For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. సింగిల్ అయితే టాప్ ప్లేయర్.. డబుల్ అంటే ఆమె కూడా!

  |

  బిగ్ బాస్... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని రియాలిటీ షో ఇది. అంతలా దీన్ని ఓన్ చేసేసుకున్నారు మన ఆడియెన్స్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అందుకే ఈ షో తెలుగులో ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా మొదలైంది. ఇందులో 13ద వారానికి సంబంధించిన ఓటింగ్ ముగిసింది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దామా!

  ఆలస్యంగా పుంజుకున్న షో

  ఆలస్యంగా పుంజుకున్న షో

  తెలుగులో బిగ్ బాస్ షో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. అవన్నీ ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. కానీ, ఆరో సీజన్ మాత్రం అంచనాలను అందుకోకపోగా దారుణమైన రేటింగ్‌తో నిరాశ పరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహకులు పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన పెరగడంతో పాటు రేటింగ్ పుంజుకుంటోంది.

  టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

  ఈ సీజన్‌లో వాళ్లంతా ఔట్

  ఈ సీజన్‌లో వాళ్లంతా ఔట్

  ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి పన్నెండు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌లు ఎలిమినేట్ అయ్యారు.

  ఈ వారంలో ఆ ఆరుగురు

  ఈ వారంలో ఆ ఆరుగురు

  ప్రస్తుత సీజన్‌లోని పదమూడో వారం నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా జరిగింది. ఇక, ఈ వారానికి జరిగిన ఈ టాస్క్‌లో రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల ఇనాయా సుల్తానా సేఫ్ అవగా.. ఓట్లు పడని కారణంగా శ్రీహాన్ చోటూ కూడా నామినేషన్స్‌ను తప్పించుకున్నాడు.

  నిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షో

  ఓటింగ్‌లో మార్పుల వల్ల

  ఓటింగ్‌లో మార్పుల వల్ల

  గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. ఇక, ఇది ఇప్పుడు చివరి దశకు చేరడంతో ప్రతి ఒక్కరూ తమ అభిమాన కంటెస్టెంట్‌ను సేఫ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పదమూడో వారం ఓటింగ్‌ ఎన్నో ట్విస్టులతో సాగినట్లు తెలిసింది. దీంతో అందరు కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కూడా కనిపించాయి.

  రేవంత్ టాప్.. ఆది రెండు

  రేవంత్ టాప్.. ఆది రెండు

  ఆరో సీజన్‌లో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో సింగర్ రేవంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా నిలిచాడు. అందుకే అతడు ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓట్లతో టాప్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే పదమూడో వారం కూడా రేవంత్‌కే ఎక్కువ ఓట్లు పోల్ అవడంతో టాప్‌లో నిలిచాడు. ఇక, ఆది రెడ్డి రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

   తర్వాతి స్థానాల్లో ఎవరు?

  తర్వాతి స్థానాల్లో ఎవరు?

  చివరి దశకు చేరడంతో ఎంతో ఆసక్తిగా మారిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదమూడో వారానికి జరిగిన ఓటింగ్‌లో సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా రెండో స్థానంలో ఆది రెడ్డి, మూడో స్థానంలో రోహిత్ సాహ్నీ, నాలుగో స్థానంలో కీర్తి భట్, ఐదో స్థానంలో శ్రీ సత్య, ఆరో స్థానంలో ఫైమాలు ఉన్నారని బుల్లితెర వర్గాల ద్వారా సమాచారం అందింది.

  ముగ్గురిలోనే ఎలిమినేషన్

  ముగ్గురిలోనే ఎలిమినేషన్

  బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలే స్టేజ్‌కు చేరింది. దీంతో పదమూడో వారానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న ఫైమాతో పాటు శ్రీ సత్య కానీ, కీర్తి భట్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటే మాత్రం వందకు వంద శాతం ఫైమానే ఎలిమినేట్ అవుతుందని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss Telugu 13th Season Running Successfully. Faima or Sri Satya or Keerthi will Eliminate in 13th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X