Bigg Boss Telugu 9 voting: ఊహించని ట్విస్ట్.. టాప్‌లోకి ఫోక్ సింగర్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss 9 Telugu బిగ్ బాస్ అంటేనే షాకింగ్ న్యూస్‌లు, ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, గొడవలు, అలకలు, లవ్ ట్రాక్స్. ఇదోక మల్టీ ఎంటర్టైనర్ కాంబో. ప్రతి సీజన్‌ను ప్రత్యేక కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తారు. ఈ సీజన్ ను "చదరంగం కాదు, రణరంగం"గా ప్లాన్ చేశారు. ఓనర్ వర్సెస్ టెనెంట్స్ గా గేమ్ డిజైన్ చేశారు. హౌస్‌లోకి సెలబ్రెటీలు, కామనర్స్ ను రప్పించి, కంటెస్టెంట్ల మధ్య ఉత్కంఠ రేపుతున్నారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోన్న ఈ రియాలిటీ గేమ్ మూడోవారం చివరికి చేరుకుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ షోలో 18 డే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గురువారం ఎపిసోడ్‌లో జరిగిన ఆ పరిణామం హౌస్ పూర్తిగా రణరంగంగా మార్చేసింది. ఒక్కో కంటెస్టెంట్ తన మైండ్ గేమ్ తో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. కంటెంట్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ, బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ తో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి. ముఖ్యంగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఒక కామనర్ హౌస్‌లో హల్చల్ చేసింది. కంటెస్టెంట్ల తప్పులను ఎత్తిచూపుతూ.. సెగలు రేపింది. ఎన్నాడు లేని విధంగా గురువారం ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మూడో వారానికి చేరుకొని, నామినేషన్స్ ప్రక్రియతో హౌస్ ఒక్కసారిగా హీటెక్కితే.. అందుకు తగ్గట్టుగానే ఓటింగ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇప్పటివరకూ హౌజ్‌లో మొత్తం 13 కంటెస్టెంట్స్ ఉన్నారు. మూడో వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల, ఫ్లోరా సైని ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. తన ఇష్టమైన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ తో పాల్గొంటున్నారు.
టాప్ లో ఫోక్ సింగర్..
బిగ్ బాస్ ఓటింగ్ జోరుగా సాగుతోంది. లక్షలాది మంది తన అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్నా సోషల్ మీడియా ఓటింగ్ అంచనాల ప్రకారం.. ఓటింగ్ లో తెలుగు ఫోక్ సింగర్ రాము రాథోడ్ టాప్ 1 స్థానంలో నిలిచాడు. అతనికి దాదాపు 27 శాతం ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఫ్లోరా సైని 25.71% ఓటింగ్ పోలయ్యాయి. అంతే కాకుండా ఫ్లోరా సైని టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ సాధించడంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యింది. ఇక సోల్జర్ కల్యాణ్ పడాల 13. 53% ఓటింగ్ తో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ 13.3% ఓటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచాడు.
డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్లు
బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారంలో డేంజర్ జోన్‌లో ఉన్నవారు రీతూ చౌదరి, ప్రియా శెట్టి. వీరిలో రీతూ 11. 98 శాతం ఓటింగ్ తో ఐదో స్థానంలో, ప్రియా 8.55% ఓటింగ్ తో చివరి స్థానంలో ఉన్నాయి. రీతూ హౌస్‌లోని లవ్ డ్రామా, పర్సనల్ వీడియోల కారణంగా ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. ఈ వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. లేదా ప్రస్తుతం ఓ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.
మొత్తానికి మూడో వారంలో ఓటింగ్ ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. టాప్ ప్లేసులో రాము రాథోడ్ నిలవడం, డేంజర్ జోన్‌లో రీతూ చౌదరి ఉండటం, ఫ్లోరా సైని ఇమ్యూనిటీ పవర్ ను కైవసం చేసుకోవడం వంటి ఆంశాలతో గేమ్ ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాకుండా హౌస్‌లో లవ్ డ్రామా, వ్యక్తిగత వివాదాలు అన్ని కలిపి ఈ వారం ఎలిమినేషన్ ఫలితాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











