Don't Miss!
- Finance
Adani FPO: వెనక్కి తగ్గేదే లే అంటున్న అదానీ.. మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా..?
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bigg Boss Elimination: ఓటింగ్‌లో మరో ట్విస్ట్.. ఫినాలే ముందు అతడికి ఇనాయా షాక్.. ఎలిమినేట్ ఎవరంటే!
దాదాపు ఆరేళ్లుగా తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా ప్రేక్షకులు దీనికి ఓ రేంజ్‌లో స్పందనను అందించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను మరింత రసవత్తరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లోనే చివరి ఎలిమినేషన్‌ను నిర్ణయించే 14వ వారం ఓటింగ్ ఎలా సాగుతుంది? ఎవరికి తక్కువ ఓట్లు వస్తున్నాయి? చూద్దాం పదండి!

దెయ్యం టాస్కుతో రంజుగానే
ఎన్నో అనుమానాల నడుమ వచ్చినా తెలుగులో భారీ ఆదరణను అందుకుని నెంబర్ వన్ షోగా నిలిచింది బిగ్ బాస్. అయితే, ఇప్పుడు ఆరో సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణను అందుకోవడం లేదు. కానీ, చివరి దశకు చేరడంతో ఇందులో ఇప్పుడు దెయ్యం టాస్కును పెట్టారు. దీంతో ఈ సీజన్ ఆఖర్లో మంచి స్పందనను అందుకుని రేటింగ్‌ను భారీగా అందుకుంటోంది.
గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!

21 మంది 14 మంది అవుట్
తాజా సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసినా.. రెండు, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి 13 వారాలకు 14 మంది వెళ్లారు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్, ఫైమాలు బయటకు వెళ్లిపోయారు.

నామినేషన్స్‌లో ఆరుగురు
బిగ్ బాస్ ఆరో సీజన్ విజేతను నిర్ణయించే సమయం ఆసన్నం అయింది. ఫినాలే కోసం ఐదుగురు సభ్యులు చివరి వారంలోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే టాస్కులో గెలిచిన శ్రీహాన్ తప్ప మిగిలిన వాళ్లందరినీ ఈ సారి నేరుగా నామినేట్ చేశారు. అంటే రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు ఈ వారం నామినేట్ అయ్యారు.
బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

ఓటింగ్‌లో చాలా ట్విస్ట్‌లు
బిగ్ బాస్ ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ చాలా ట్విస్టులతో సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటి రోజు టాప్‌లో ఉన్న వాళ్లు ఇప్పుడు చివరికి చేరుకునే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతి ఎపిసోడ్‌కూ ఓటింగ్ సరళిలో చాలా వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చాలా సస్పెన్స్‌గా మారిపోయింది.

టాప్‌లో అతడు.. ఇనాయా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది సభ్యులు వచ్చారు. అందులో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాడు. అందుకు అనుగుణంగానే పద్నాలుగో వారం కూడా అతడే ముందంజలో ఉన్నాడు. దీంతో ఈ వారం కూడా అతడు సేఫ్ అయినట్లే లెక్క. అతడి తర్వాత ఉన్న రోహిత్‌కు షాకిస్తూ ఇనాయా రెండో స్థానానికి చేరిందని టాక్.
పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

వాళ్లంతా ఏ స్థానాలో అంటే
బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్, ఇనాయాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచారని తెలిసింది. వీళ్లిద్దరి తర్వాత అంటే మూడో స్థానంలో రోహిత్ సాహ్నీ ఉన్నట్లు సమాచారం. ఇక, దెయ్యం టాస్కులో అదరగొట్టేసిన ఆది రెడ్డి ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకాడని అంటున్నారు. అంటే వీళ్లంతా సేఫ్ అయినట్లే లెక్క.

మళ్లీ వాళ్లిద్దరే డేంజర్ జోన్‌లో
పద్నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ప్రస్తుతం కీర్తి భట్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీ సత్య ఆరో స్థానానికి పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కానీ, శ్రీహాన్ ఓట్లు శ్రీ సత్యకు పడితే మాత్రం ఆమె ఈ వారం కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి!