For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: హౌస్‌లోకి పాత సీజన్ కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ అదిరిపోయే ప్లాన్.. వాళ్లందరికీ మూడినట్లే

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే గతంలో ఏ కార్యక్రమానికీ దక్కనంత ఆదరణను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో నడిచినా తెలుగు ప్రేక్షుకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఇది దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఐదో సీజన్ సైతం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగనున్న వీకెండ్ ఎపిసోడ్‌ను దీపావళి పండుగ స్పెషల్‌గా నిర్వహించబోతున్నారట. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  మరింత మజాను పంచేందుకు ప్లాన్

  మరింత మజాను పంచేందుకు ప్లాన్


  ఐదో సీజన్‌లో ఐదింతల ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో దీనికి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా షోను మరింత రంజుగా మార్చేలా నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు.

  Bigg Boss: ఒక్కరోజులో మారిన ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు.. జనాలు మెచ్చిన కంటెస్టెంట్ ఔట్!

  19 మందిలో ఏడుగురు ఎలిమినేట్

  19 మందిలో ఏడుగురు ఎలిమినేట్

  తాజా సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున.. ఏడు వారాలకు ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. అందులో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత వర్మ, ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయిపోయారు.

  ఈ వారం గొడవలు.. నాగార్జున ఫైర్

  ఈ వారం గొడవలు.. నాగార్జున ఫైర్

  ఎనిమిదో వారం బిగ్ బాస్ షో ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో జరిగిన నామినేషన్స్ టాస్క్ ఎమోషనల్‌గా జరిగింది. అయితే, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో కొన్ని గొడవలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్సీ టాస్కులో సైతం రచ్చ రచ్చ జరిగింది. దీంతో శనివారం జరగనున్న ఎపిసోడ్‌లో గొడవలు పెట్టుకున్న వాళ్లపై నాగార్జున ఫైర్ అయ్యాడట.

  Puneeth Rajkumar: బాలకృష్ణకు పునీత్ సహాయం.. స్టార్ అయినా ఆయన కోసం చిన్న పిల్లాడిలా.. వీడియో వైరల్

  ఆదివారం దివాళీ స్పెషల్ ఎపిసోడ్

  ఆదివారం దివాళీ స్పెషల్ ఎపిసోడ్

  బిగ్ బాస్ షో జరుగుతోన్న సమయంలో వీకెండ్ ఎపిసోడ్స్ ఎంతో స్పెషల్‌గా ఉంటాయి. అలాంటిది దీనికి పండుగలు లాంటివి ఏమైనా వస్తే.. అవి ఇంకా ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ మధ్యనే షో నిర్వహకులు దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఇక, ఇప్పుడు అంటే ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నారట. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారట.

  బిగ్ బాస్ అదిరిపోయే ప్లాన్ రెడీగా

  బిగ్ బాస్ అదిరిపోయే ప్లాన్ రెడీగా

  బిగ్ బాస్ షోకు తెలుగులో భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్స్‌లో మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో పండుగ స్పెషల్ ఎపిసోడ్స్ వల్ల ఇంకాస్త ఎక్కువ రేటింగ్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌ను మరిన్ని సర్‌ప్రైజ్‌లతో నడిపించబోతున్నారట. ఇందుకోసం కొన్ని ఆట పాటలతో పాటు గెస్టులను కూడా తీసుకొస్తున్నారట.

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

  హౌస్‌లోకి పాత సీజన్ కంటెస్టెంట్లు

  హౌస్‌లోకి పాత సీజన్ కంటెస్టెంట్లు


  దీపావళి ఎపిసోడ్‌లో భాగంగా పాత సీజన్లలోని కంటెస్టెంట్లను తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీ, దివి వాద్యాలు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అలాగే, మరికొందరు కంటెస్టెంట్లు పెర్ఫార్మెన్స్‌లు చేయబోతున్నారని అంటున్నారు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. Ariyana, Monal and Divi will be Special Attraction on Diwali Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X