Ramya Moksha: రమ్య మోక్ష షాకింగ్ ఎలిమినేట్.. పచ్చళ్ల పాప 2 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9). ఇప్పుడు మరింత ఉత్కంఠభరిత దశలోకి చేరింది. ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగిన ఈ షో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరో స్థాయికి ఎక్కింది. ప్రతి వారం కొత్త ట్విస్ట్‌లు, ఎలిమినేషన్లు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం ఏడవ వారం పూర్తి కాగా, ఎనిమిదవ వారంలోకి షో ప్రవేశించింది. ఈ వారం ఎలిమినేషన్‌పై పెద్ద చర్చ జరుగుతోంది.

ఎందుకంటే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయేషా (Ayesha) ఇప్పటికే అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని అభిమానులు భావించారు. కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్య మోక్ష (Ramya Moksha)హౌస్‌కి గుడ్‌బై చెప్పాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో రమ్య ఎలిమినేషన్ కు కారణాలేంటీ? ఇంతకీ 2 వారాల్లో ఎంత సంపాదించుకున్నది చూస్తే..

Bigg Boss 9 Telugu Wild Card Entry Ramya Moksha Eliminated After Two Weeks Earned 6 Lakh Before Exit

"అలేఖ్య చిట్టీ పికిల్స్" పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన రమ్య మోక్ష, 5వ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. షోలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆమె చర్చనీయాంశంగా మారింది. ఫిజికల్ టాస్క్‌లలో మగ కంటెస్టెంట్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ, 'ఫైర్ స్ట్రోమ్' లాంటి ఎంట్రీ ఇచ్చింది. గత వారం టాస్క్‌లో భరణిని సైతం ఈడ్చుకొని పక్కకు పడేసిన సన్నివేశం బిగ్ బాస్ హౌస్‌లో హైలైట్‌గా మారింది. రమ్య మోక్ష ఆటలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఆమె నోటి దూల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పడాల, తనూజ మధ్య రిలేషన్‌పై చేసిన కామెంట్స్‌ హౌస్‌లోనే కాకుండా బయటా పెద్ద దుమారం రేపాయి. ఆ వారం నామినేషన్స్‌లో లేని కారణంగా బయటకు వెళ్లకుండా తప్పించుకున్నా, తరువాతి వారంలో ఆమె తనూజను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.
అలాగే, లైవ్ క్లిప్స్‌లో కట్ కాని కొన్ని సీన్స్ ఆమెకు నెగటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి.

ఇలా రమ్య మోక్ష ఎనర్జీటిక్ గా ఉన్నప్పటికీ, ఆమె నోటి దూలే చివరికి ఆమెకు మైనస్ అయింది. ఇతర కంటెస్టెంట్లపై వ్యక్తిగత విమర్శలు చేయడం, హౌస్‌లో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్‌లో పాల్గొనడం వల్ల నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. "డ్రామా కోసం హద్దులు దాటింది", "తనూజను టార్గెట్ చేయడం రివర్స్ అయిపోయింది" అంటూ నెటిజెన్స్ తీవ్రంగా స్పందించారు.

రమ్య మోక్ష ఎలిమినేషన్ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆమెను "డ్రామా క్వీన్ అవుట్ అయినందుకు షో బోరింగ్ అవుతుంది" అంటుంటే, మరికొందరు "తనూజపై వ్యక్తిగత దాడులు చేసి హద్దు దాటింది... కరెక్ట్ ఎలిమినేషన్" అంటున్నారు. ప్రేక్షకుల ఓటింగ్‌లో కూడా రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్‌లో నిలిచారు. అందులో ఎక్కువ నెగెటివిటీ తెచ్చుకున్న రమ్యనే బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది.

రమ్య మోక్ష రెమ్యూనరేషన్ ఎంతంటే...
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా వచ్చిన రమ్య మోక్ష, సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు వారానికి రూ.2-3 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు బిగ్ బాస్ లోపలి వర్గాల సమాచారం. ఈ లెక్కన ఆమె రెండు వారాలు హౌస్‌లో ఉన్నందున సుమారు రూ.4 నుంచి రూ.6 లక్షల వరకు సంపాదించినట్టు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X