For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Promo: షోలో ఊహించని సంఘటన.. బిడ్డను కూడా కోల్పోయానని ఏడ్చేసిన ఆనీ మాస్టర్

  |

  బిగ్ బాస్.. సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన జరిగింది. బిడ్డను కోల్పోయానంటూ ఆనీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  రంజుగా సాగుతోన్న ఆట.. అన్నీ కొత్తగానే

  రంజుగా సాగుతోన్న ఆట.. అన్నీ కొత్తగానే


  ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఐదో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగానే సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య భీకరమైన మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ఇదే కాదు.. టాస్కులన్నీ కొత్తగానే జరుగుతున్నాయి.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

   బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్కుతో ఇలా

  బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్కుతో ఇలా

  ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్‌లో సభ్యులుగా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.. ఎల్లో టీమ్‌ సభ్యులుగా షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ.. రెడ్‌ టీమ్‌ సభ్యులుగా విశ్వ, శ్రీరామ్‌, ప్రియ.. గ్రీన్‌ టీమ్‌ సభ్యులుగా రవి, లోబో, శ్వేతలను విభజించారు. ఇక, సిరి హన్మంత్, కాజల్‌ను సంచాలకులుగా నియమించారు.

  అన్ని టీమ్‌లూ పోటీగా... వాళ్లు మాత్రమే

  అన్ని టీమ్‌లూ పోటీగా... వాళ్లు మాత్రమే


  మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కు పోటాపోటీగా జరిగింది. ప్రతి టీమ్ సభ్యులూ తమ దగ్గర ఉన్న మెటీరియల్‌తో బొమ్మలను చక్కగా తీర్చిదిద్దారు. అయితే, అందులో కొన్ని బొమ్మలు సరిగా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ కొన్నింటిని రిజెక్ట్ చేశారు. ఇక, ఇందులో రవి టీమ్ మాత్రం ముందంజలో ఉన్నట్లు కనిపించింది.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  రవి టీమ్‌కు పవర్ స్విచ్.. అధికారం ఇచ్చి

  రవి టీమ్‌కు పవర్ స్విచ్.. అధికారం ఇచ్చి

  బిగ్ బాస్ షోలో బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రవి టీమ్‌ విజయం సాధించినట్లు వాళ్లకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ అధికారంతో మరో టీమ్‌కు సంబంధించిన బొమ్మలన్నింటినీ స్వాధీనం చేసుకోవచ్చని చెప్పాడు. అందుకు అనుగుణంగానే రవి టీమ్ వాటిని తీసుకోవడం చూపించారు.

  శ్వేతా వర్మతో గొడవకు దిగిన ఆనీ మాస్టర్

  బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. రవి టీమ్‌లోని శ్వేత, లోబోలు మిగిలిన టీమ్‌లకు సంబంధించిన బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆనీ మాస్టర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అంతే శ్వేత దగ్గర ఉన్న బొమ్మలను లాక్కుంది. దీంతో వాళ్లిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఎవరు ఆపినా ఆమె మాత్రం మరింతగా రెచ్చిపోయింది.

  Recommended Video

  Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu
  బిడ్డను కోల్పోయాను అంటూ ఏడ్చేసింది

  బిడ్డను కోల్పోయాను అంటూ ఏడ్చేసింది

  ఆనీ మాస్టర్ తనపై విరుచుకు పడుతున్నా శ్వేతా వర్మ మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయింది. అయితే, ఆ తర్వాత 'నును నిన్ను జబర్ధస్తీ చేశానా' అని ఆనీ అడగగా అవును అంటూ సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆనీ 'మొన్న టాస్కులో ఫ్రెండ్‌ను కోల్పోయా.. ఈ టాస్కులో బిడ్డను కోల్పోయా' అంటూ ఏడ్చేసింది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. In Upcoming Episode.. Big Fight Between Anee Master and Swetha Varma. తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ తాజాగా మొదలైంది. రాబోయే ఎపిసోడ్‌లో ఆనీ మాస్టర్, శ్వేత వర్మ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X