అక్కడ టాటూ చూపిస్తూ.. గుర్రంతో అలా.. దీప్తి సునైనా అరాచకం!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా, సెలబ్రెటీగా మారిపోయారు దీప్తి సునైన. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, రీల్స్‌తో కుర్రకారులో భారీ ఫాలోయింగ్ సంపాదించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి.. గతంలో హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేసేవారు. అయితే ఇటవలి కాలంలో ఆమె తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా దీప్తి సునైన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారాయి. ఈ వివరాల్లోకి వెళితే..
డబ్‌స్మాష్ వీడియోలతో క్రేజ్
హైదరాబాద్‌కు చెందిన దీప్తి సునైన తొలుత డబ్‌స్మాష్, రీల్స్‌తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించారు. 2018లో వచ్చిన కిర్రాక్ పార్టీ అనే మూవీలో నటించారు . ఈ ఫాలోయింగ్‌తో దీప్తి సునైనకు బిగ్‌బాస్ తెలుగు 2లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. తన గ్లామర్‌తో షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన దీప్తి.. బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. పెద్దగా సినిమాలు చేయకున్నా.. వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలతో క్రేజ్ పెంచుకున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడు నటుడు తనీష్‌తో క్లోజ్‌గా ఉన్న దీప్తి తమ కెమిస్ట్రీతో హాట్ టాపిక్‌గా మారారు.

షణ్ముఖ్‌తో బ్రేకప్
అయితే మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి ప్రేమలో పడి సుదీర్ఘ కాలం పాటు డేటింగ్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకున్న దశలో షన్నూకి బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. ఆ సమయంలో సిరి హనుమంత్‌తో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండటంతో వీరి మధ్య గ్యాప్ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 5 ముగిసిన వెంటనే షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి అభిమానులు ఆమె నిర్ణయంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి. షన్నూ... షార్ట్ ఫిలింస్, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
బిజినెస్‌లోకి దిగిన దీప్తి
ఇక.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని దీప్తి సునైన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలు, కవర్ సాంగ్స్‌తో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గానూ బాగానే వెనకేసింది సునైన. ఇటీవలే హెచ్‌కే పర్మినెంట్ మేకప్ క్లినిక్ పేరుతో చెన్నైలో ఓ బిజినెస్ ప్రారంభించింది. ఐబ్రో మైక్రోబ్లిడింగ్, లిప్ కలర్ కరెక్షన్‌తో పాటు ఇతర కాస్మోటిక్ సేవలు ఇక్కడ దొరుకుతాయని తెలిపింది. ప్రభాస్, రామ్ చరణ్‌లకు వీరాభిమాని అయిన దీప్తి సునైన... షన్నూతో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఉంటోంది.
బ్లాక్ శారీలో అరాచకం
30కి చేరువ అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతారా? అని తల్లిదండ్రులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి వెకేషన్స్‌కి వెళుతూ కాస్తంత సేద తీరుతున్నారు దీప్తి. వీటిలో ఆధ్యాత్మిక యాత్రలు కూడా ఉండటం విశేషం. తాజాగా బ్లాక్ శారీలో ఓ బీచ్‌లో దీప్తి సునైన చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్‌గా మారింది. వీపుపై ఉన్న టాటూని చూపిస్తూ ఆమె కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. వైరల్ అవుతోన్న దీప్తి సునైన అందాలను మీరూ చూసేయండి


Click it and Unblock the Notifications











