For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో హీరోయిన్ శ్రీయ సర్‌ప్రైజ్‌.. ఇద్దరు కంటెస్టెంట్లకు లక్కీ ఛాన్స్.. వచ్చిన వెంటనే జంటగా టూర్

  |

  ఎలాంటి పరిస్థితుల్లో ప్రసారం అయినా ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు.. కోల్డ్ వార్‌లు.. ప్రేమ వ్యవహారాలు.. రొమాంటిక్ సన్నివేశాలు వంటివి చూపిస్తూ నిర్వహకులు దీనిపై ఆసక్తిని మరింతగా పెంచుతూనే ఉన్నారు. దీంతో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఇందులోకి గెస్టుగా వచ్చిన శ్రీయ శరణ్.. కంటెస్టెంట్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇందులో ఎవరు గెలిచారో చూద్దాం పదండి!

  ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ

  ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ

  తెలుగులో ఎన్ని సీజన్లను పూర్తి చేసుకున్నా బిగ్ బాస్‌కు వచ్చే రెస్పాన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో దీనిపై అంచనాలు కూడా అదే రీతిలో ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఐదో సీజన్ ప్రారంభం అయింది. దీనికి కూడా ప్రేక్షకుల భారీ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతోంది.

  బెడ్‌పై బ్రాతో బాలయ్య హీరోయిన్: దారుణమైన ఫోజులతో అందాల ఆరబోత.. చూసి తట్టుకోవడం కష్టమే

  దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌ ప్లాన్ చేశారు

  దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌ ప్లాన్ చేశారు

  బిగ్ బాస్ షో జరుగుతోన్న సమయంలో వీకెండ్ ఎపిసోడ్స్ ఎంతో స్పెషల్‌గా ఉంటాయి. అలాంటిది దీనికి పండుగలు లాంటివి ఏమైనా వస్తే.. అవి ఇంకా ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ మధ్యనే షో నిర్వహకులు దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఇక, ఇప్పుడు అంటే ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు కూడా ఇచ్చారు నిర్వహకులు.

  సందడి చేసిన సినీ తారలు.. మాజీలు

  సందడి చేసిన సినీ తారలు.. మాజీలు


  బిగ్ బాస్ షోలో ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీ, దివి ఆటపాటలతో అలరించారు. అలాగే, అవికా గోర్ సహా పలువురు భామలు అదిరిపోయే డ్యాన్స్‌లు చేశారు. సుమ, సోహైల్, అవినాష్, బాబా భాస్కర్ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ అయింది. దేవరకొండ బ్రదర్స్, 'మంచి రోజులు వచ్చాయ్' టీమ్ సందడి చేసింది.

  Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్

  ఆమె స్పెషల్ అట్రాక్షన్... డ్యాన్స్‌లతో

  ఆమె స్పెషల్ అట్రాక్షన్... డ్యాన్స్‌లతో

  దాదాపు నాలుగు గంటల పాటు ఎంతో సందడిగా సాగిన దీపావళి ఎపిసోడ్‌లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఎపిసోడ్ చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అప్పటికే జంటలుగా ఉన్న కంటెస్టెంట్లతో డ్యాన్సులు చేయించే టాస్క్‌ ఇచ్చింది. అంతేకాదు, ఫేమస్ యాప్ మోజ్‌కు బ్రాండ్ అంబాసీడర్‌గా వచ్చానని చెప్పి.. దాని వివరాలు వెల్లడించింది.

  అదిరిపోయే డ్యాన్స్‌లు.. శ్రీయ ఖుషీగా

  అదిరిపోయే డ్యాన్స్‌లు.. శ్రీయ ఖుషీగా


  అంతకు ముందే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఇద్దరిరిద్దరని పటాకా జోడీలుగా మార్చి గేమ్స్ ఆడించారు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు సర్‌ప్రైజ్ అని చెప్పారు. ఇక, శ్రీయ ఇచ్చిన టాస్కులో జంటలుగా మారిన కంటెస్టెంట్లు అందరూ అద్భుతమైన స్టెప్పులతో అలరించారు. ఇవి జరుగుతున్న సమయంలో శ్రీయ ఫుల్ ఖుషీగా కనిపిస్తూ డ్యాన్స్ చేసేసింది.

  హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  రవి డ్యాన్స్‌కు ఫిదా.. విజేత కోసం చిట్టీ

  రవి డ్యాన్స్‌కు ఫిదా.. విజేత కోసం చిట్టీ


  శ్రీయ ఇచ్చిన మోజ్ టాస్కులో భాగంగా పటాకా జోడీలు డ్యాన్స్ చేయగా.. ఇందులో రవి, జెస్సీ కలిసి 'సై' సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు. ఇందులో జెస్సీ పోల్‌లా నిల్చుని ఉండగా.. రవి మాత్రం అదిరిపోయే స్టెప్పులతో ఫిదా చేశాడు. దీంతో వీళ్లకే ఎక్కువ మార్కులు వచ్చాయి. టోటల్‌గా చూస్తూ షణ్ముఖ్, సిరికి సమానమైంది. దీంతో చిట్టీలు తీయగా రవి జోడీ పేరు వచ్చింది.

  Recommended Video

  Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
  లక్కీ ఛాన్స్.. వచ్చిన వెంటనే టూర్‌కు

  లక్కీ ఛాన్స్.. వచ్చిన వెంటనే టూర్‌కు

  ఇక, దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో విజేతలుగా నిలిచిన పటాకా జోడీ యాంకర్ రవి, జెస్సీకి హీరోయిన్ శ్రీయ లక్కీ ఛాన్స్ ఇచ్చింది. మోజ్ ప్రమోషన్‌లో భాగంగా వీళ్లిద్దరికీ ఫారెన్ ట్రిప్ వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే రవి, జెస్సీ కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లే ఛాన్స్ ఉందన్న మాట.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Anchor Ravi and Jaswanth Padala Won Moj Freign trip in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X