For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో ఎప్పుడో మొదలైన ఇది.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వారం ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ ట్విస్ట్ కనిపించేలా ఉంది. ఊహించని ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   జంబో ప్యాక్‌లా... మొదటి వారం రిజల్ట్

  జంబో ప్యాక్‌లా... మొదటి వారం రిజల్ట్

  ఎంతో గ్రాండ్‌గా మొదలైన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు. ఇక, వీరిలో మొదటి వారానికి సంబంధించి జరిగిన ఎలిమినేషన్స్ ప్రక్రియలో సరయు రామ్ బయటకు వెళ్లిపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆమె.. ప్రేక్షకులను నిరాశ పరిచింది.

  Maestro Twitter Review: మాస్ట్రోకు షాకింగ్ రిజల్ట్.. ప్లస్ మైనస్ అవే.. నితిన్ ఆ తప్పు చేయకపోతే!

  రెండో వారం నామినేట్ అయింది వీళ్లే

  రెండో వారం నామినేట్ అయింది వీళ్లే

  బిగ్ బాస్ షో ఐదో సీజన్ ఆరంభంలోనే భారీ స్పందనను అందుకుని జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే షో మొత్తంలో ఎంతో ముఖ్యమైన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవల మధ్య ప్రతి సోమవారం ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి రెండో వారం నామినేషన్స్ టాస్క్ సైతం ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్లు కొట్టుకునేంత పని చేశారు. ఈ వారానికి సంబంధించి ఆర్జే కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, ప్రియ, ప్రియాంక సింగ్, ఆనీ మాస్టర్, లోబోలు నామినేట్ అయ్యారు.

  అంతా అప్పుడే డిసైడ్ అయిపోయారు

  అంతా అప్పుడే డిసైడ్ అయిపోయారు

  రెండో వారం నామినేషన్స్ సమయంలో కొందరు కంటెస్టెంట్లు శృతి మించి మరీ మాట్లాడారు. అందులో సీనియర్ నటి ఉమాదేవి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. తనను చాలా మంది నామినేట్ చేశారన్న కారణంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అసభ్యకరమైన పదజాలంతో ఎదుటి వాళ్లను దూషించారు. అప్పుడామె ప్రవర్తనను చూసిన వాళ్లంతా రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేది ఉమాదేవే అని అనుకున్నారు. అంతేకాదు, ఆమెను విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన విషయం తెలిసిందే.

  బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

  రెండో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందా?

  రెండో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందా?

  మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ప్రైవేట్ పోల్స్‌లో సైతం సరయు రాయ్‌కు మాత్రమే ఆరంభం నుంచి తక్కువ ఓట్లు పోలయ్యాయన్న సంగతి విధితమే. అయితే, రెండో వారంలో పరిస్థితి అలా కనిపించడం లేదు. కంటెస్టెంట్ల స్థానాలు తరచూ మారుతున్నాయి. రోజుకోలా ఓటింగ్ ప్రక్రియ మార్పులు జరుగుతోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే అనధికార పోల్స్‌లో డేంజర్‌ జోన్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు పైకి కిందకు వస్తున్నారు. దీంతో ఇది ఎంతో ఆసక్తికరంగా మారబోతుందని టాక్.

   టాప్‌ ప్లేస్‌ కోసం ఇద్దరు... పోటీ పోటీగా

  టాప్‌ ప్లేస్‌ కోసం ఇద్దరు... పోటీ పోటీగా

  రెండో వారానికి సంబంధించిన పోలింగ్‌లో టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు భీకరంగా పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. సీనియర్ నటి ప్రియ, లోబోలలో ఒకరు మొదటి స్థానంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ జరుగుతోన్న సమయంలో వీరి స్థానాల్లో మార్పులు కనిపించాయి. ఆరంభంలో ప్రియ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత లోబో టాప్‌కు చేరుకున్నాడు. వీళ్లిద్దరి తర్వాత మాత్రం ప్రియాంక సింగ్ ఉంది. ఇక, ఈ ముగ్గురు ఈ వారం ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  డేంజర్ జోన్‌లో ఊహించని వాళ్లు రాక

  డేంజర్ జోన్‌లో ఊహించని వాళ్లు రాక

  మొదటి వారం ఆరంభం నుంచి ఒకే రకంగా సాగిన పోలింగ్.. రెండో వారంలో మాత్రం కంటెస్టెంట్ల ఆటను బట్టి, వాళ్ల వ్యవహార శైలిని బట్టి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, బయట ఎలాంటి ఫాలోయింగ్ ఉందో.. లోపల కూడా అలాంటి ఫలితాలే వచ్చేలా కనిపిస్తున్నాయి. వివరంగా చెప్పాలంటే.. ఈ వారం ఆనీ, నటరాజ్ మాస్టర్లు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ బయట పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఈ కారణంగానే వీళ్లు వెనకబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఆనీ, నటరాజ్ మాస్టర్‌లో ఒకరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు

  Recommended Video

  Nee Jathaga Movie Official Teaser
  ఎలిమినేట్ అనుకుంటే పైపైకి వెళ్తూ

  ఎలిమినేట్ అనుకుంటే పైపైకి వెళ్తూ

  ఈ వారం నామినేట్ అయిన వారిలో అందరి దృష్టి ఉమాదేవి పైనే ఉంది. సో.. రెండో వారంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమన్న టాక్ కూడా వినిపించింది. కానీ, పోలింగ్‌లో మాత్రం ఊహించని ఫలితాలు వస్తున్నాయట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉమాదేవి ప్రస్తుతం 4 స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరంభంలో చివర్లో ఉన్న ఆమె.. రోజు రోజుకూ పైపైకి వెళ్తూ సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆర్జే కాజల్‌తో పాటు నాలుగో స్థానానికి పోటీ పడుతున్నారట. అంటే.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని టాక్.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. in 2nd Week Anee and Nataraj Enter into Danger Zone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X