‘ఆఫర్ల కోసం పడుకుంటే తప్పేంటీ.. వాళ్ల కోరిక తీరిస్తేనే’
సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో వేధించే క్యాస్టింగ్ కౌచ్ భూతం రోజురోజుకు వికృతంగా మారుతోంది. నిత్యం ఎవరో ఒక నటి తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులపై మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. పైకి పెద్ద మనుషుల్లా నటిస్తూ కొందరు తమ జీవితాలను నాశనం చేశారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ హీరోయిన్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సెకండ్ లీడ్స్‌తోనే కెరీర్
ఉత్తరాది నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ దీక్షా పంత్. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత రచ్చ, ఒకలైలా కోసం, నూతిలో కప్పలు, గోపాలా గోపాలా, శంకరాభరణం, సొగ్గాడే చిన్ని నాయన, బంతిపూల జానకి, ఈగో సినిమాలతో తెలుగునాట పాపులర్ అయ్యారు దీక్ష. ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో చోటు దక్కించుకుంది.

బిగ్‌బాస్‌తో పాపులర్
బిగ్‌బాస్ హౌస్‌లో తన అందం, మైండ్ గేమ్‌తో అద్భుతంగా పోరాడిన దీక్షా పంత్ టైటిల్ పోరుకు ఒక అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనల్‌కు ముందు టాప్ 5లో ఆమె ఉంటారని అభిమానులు ఆశించారు. అయితే ఊహించని విధంగా దీక్షా పంత్ ఎలిమినేట్ అయ్యారు. శివబాలాజీ, అర్చన, ఆదర్శ్, హరితేజ, నవదీప్‌లు ఫైనల్‌కు చేరగా.. శివబాలాజీ సీజన్ 1 విజేతగా నిలిచారు. బిగ్‌బాస్‌తో దీక్షా పంత్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. అయితే గడిచిన 8 ఏళ్లుగా దీక్షా పంత్ సినిమాలకు దూరమయ్యారు. చివరిసారిగా ఈగోలో నటించారు.
సినిమాలు ఇంట్రెస్ట్ లేదు
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బిగ్‌బాస్, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి దీక్షా పంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే.. తాను సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, మోడలింగ్ వైపు వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సెక్స్ అండ్ సక్సెస్ రెండూ హ్యాపీయే.. ఫస్ట్ ది నువ్వు ఇస్తే, రెండోది ఆటోమేటిగ్గా వస్తుందని ఈ థియరీ చాలా మంది దగ్గర విన్నానని దీని మీద మీ ఓపీనియన్ ఏంటీ అని క్యాస్టింగ్ కౌచ్‌పై యాంకర్ ప్రశ్నించగా.. దీక్షాపంత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఇద్దరికీ ఇష్టం ఉంటే మీకెంటీ ప్రాబ్లమ్
అలా ఉంటే ఇంత టాలెంట్ ఇండస్ట్రీలో పరిచయం కాదు. అయితే ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో ఉన్నవాళ్లకి వచ్చిన సమస్య ఏంటీ అని దీక్ష ప్రశ్నించారు. నేను ఇంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు.. ఎవరికీ ఏది కరెక్ట్ అనిపిస్తాదో అది వాళ్లు చేయాలి. పర్సనల్‌గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ విధానానికి నేను ఒప్పుకోను.. చాలా వరకు దూరంగానే ఉంటాను. మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు వేరుగా సైగలు చేసేవారు. నేనే ఫేస్ మీదే నో చెప్పేదానిని.. ఆ వెంటనే రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం అందరితో క్లోజ్‌గా ఉండలేను.. అందుకే నటిగా సక్సెస్ కాలేకపోయానని దీక్షా పంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











