Bigg Boss: బిగ్‌బాస్‌లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్.. హాస్పిటల్‌కు తరలింపు!
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసును కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రస్తుతం షాకింగ్ టర్న్ తీసుకుంది. ఈ సీజన్ లో ఎన్నాడు చూడని ట్విస్టులు, టర్న్స్ చూస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎప్పుడు ఎవరి స్థానానికి ముప్పు వాటిల్లుతుందో? అనే టెన్షన్ కంటెస్టెంట్స్ లోనే కాకుండా బిగ్ బాస్ లవర్స్ లో కూడా మొదలైంది. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ టీం రీఎంట్రీ పేరుతో మాజీ కంటెస్టెంట్లు అయినా భరణి శంకర్, శ్రీజ దమ్మూ లను హౌజ్ లోకి పంపించారు. అయితే.. భరణికీ తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారట. ఇంతకీ ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ షోను మరింత ఉత్కంఠ భరితంగా మార్చాలని బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భరణి పేరు (Bharani Shankar), దమ్మూ శ్రీజలను తిరిగి హౌస్ లోకి పంపించారు. వాస్తవానికి భరణి రీ ఎంట్రీ అనగానే హౌస్ లోని కంటెస్టెంట్లతోపాటు ఆడియన్స్ కూడా కొత్త జోష్ వచ్చింది. భరణి తన సింపుల్ నేచర్, మంచి మనసుతో ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. కానీ, ఆరోవారం అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో "భరణి లాంటి వ్యక్తిని ఎందుకు బయటకు పంపారు?" అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అందుకే ఆడియన్స్ డిమాండ్ మేరకు భరణికి మళ్లీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

భరణితో పాటు మరో మాజీ కంటెస్టెంట్ శ్రీజ (Sreeja) కూడా రీ-ఎంట్రీ ఇచ్చారు. శ్రీజ ఎలిమినేట్ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నిరాశకు గురి చేసింది. ఆడియన్స్ డిమాండ్ మేరకు బిగ్ బాస్ హౌస్‌లో వీరిని హౌస్ లోకి పంపించారు. వీరిద్దరి రీ ఎంట్రీ కంటెస్టెంట్స్‌కే కాకుండా ఆడియన్స్‌కి కూడా ఒక పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. అయితే.. హౌస్‌లో నిన్న రాత్రి జరిగిన ఒక ఫిజికల్ టాస్క్ సమయంలో మాజీ కంటెస్టెంట్ భరణి శంకర్ (Bharani Shankar)తీవ్ర గాయాలపాలవ్వడం, ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. మంగళవారం రాత్రి బిగ్ బాస్ హౌస్‌లో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆధారంగా ఒక భారీ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ రెండు టీములుగా విడిపోయి.. హోరాహోరీగా పోరాటం చేశారు. కానీ, ఆట మెల్లగా కాంపిటీషన్ నుండి రియల్ ఫైట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఆ సమయంలో భరణి స్విమ్మింగ్ పూల్ దగ్గర బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయాడు. టాస్క్ ఉత్కంఠలో ఉన్న ఇతర హౌస్‌మేట్స్ భరణి పడిపోవడాన్ని చూసి షాక్ అయ్యారు. బిగ్ బాస్ వెంటనే టాస్క్ నిలిపివేసి, ఆయనను బయటకు తీశారు. ఆయనకు గాయాలు కావడంతో మెడికల్ టీమ్‌ని లోపలికి పంపించారు. వెంటనే భరణిని హౌస్ మెయిన్ డోర్ ద్వారా బయటకు తీసుకెళ్లి హాస్పిటల్‌కు తరలించారు. ప్రాథమిక పరీక్షల్లో ఆయనకు రిబ్స్ దగ్గర గాయాలు, చెస్ట్ నొప్పి, శ్వాస సమస్యలు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారట. రిబ్ ఫ్రాక్చర్ అయ్యిందా లేదా అన్నది స్కానింగ్ తర్వాతే తెలుస్తుందని తెలుస్తోంది. భరణి గాయపడిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మొత్తం టెన్షన్ వాతావరణంలోకి మారింది. ముఖ్యంగా తనూజ, దివ్య వంటి సన్నిహిత కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భరణి ఆరోగ్యం బాగుంటే ఆయన మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ డాక్టర్లు పూర్తిగా ఫిట్‌గా ఉన్నారనే నిర్ధారణ ఇచ్చిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుంటారు. లేదంటే, ఆయన స్థానంలో మనీష్ లేదా ప్రియాకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











