For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 elimination: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎవరు అవుట్ అంటే.. దారుణంగా ట్రోల్స్ తో!

  |

  బిగ్ బాస్ తెలుగు 5 రియాల్టీ షో ఇప్పుడు నాలుగో వారం చివరికి చేరింది. అయితే ప్రతి ఆదివారం ఒక హౌస్ సభ్యుడు ఎలిమినేట్ అవుతూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం మీద తీవ్రమైన ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ లో మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లడంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం మీద ప్రేక్షకలోకం అంత ఆసక్తి కనబరుస్తోంది. అయితే ఇప్పుడు హౌస్ నుంచి ఒక సభ్యుడు ఎలిమినేట్ అయ్యాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజా ఎలిమినేషన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  ఏకంగా ఎనిమిది మంది

  ఏకంగా ఎనిమిది మంది


  ఈ వారం ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్‌ అయ్యారు. లోబో, ఆర్జే కాజల్‌, సిరి హన్మంత్‌, యానీ మాస్టర్‌, ప్రియ. యాంకర్‌ రవి, నటరాజ్‌ మాస్టర్‌, వీజే సన్నీ నామినేషన్‌లో ఉన్నారు. అయితే వివిధ పేజీలు సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న అనధికారిక పోల్స్‌లో వీజే సన్నీ ఎక్కువ ఓట్లు సాధిస్తూ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా ఆ తర్వాత ప్రియ, యాంకర్‌ రవి, సిరి హన్మంత్‌, ఆర్జే కాజల్‌ లు టాప్ లో నిలుస్తున్నారు. లోబో, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌ లకు అన్ని చోట్లా పెద్దగా ఆదరణ లభించడం లేదు.

  ఆయనే ఔట్

  ఆయనే ఔట్


  అయితే ఇప్పటి వరకు హౌస్ నుంచి లేడీస్ నే బయటకు ఆడవాళ్లనే పంపించారు కాబట్టి ఈసారి మేల్‌ కంటెస్టెంట్‌ను పంపించేందుకు ఆస్కారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మొత్తంగా ఈ వారం కొరియోగ్రాఫర్‌ నటరాజ్ బిగ్‌బాస్‌ను వీడి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన నటరాజ్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లో రాణించాలని కృష్ణాజిల్లా ఆగిరిపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన నటరాజ్ మాస్టర్ డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

  రియాల్టీ షోల ద్వారా

  రియాల్టీ షోల ద్వారా


  ఎక్కువగా ఆయన రియాల్టీ షోల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి కెరీర్ మొదట్లో ఒక స్టార్ హోటల్ లో పనిచేస్తున్న నటరాజ్ మాస్టర్ టాలెంట్ ను గుర్తించి నిర్మాత సత్యనారాయణ ప్రోత్సహించారు. అప్పట్లో కొరియోగ్రాఫర్ గా ఉన్న డిస్కోశాంతి వద్ద నట్రాజ్ మాస్టర్ చేరి అక్కడ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. డాన్స్ బేబీ డాన్స్ అనే షో తో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి కెరీర్ మొదలు పెట్టిన మాస్టర్ ఆ తర్వాత ఏడాదిలోనే వీధి అనే సినిమాలో నటించారు తర్వాత కూడా చక్రం, హైవే, గొడవ లాంటి అనేక సినిమాలలో కనిపించారు.

  అలా ప్రేమ పెళ్లి

  అలా ప్రేమ పెళ్లి

  ఆ తర్వాత ఆట సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా కనిపించిన నట్రాజ్ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు. అలాగే ఆట సీజన్ 2,3లో కూడా కంటెస్టెంట్ లకు మెంటర్ గా వ్యవహరించారు. అలా ఆటషో లో పరిచయమైన నీతూ అనే యువతిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక జీ తెలుగులో వచ్చిన మగధీర డేర్ టు డాన్స్ అనే ఒక షో ద్వారా ఆయన నిర్మాతగా కూడా మారారు అనూహ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన నట్రాజ్ మాస్టర్ హౌస్ లో వింత సభ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

  పెద్ద ఎత్తున ట్రోలింగ్

  పెద్ద ఎత్తున ట్రోలింగ్

  ఇక నటరాజ్ మాస్టర్ వెళ్లిపోవడం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిగ్‌బాస్‌ షోను జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడని ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్‌ తెప్పిస్తున్నాడని అంటున్నారు. ఇక ఆయన మిగతా కంటెస్టెంట్లను మాత్రం నోటికొచ్చినట్లు తిడుతూ కొన్ని జంతువులతో పోలుస్తూ టార్చర్‌ పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మొదట్లో హౌస్‌లో గుంటనక్క ఉందని ఆ గుంటనక్క ఎవరు? అని స్వయంగా హోస్ట్‌ నాగార్జున అడిగినప్పటికీ ఆయన పెదవి విప్పలేదని అంటున్నారు. అలాగే హౌస్‌లో ఊసరవెల్లి కూడా ఉందని పిల్లి, నెమలి, ఎలుగుబంటి.. ఇలా ఎన్నో రకాల జంతువులతో పోలుస్తూ ఆయన ఇరిటేషన్ తెప్పిస్తున్నాడని అంటున్నారు.

  English summary
  Bigg Boss Telugu 5 Week 4 elimination: As per social media reports nataraj master Shari Eliminated from Bigg Boss Telugu 5.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X