్రం ఢీ అంటే ఢీ అనేలానే ఉన్నారు. ముందు నుంచీ అరియానాకు పట్టుబట్టి ప్రయత్నం చేయడం అలవాటే. ఏనాడూ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఫలితం గురించి పక్కన పెట్టి ఏదో ఒకటి చేయాలన్న తపన తనది. మరో వైపు మెహబూబ్‌కు నామినేషన్స్ అంటే విపరీతమైన భయం. అంతకు ముందు వారమే వెళ్లాల్సింది కానీ సోహెల్ కాపాడేశాడు.

  వాదోపవాదాలు..

  వాదోపవాదాలు..

  మెహబూబ్ అరియానాలు ఇద్దరూ ఏ మాత్రం తగ్గలేదు. నా కోసం నువ్ వెళ్లొచ్చు కదా అని ఒకరు అంటే .. నా కోసం నువ్ కూడా వెళ్లొచ్చు కదా అని ఇరువురు వాదించుకున్నారు. తామిద్దరం నామినేట్ అయ్యేందుకు సిద్దంగా లేమని బిగ్ బాస్‌కు పలు మార్లు సూచించారు. కానీ ఎవరో ఒకరు నామినేట్ కావాల్సిందేనని చెప్పుకొచ్చాడు. నేను నీకు ఓ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను.. అంటూ మొదటగా అరియానా మెహబూబ్‌ను అడిగింది. అదే రిక్వెస్ట్ నేను నీకు పెట్టుకుంటున్నాను అంటూ మెహబూబ్ అరియానాతో అన్నాడు...

  Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process
  పట్టు వదిలింది..

  పట్టు వదిలింది..

  ఇక మెహబూబ్ ఎలాగూ సాయం చేయడని తెలిసిన అరియానా తన పట్టు వదిలింది. నామినేట్ అయ్యేందుకు సిద్దమైంది. ఆ సమయంలో మెహబూబ్‌ను చూసి ఓ నవ్వు నవ్వింది.. ఇంకెప్పుడూ కూడా నువ్ సాయం చేయాల్సిన పని లేదంటూ తన్నుకొస్తున్న బాధను ఆపుకుంది. ఆమె చేసిన పనికి ఇంటా బయట ప్రశంసలు వస్తున్నాయి. సోహెల్, అఖిల్, లాస్య వంటివారంతా అరియానాను ఆకాశానికెత్తాశారు. ఈ దెబ్బతో అరియానా ఆకాశమంత ఎత్తుకు ఎదగ్గా.. మెహబూబ్ మాత్రం నెగెటివిటీ మూటగట్టుకున్నాడు.

  English summary
  week 7 Nominations Ariyana Wins Hearts, Bigg Boss 4 Telugu Noel sean lies About Family Background, Noel sean ABout Family Background, Harika ABout Her Father And Family Background, Bigg Boss 4 Telugu Contestants became emotional By Seeing Childhood pics, Amma Rajasekhar Comments On Avinash Monal Romance, sujatha Clarifies about Calling Bittu,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X