For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ ప్రమాదంలో టాప్ కంటెస్టెంట్లు

  |

  తెలుగు బుల్లితెరపై సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. టాప్ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అంతేకాదు, ఎప్పటికప్పుడూ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  ఎంత చేసినా రేటింగ్ రావట్లే

  ఎంత చేసినా రేటింగ్ రావట్లే

  తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతూ.. ప్రేక్షకుల మద్దతుతో రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో కొత్తగా నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, దీనికి మాత్రం రేటింగ్ అంతగా లభించట్లేదు.

  యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

  ఇప్పటికే ఏడుగురు అవుట్

  ఇప్పటికే ఏడుగురు అవుట్


  తాజా సీజన్‌లోకి గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, ఆర్జున్‌లు వెళ్లిపోయారు.

  ఏకంగా 14 మంది నామినేట్

  ఏకంగా 14 మంది నామినేట్

  ఎప్పటి లాగానే ఆరో సీజన్‌లోని ఎనిమిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ఇలా ఈ టాస్కు మొత్తంలో ఇంట్లో ఉన్న 14 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, వాసంతి, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, ఆర్జే సూర్యలు ఉన్నారు.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  ఓటింగ్‌లో మార్పులు వస్తూ

  ఓటింగ్‌లో మార్పులు వస్తూ

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్లలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్లంతా అనూహ్యంగా వెళ్లిపోయారు. దీంతో ఈ సారి ఓటింగ్ చాలా మార్పులతో సాగుతున్నట్లు అర్థం అవుతోంది. అదే కంటిన్యూ అవుతూ ఎనిమిదో వారంలో కూడా పోలింగ్ ఊహించని విధంగా సాగుతోంది. దీంతో తరచూ కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  టాప్ 2లో తేడా లేకుండానే

  టాప్ 2లో తేడా లేకుండానే

  తాజా సీజన్‌లోని ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ సోమవారం రాత్రి నుంచే అనూహ్యంగా సాగుతోంది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో టైటిల్ ఫేవరెట్ రేవంత్‌ అత్యధిక ఓటింగ్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడట. అలాగే, శ్రీహాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని తెలిసింది.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  మిగిలిన స్థానాలు మాత్రం

  మిగిలిన స్థానాలు మాత్రం

  ఆరో సీజన్ ఎనిమిదో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో తాజా సమాచారం ప్రకారం.. గీతూ రాయల్ మూడో స్థానంలో, నాలుగో స్థానంలో మెరీనా అబ్రహం, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో ఇనాయా సుల్తానా, ఏడో స్థానంలో జబర్ధస్త్ ఫైమా, ఎనిమిదో స్థానంలో బాలాదిత్య, తొమ్మిదో స్థానంలో రోహిత్, పదో స్థానంలో కీర్తి భట్, పదకొండో స్థానంలో వాసంతిలు ఉన్నారని తెలిసింది.

  ఎలిమినేషన్ షాకింగ్‌గానే

  ఎలిమినేషన్ షాకింగ్‌గానే

  తాజా సీజన్ ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌ ఊహించని విధంగా సాగుతుంది. ప్రస్తుతం రాజశేఖర్ 12వ స్థానంలో ఉన్నాడని తెలిసింది. అలాగే, శ్రీ సత్య, ఆర్జే సూర్య 13, 14 స్థానాల్లో కొనసాగుతున్నారట. అంటే స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరొందిన సూర్య, శ్రీ సత్య ఈ సారి ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారన్న మాట. ఇదే కంటిన్య అయితే మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్ తప్పదు.

  English summary
  Bigg Boss Telugu 8th Season Running Successfully. Rajasekhar, Sri Satya and RJ Surya Gets Very Less Votes in 8th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X