For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్స్ మీటింగ్.. ఇస్మార్ట్ బ్యూటీతో కలిసి అక్కడికి వెళ్లేందుకు సిద్దం.. అలీ రెజా బిజీ బిజీ

  |

  బిగ్‌బాస్ షో ముగిసినా.. అది హడావిడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కంటెస్టెంట్లందరూ తమ ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. విన్నర్‌గా నిలిచిన రాహుల్ హైద్రాబాద్ గల్లీలోనే తిరుగుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా.. రన్నర్‌గా మిగిలిన శ్రీముఖి.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. అయితే బుల్లితెర అర్జున్ రెడ్డిగా ఫేమస్ అయిన అలీ రెజా మాత్రం తన అభిమానులను కలిసేందుకు సిద్దమయ్యాడు.

  తన కోపంతోనే క్రేజ్..

  తన కోపంతోనే క్రేజ్..

  టాస్క్‌లో వంద శాతం తన వంతుగా వంద శాతం ప్రయత్నించి అందరి మనసులను ఆకట్టుకున్నాడు. మూడీ సీజన్ మొత్తానికి టాస్క్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అయితే ఈ క్రమంలో అతని ప్రదర్శించే అగ్రెసివ్ నెస్ అతనికి ఎనలేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రతీ టాస్క్‌లో తనదైన శైలిలో విజృంభించి బుల్లితెర అర్జున్ రెడ్డిగా అభిమానులతో పిలిపించుకున్నాడు.

   అకస్మాత్తుగా ఎలిమినేషన్..

  అకస్మాత్తుగా ఎలిమినేషన్..

  అప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్‌లోకి రాకుండా అలీ రెజా మంచి గేమ్ ఆడుతూ వచ్చాడు. అనూహ్యంగా ఆరో వారంలో నామినేషన్‌లోకి అలీ రెజా వచ్చేశాడు. అయితే అలీ ఎలిమినేట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. బలమైన కంటెస్టెంట్ అని అనుకున్న అలీ ఎలిమినేట్ అవడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లందరూ షాక్‌కు లోనయ్యారు.

  సోషల్ మీడియాలో ప్రచారం.. అలీ రీఎంట్రీ

  సోషల్ మీడియాలో ప్రచారం.. అలీ రీఎంట్రీ

  అలీ ఎలిమినేషన్‌తో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్వీట్లు పోటెత్తాయి. #WEWANTALIBACK అంటూ ట్రెండ్ చేశారు. అలీ ఫాలోవర్స్ చేసిన ట్వీట్ల సెగ బిగ్‌బాస్ బృందానికి తాకినట్టు కనిపించింది. అటుపై రెండు మూడు వారాల తరువాత అలీని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపించేశారు. దీంతో హౌస్‌లో మళ్లీ మునుపటి హడావిడి కనిపిస్తుందని అనుకున్నారు.

  రీఎంట్రీ తరువాత తగ్గిన జోరు..

  రీఎంట్రీ తరువాత తగ్గిన జోరు..

  రీఎంట్రీ ఇచ్చిన అలీ.. మునుపటిలా అగ్రెసివ్‌గా ప్రవర్తించలేదు. చాలా కూల్‌గా సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు. అప్పటిలా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా స్ట్రాటజీస్ ప్లే చేసినట్టు కనిపించింది. ఇదే విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ.. అమ్మలక్కల ముచ్చట్లు పెడుతున్నావ్.. ఆట ఆడంటూ చురకలంటించాడు. అలీ భార్య వచ్చి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. అందరూ పాత అలీని చూడాలనుకుంటున్నారని, బాగా ఆడమని సలహా ఇచ్చింది.

  టాప్5గా నిలిచిన అలీ..

  పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో చివరకు ఐదో స్థానంలో నిలిచాడు అలీ. తాను గనుక మధ్యలో ఎలిమినేట్ కాకపోతే.. టాప్2లో ఉండేవాడినట్టు ధీమా వ్యక్తం చేశాడు. రీఎంట్రీ అన్న ముద్ర పడిందని అందుకే తనకు ఓట్లు తగ్గాయని లేదంటే తాను వేరే స్థానంలో ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. తాను హౌస్‌లో మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు, టాప్5లో నిలిచేందుకు ఓట్లు వేసిన ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు అలీ సిద్దమయ్యాడు.

  ఫ్యాన్స్ మీటింగ్.. నభాతో కలిసి షాప్ ఓపెనింగ్

  తనకు అంతగా మద్దతిచ్చిన అభిమానులందర్నీకలవాలనుకుంటున్నానని, నవంబర్ 10, ఉదయం 10.30గంటలకు సీతాఫల్ మండి ప్రభుత్వ కళాశాలకు అందరూ రావాలని ఓ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేశాడు. జహాపనా వైజాగ్ స్టోర్‌ను ప్రారంభించేందుకు నభా నటేష్‌తో కలిసి వైజాగ్ వెళ్లనున్నట్లు తెలిపాడు. ఇలా అలీ ప్రస్తుతం బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

  English summary
  Bigg Boss Fame Ali Reza Conducts A Fans Meet. And He Is Going To Open Jahanpanah Store In Vizag With Nabha Natesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X